TE/Prabhupada 0452 - బ్రహ్మ యొక్క రోజులో ఒక్కసారి కృష్ణుడు ఈ భూమిపైకి వస్తాడు



Lecture on SB 7.9.5 -- Mayapur, February 25, 1977


ప్రద్యుమ్న: అనువాదము - "భగవంతుడు నరసింహ స్వామి చిన్న పిల్లవాడు అయిన ప్రహ్లాద మహారాజును చూసినప్పుడు అతను తన పాదముల దగ్గర ప్రణామము చేసినప్పుడు, అతను తన భక్తుడిపట్ల ప్రేమతో చాలా ఆనంద పరవశుడు అయ్యాడు. ప్రహ్లాదుడిని పైకి లేపి, భగవంతుడు బాలుడి తలపై తన కమలపు చేతిని ఉంచారు ఎందుకంటే అతని చేతులు ఎల్లప్పుడూ అతని భక్తులందరిలో నిర్భయమును సృష్టించుటకు సిద్ధంగా ఉంటాయి. "

ప్రభుపాద:

sva-pāda-mūle patitaṁ tam arbhakaṁ
vilokya devaḥ kṛpayā pariplutaḥ
utthāpya tac-chīrṣṇy adadhāt karāmbujaṁ
kālāhi-vitrasta-dhiyāṁ kṛtābhayam
(SB 7.9.5)

భక్తుడు లేదా దేవదిదేవుడికి ఇష్టమైనదిగా మారడం చాలా సులభం. ఇది చాలా కష్టము కాదు. ఇక్కడ మనము ఉదాహరణని చూస్తాము, ప్రహ్లాద మహారాజు, ఐదు సంవత్సరల వయస్సు ... (విరమం) ... ఒక భక్తుడు, అతనికి దేవాదిదేవుడు మాత్రమే తెలుసు, అతను ప్రణామములు అర్పించినాడు. అది అతని అర్హతలు. ఎవరైనా దానిని చేయగలరు. ఈ ఆలయంలో ఎవరైనా ఇక్కడకు వచ్చి ప్రణామములు చేయవచ్చు. ఇబ్బంది ఎక్కడ ఉంది? కేవలం వ్యక్తి భావన కలిగి ఉండాలి "ఇక్కడ భగవంతుడు ఉన్నాడు కృష్ణుడు లేదా నరసింహస్వామి లేదా అతని బహుళ విస్తరణలో ఏదైనా ఒక్కటి. "

శాస్త్రములో చెప్పబడినది advaitam acyutam anādim ananta-rūpam (Bs. 5.33). కృష్ణుడికి అనంత-రూపములు ఉన్నాయి. అందువల్ల ప్రతి రూపము కృష్ణుడి యొక్క వాస్తవ రూపము యొక్క విస్తరణ. వాస్తవ రూపము కృష్ణుడు. Kṛṣṇas tu bhagavān svayam ( SB 1.3.28) అప్పుడు చాలా రూపములు ఉన్నాయి: రామ, నరసింహ, వరాహ, బలరామ, పరశురామ, మీన, తాబేలు, నరసింహ స్వామి. Rāmādi-mūrtiṣu kalā-niyamena tiṣṭhan (Bs. 5.39). అతను వివిధ రకములుగా ఎప్పుడూ ఉంటారు, అతను కేవలం కృష్ణుడి రూపములో మాత్రమే ఉన్నట్లు కాదు. ప్రతి రూపం, rāmādi-mūrtiṣu. ఇదే ఉదాహరణ, మనము అనేక సార్లు ఇచ్చిన విధముగా: ఉదాహరణకు సూర్యుడు, సూర్యుడి సమయము, ఇరవై నాలుగు గంటలు, ఇరవై నాలుగు గంటలు లేద ఇరవై నాలుగు అవతారములలో, ప్రతి సమయంలో ఉంటాయి. ఇప్పుడు ఇది ఎనిమిది గంటలు అయితే, ఏడు గంటలు పూర్తయింది అని కాదు. కాదు ప్రపంచములో ఇతర భాగములో ఏడు గంటల సమయం ఉంది. లేదా తొమ్మిది గంటలు. తొమ్మిది గంటలు కూడ ప్రస్తుతము ఉన్నది . పన్నెండు గంటలు కూడా ఉన్నది . గురుకృప మహారాజు ఇచ్చిన ఒక గడియారము నా దగ్గర ఉన్నది. (నవ్వు) అతను జపాన్ నుండి తెచ్చాడు. ఇది చాలా బాగుంది. వెనువెంటనే - ఇప్పుడు వివిధ ప్రదేశాల్లోని సమయం ఎంతో చూడవచ్చు. కావున అవి అన్ని ఉన్నాయి. అందువల్ల కృష్ణుడి లీలను నిత్య -లీల అని పిలుస్తారు, ఒక్క లీల జరుగుతుంటే , వేరే లీల పూర్తి అయింది అని కాదు ప్రతిదీ ఒకే సమయములో ఉన్నాయి. అందువల్ల ఈ పదాన్ని ఉపయోగించారు rāmādi-mūrtiṣu. Rāmādi-mūrtiṣu kalā-niyamena tiṣ... Niyamena. సరిగ్గా సరైన సమయం లో. సరిగ్గా సూర్యుని వలె. గతంలో ఎటువంటి గడియారము లేదు, కానీ నీడ ద్వారా వ్యక్తులు అధ్యయనం చేసేవారు. మీరు కూడ ఇప్పుడు కూడ అధ్యయనం చేయవచ్చు. మ బాల్యంలో మేము నీడను చూడటం ద్వారా అధ్యయనం చేసే వాళ్ళము: "ఇప్పుడు సమయం ఇది" - ఖచ్చితముగా అదే సమయము. kalā-niyamena tiṣṭhan, అస్తవ్యస్తంగా కాదు - ఇప్పుడు ఈ నీడ ప్రకారము ఇక్కడ సమయము ఒక గంట, మరుసటి రోజు, అక్కడ సమయము ఒక గంట. కాదు. అదే ప్రదేశములో, మీరు చూస్తారు. Kalā-niyamena tiṣṭhan.

అదేవిధముగా, కృష్ణుడి లీల, niyamena tiṣṭhan - సరిగ్గా. అనేక విశ్వాలు ఉన్నాయి. ఇక్కడ కృష్ణుడు జన్మించాడు. ఇప్పుడు కృష్ణుడిని వృందావనమునకు వసుదేవుడు తీసుకు వెళ్ళాడు. అదే విషయము - ఇక్కడ జన్మించిన వెంటనే, కృష్ణుడు వృందావనమునకు వెళ్ళాడు - మరో విశ్వంలో కృష్ణుడు జన్మించాడు, కృష్ణుడు తిరిగి జన్మించాడు. ఈ విధముగా అతని లీల జరుగుతోంది. ఎటువంటి విరామము లేదు, సమయములో ఏవిధమైన వ్యత్యాసము లేదు. సరిగ్గా. బ్రహ్మ యొక్క రోజులో ఒక్కసారి కృష్ణుడు ఈ భూమిపైకి వచ్చినట్లు. అనేక లక్షల సంవత్సరాలకు కృష్ణుడు మళ్లీ అవతరిస్తాడు, వ్యక్తిగతంగా కాకపోయిన , ఆయన విస్తరణ ద్వారా, aṁśena. చైతన్య మహాప్రభు ఖచ్చితమైన సమయములో అవతరిస్తారు భగవంతుడు రామచంద్రుడు అవతరిస్తారు కావున rāmādi mūrtiṣu kalā-niyamena tiṣṭhan (Bs. 5.39). కావున ఈ లీల, నరసింహస్వామి, అది కూడ ఖచితమైన సమయములో ఉంది.

sva-pāda-mūle patitaṁ tam arbhakam. చాలా అమయక శిశువు. ప్రహ్లాద మహారాజు లాంటి ఒక అమాయక శిశువు, అతను నరసింహస్వామి యొక్క చాలా దయను పొందగలిగితే, లక్ష్మిని కూడ చేరుకోలేకపోయిన భగవంతుడి యొక్క భయంకరమైన అవతారము ... Aśruta. Adṛṣṭa aśruta pūrva.. భగవంతుడికి ఇటువంటి రూపము లేదు. లక్ష్మికి కూడ తెలియదు. కానీ ప్రహ్లాద మహారాజు, అతను భయపడలేదు. అతనికి తెలుసు, "ఇక్కడ నా ప్రభువు ఉన్నారు." సింహపు పిల్ల వలె, దానికి సింహము అంటే భయము ఉండదు. అది వెంటనే సింహం యొక్క తల పైకి ఎక్కుతుంది, ఎందుకంటే దానికి తెలుసు ఇది నా తండ్రి. ఇది నా తల్లి. అదేవిధముగా, ప్రహ్లాద మహారాజు భయపడలేదు, అయితే బ్రహ్మ ఇతర దేవతలు అందరు భగవంతుడిని సమీపించటానికి చాలా భయపడ్డారు. అతను కేవలం ఒక అమాయక పిల్లవాడి వలె వచ్చి తన ప్రణామములు అర్పించాడు. Tam arbhakaṁ vilokya. కావున, దేవుడు నిరాకార వాది కాదు. వెంటనే అతను అర్థం చేసుకున్నాడు, "ఇక్కడ ఒక అమాయక పిల్లవాడు ఉన్నాడు. అతను తన తండ్రిచేత ఎంతో వేధించబడ్డాడు, ఇప్పుడు అతను నాకు తన ప్రణామములు చేస్తున్నాడు. " Vilokya devaḥ kṛpayā pariplutaḥ. అతను చాలా కరుణతో కరిగిపోయారు. ఇది మొత్తము విషయము, ప్రతిదీ ఉంది