TE/Prabhupada 0451 - భక్తులు ఎవరో అతనిని ఎలా పూజించాలి తెలియకపోతే అప్పుడు మీరు కనిష్ట ఆధికారిగానే ఉంటారుLecture on SB 7.9.4 -- Mayapur, February 18, 1977


కేవలము ఈ అర్హత మాత్రమే, పవిత్రమైన భక్తుడిని, ఒక మహా-భాగవతుడిని చేస్తుంది. కానీ దశలు ఉన్నాయి. పుట్టుక నుండి వచ్చిన మహా-భాగవతుడు అయిన వారు, నిత్య-సిద్ధ అని పిలువబడుతారు. వారు నిత్యము, శాశ్వతముగా సిద్ధ, పరిపూర్ణము. వారు కొంత లక్ష్యము కోసం వస్తారు. ప్రహ్లాద మహారాజు ఈ లక్ష్యము కోసం వచ్చారు, రాక్షసులు, అతని తండ్రి కూడా అతనికి చాలా ఇబ్బందులు పెట్టాడు ఎందుకంటే అతను కృష్ణ చైతన్యమును కలిగి ఉన్నారు. ఇది ఉపదేశము. ప్రహ్లాద మహారాజు చూపించాలని కోరుకున్నాడు కృష్ణుడి ఆజ్ఞ ప్రకారము . హిరణ్యకశిపుడు కూడ వచ్చాడు - కృష్ణుడికి శత్రువుగా ఎలా మారాలి; ప్రహ్లాద మహారాజు ఒక భక్తుడు ఎలా కావాలో చూపించటానికి వచ్చారు. ఇది జరుగుతోంది.

మహా-భాగవతుడు... Kaniṣṭha-adhikārī, madhyama-adhikārī and mahā-bhāgavata, or uttama-adhikārī. Kaniṣṭha-adhikārī, ప్రారంభంలో వారికి అర్చా మూర్తిని ఖచ్చితముగా ఎలా పూజించాలో నేర్పవలసి ఉంటుంది. శాస్త్రం యొక్క ఆదేశాల ప్రకారము, గురువు యొక్క సూచనల ప్రకారము, అర్చాముర్తిని ఎల ఆరాధించాలో జ్ఞానము కలిగి ఉండాలి. నేర్చుకోవాలి

arcāyām eva haraye yaḥ
pūjāṁ śraddhāyehate
na tad-bhakteṣu cānyeṣu
sa bhaktaḥ prākṛtaḥ smṛtaḥ
(SB 11.2.47)

కానీ భక్తుడు పవిత్రమవ్వాలి. ఇది భక్తియుక్త సేవ యొక్క పురోగతి. కేవలం మనము అర్చా మూర్తి ఆరాధనలోనే నిమగ్నమై ఉంటే, మనము ఇతరుల గురించి పట్టించుకోకపోతే- Na cānyeṣu na tad-Bhakta - మీకు భక్తులు ఎవరో తెలియకపోతే, అతనిని ఎలా పూజించాలి, అప్పుడు మనము kaniṣṭha-adhikārī గానే ఉంటాము. madhyama-adhikārī అంటే అతను తన పరిస్థితి, ఇతరుల పరిస్థితి తెలుసుకోవాలి, భక్తుడు యొక్క స్థితి, దేవుడి స్థితి, అది madhyama-adhikārī అంటే Īśvare tad-adhīneṣu bāliśeṣu dviṣatsu ca ( SB 11.2.46) అతను నాలుగు రకాల దృష్టిని కలిగి ఉంటాడు: Bhagavān, īśvara; tad-adhīneṣu, అతను భగవాన్ యొక్క ఆశ్రయం తీసుకున్నవాడు - అంటే భక్తుడు - īśvare tad-adhīneṣu; baliśu; అమాయక పిల్లలు, ఉదాహరణకు ఈ పిల్లల వలె, Baliśa, arbhakaḥ; and dviṣatsu, అసూయ. ఒక madhyama-adhikārī ఈ నాలుగు వేర్వేరు వ్యక్తులను చూడగలడు, అతను వారితో భిన్నంగా వ్యవహరిస్తాడు. అది ఏమిటి?Prema-maitrī-kṛpopekṣā. Īśvara, దేవుణ్ణి ప్రేమించుట, కృష్ణ, ప్రేమ. మైత్రి. మైత్రీ అంటే స్నేహం చేయడము. భక్తుడు ఎవ్వరో, మనము అతనితో స్నేహం చేయాలి. అసూయపడకూడదు; మనము మిత్రుడు కావాలి. మైత్రి. అమాయకముగా, ఉదాహరణకు ఈ పిల్లల వలె , Kṛpa - వారిపై దయ చూపించడానికి, వారు భక్తుడు ఎలా అవ్వుతారు, వారు ఎలా నేర్చుకుంటారు, కీర్తన చేయడము, నృత్యం చేయడము, వారికి ఆహరం ఇవ్వడము, వారికి విద్యను ఇవ్వడము. దీనిని కృప అని పిలుస్తారు. చివరిగా, upekṣā. upekṣā అంటే అసూయపడే వారు, తీసుకోకండి, వారితో సహవాసం చేయకండి. Upekṣā. "లేదు, అతనిని ..."

కానీ మహా-భాగవతుడు, అతడు ఏవిధముగా upekṣā చేయడు. అతను ఎవరైతే dviṣatsu, వారిని కూడా ప్రేమిస్తాడు. ఉదాహరణకు ప్రహ్లాద మహారాజు లాగే. ప్రహ్లాద మహారాజు, అతని తండ్రి చాలా చాలా అసూయపడేవాడు. అయినప్పటికీ, ప్రహ్లాద మహారాజు తన వ్యక్తిగత ప్రయోజనము కోసం ఎలా౦టి దీవెనను అంగీకరించలేదు, కానీ అతను తన తండ్రిని క్షమించుటకు భగవంతుడు నరసింహస్వామిని వేడుకున్నారు, ఆ "నా తండ్రి ..." అతను వ్యక్తిగతముగా ఏదీ అడగలేదు. కానీ ఆప్పటికీ, అతనికి తెలుసు "నా జీవితమంతా నా తండ్రి శత్రువు యొక్క భాగాన్ని పోషించాడు, చాలా విధములుగా అవమానించాడు ... (విరామం) ఇది అవకాశం. నా తండ్రిని క్షమించమని నేను భగవంతుడిని నేను వేడుకుంటాను. " కృష్ణుడికి ఇది తెలుసు. అతని తండ్రి అప్పటికే క్షమించబడ్డాడు. ఎందుకంటే అతను ప్రహ్లాద మహారాజు యొక్క తండ్రి అయ్యాడు కనుక. అతను అప్పటికే వరము పొందాడు ఒక్క మంచి కుమారుడిని కలిగి ఉండటము సాధారణ విషయము కాదు. వెంటనే ప్రహ్లాద మహారాజు "నా తండ్రిని క్షమించు" అని నరసింహస్వామిని కోరారు. అందువలన అతను వెంటనే, "మీ తండ్రిని మాత్రమే కాదు- ఆతని తండ్రిని, ఆతని తండ్రిని, ఆతని తండ్రిని, అందరిని రక్షిస్తాను" అని అన్నాడు.

మనము ప్రహ్లాద మహారాజు నుండి పాఠము తీసుకోవాలి, కుటుంబములో ఒక్క పిల్లవాడు భక్తుడైతే, అతను ఉత్తమబాలుడు, ఉత్తముడు. అతను కుటుంబమునకు ఉత్తమ సేవను ఇస్తున్నాడు. కానీ అవివేకులు, వారు వేరే విధముగా తీసుకుంటున్నారు, "నా కుమారుడు భక్తుడిగా మారాడు. అతన్ని అపహరిస్తున్నారు , తిరిగి వారి మార్గములోకి తీసుకు వెళ్ళుతున్నారు". ప్రజలు చాలా మూర్ఖులు. మీరే చూడండి? వారు గొప్ప ప్రయోజనమును పొందాము అని అనుకోరు, "నా అదృష్టవంతుడైనా కుమారుడు భక్తుడు అయ్యాడు అని అనుకోరు. నా మొత్తం కుటుంబము రక్షించ బడుతుంది. "కానీ వారికి ఎటువంటి జ్ఞానం లేదు, వారికి మెదళ్ళు లేవు. అందువల్ల ఇది మెదడును కడగటము కాదు, ఇది మెదడును-ఇవ్వడము. వారికి మెదడు లేదు. (నవ్వు) కావున చాలా తీవ్రంగా తీసుకొని చక్కగా చేయండి.

ధన్యవాదాలు.

భక్తులు: జయ