TE/Prabhupada 0454 - మన దివ్య-జ్ఞానముమేల్కొనకపోతే చాలా ప్రమాదకరమైన జీవితము



Lecture -- Bombay, April 1, 1977


ప్రభుపాద: ఆ శ్లోకము ఏమిటి? Divya-jñāna hṛde prakāśito. అది చెప్పండి. (భారతీయులు తిరిగి చెప్పినారు) అంతకు ముందు.

భారతీయ అతిథులు: Prema-bhakti yāhā hoite, avidyā vināśa yāte, divya-jñāna hṛde prakāśito.

ప్రభుపాద: అందువల్ల ప్రేమ-భక్తి అవసరము. Prema-bhakti yāhā hoite, avidyā vināśa yāte, divya-jñāna. ఆ దివ్య-జ్ఞానము అంటే ఏమిటి? దివ్య అంటే ఆధ్యాత్మికము, భౌతికము కానిది Tapo divyam ( SB 5.5.1) దివ్యం అంటే, మనము పదార్ధము మరియు ఆత్మ కలయిక. ఆ ఆత్మ దివ్యం, ఆధ్యాత్మికము . Apareyam itas tu viddhi me prakṛtiṁ parā ( BG 7.5) అది పరాప్రకృతి, ఉన్నతమైనది. ఉన్నతమైన గుర్తింపు ఉంటే ... ఆ ఉన్నత గుర్తింపును అర్ధం చేసుకోవటానికి మనకు ఉన్నతమైన జ్ఞానం అవసరం, సాధారణ జ్ఞానం కాదు. Divya-jñāna hṛde prakāśito. ఇది గురువు యొక్క కర్తవ్యము, ఆ దివ్య-జ్ఞానమును మేల్కొల్పడము. దివ్య-జ్ఞాన. గురువు ఆ దివ్య-జ్ఞానముతో జ్ఞానోదయం చేస్తారు కనుక, ఆయనను పూజిస్తాము. అది అవసరం. ఆధునిక ... ఆధునిక లేదా ఎల్లప్పుడూ; ఇది మాయ. ఆ దివ్య-జ్ఞానము ఎన్నడూ, ప్రకటితము కాదు. వారు అదివ్యజ్ఞాన యొక్క చీకటిలో ఉంచబడతారు. Adivya-jñāna అంటే "నేను ఈ శరీరము" "నేను ఇండియన్," "నేను అమెరికన్," నేను హిందూ, "నేను ముస్లిం" ఇది అదివ్యజ్ఞాన. Dehātma-buddhiḥ. Yasyātma-buddhiḥ kuṇape tri ( SB 10.84.13) నేను ఈ శరీరం కాదు.

మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు దివ్య-జ్ఞాన ప్రారంభమవ్వుతుంది నేను ఈ శరీరం కాదు. నేను ఉన్నతమైన మూలము , నేను ఆత్మను. నేను ఈ తక్కువ స్థాయి జ్ఞానములో ఎందుకు ఉండవలెను? " ఇది తక్కువ స్థాయి. మనము తక్కువ స్థాయిలో ఉండకూడదు ... అధమమైన జ్ఞానం అంటే చీకటి. Tamasi mā. వేదముల ఉత్తర్వు ఉంది, "అధమమైన జ్ఞానంలో ఉండకoడి." Jyotir gamaḥ: "ఉన్నత జ్ఞానానికి రండి." గురువుని ఆరాధించడమంటే , ఆయన మనకు ఉన్నతమైన జ్ఞానాన్ని ఇస్తారు. ఈ జ్ఞానం కాదు - తినడము ఎలా, నిద్ర పోవడము ఎలా, ఎలా మైథునజీవితం కలిగి ఉండాలి, ఎలా రక్షించుకోవాలి. సాధారణముగా, రాజకీయ నాయకులు, సామాజిక నాయకులు, వారు ఈ జ్ఞానాన్ని ఇస్తారు - తినడము ఎలా, నిద్ర పోవడము ఎలా, ఎలా మైథునజీవితం కలిగి ఉండాలి, ఎలా రక్షించుకోవాలి గురువుకు ఇటువంటి వాటితో సంబంధము ఉండదు అతను దివ్య-జ్ఞాన, ఉన్నతమైన జ్ఞానం. అది అవసరము. ఈ మానవ రూపం, ఆ divya-jñāna hṛde prakāśito. మేల్కొల్పడానికి ఒక అవకాశము అతను ఆ దివ్య-జ్ఞానమును గురించి తెలుసుకోకుండా ఉంటే, కేవలము అతను శిక్షణ పొందినట్లయితే, తినడము ఎలా, నిద్ర పోవడము ఎలా, ఎలా మైథునజీవితం కలిగి ఉండాలి, ఎలా రక్షించుకోవాలి, అప్పుడు జీవితం కోల్పోతాడు. అది గొప్ప నష్టమే. Mṛtyu-saṁsāra-vartmani. Aprāpya māṁ nivartante mṛtyu-saṁsāra-vartmani ( BG 9.3) మన దివ్య-జ్ఞానము మేల్కొనకపోతే చాలా ప్రమాదకరమైన జీవితము. మనము ఎలాప్పుడూ దీన్ని గుర్తుంచుకోవాలి. చాలా ప్రమాదకరమైన జీవితము - మరోసారి జన్మ మరణముల యొక్క తరంగములలోనికి విసిరి వేయబడతాము, నేను ఎక్కడికి వెళ్తున్నానో మనకు తెలియదు. చాలా తీవ్రమైనది. ఈ కృష్ణ చైతన్యము divya-jñāna. ఇది సాధారణ జ్ఞానం కాదు. అందరూ ఈ దివ్య-జ్ఞానము ను అర్థం చేసుకోవాలి. Daivīṁ prakṛtim āśritam. అందువలన ఈ దివ్య-జ్ఞానము లో ఆసక్తి ఉన్నవారు, అతను daivīṁ prakṛtim āśritam అంటారు. daivī నుండి, దివ్య వస్తుంది, సంస్కృత పదము. సంస్కృత పదము, daivī, నుండి, దివ్య, విశేషణము.

కావున mahātmānas tu māṁ pārtha daivīṁ prakṛtim āśritāḥ ( BG 9.13) ఈ divya-jñāna పద్ధతిని తీసుకున్న వ్యక్తి, అతను మహాత్మ. ఎలా తినాలి, ఎలా నిద్రించాలి, లైంగిక సంబంధము ఎలా పొందాలనే జ్ఞానాన్ని పొందడం కోసం ముద్ర వేయించుకోవడం మహాత్మను తయారు చేయదు ఇది శాస్త్రములో నిర్వచనం కాదు.Sa mahātmā su-durlabhaḥ.

bahūnāṁ janmanām ante
jñānavān māṁ prapadyante
vāsudevaḥ sarvam iti
sa mahātmā...
(BG 7.19)

ఈ దివ్య-జ్ఞానము , vāsudevaḥ sarvam iti sa mahātmā కలిగిన వారు అతడు మహాత్మా కాని ఇది చాలా అరుదు. లేకపోతే, ఇలాoటి మహాత్మ, వారు వీధులలో తిరుగుతున్నారు. అది వారి కర్తవ్యము. మీరు ఎలప్పుడూ ఈ పదాన్ని గుర్తుంచుకోవాలి, divya-jñāna hṛde prakāśito ఆధ్యాత్మిక గురువు దివ్య-జ్ఞానము తో మనల్ని జ్ఞానవంతులు చేస్తారు కనుక, ప్రతి ఒక్కరు ఆయనకు రుణపడి ఉంటారు. Yasya prasādād bhagavat-prasādo yasya prasādān na gatiḥ kuto 'pi. ఈ గురు-పూజ తప్పనిసరి. అర్చామూర్తిని ఏట్లాగైతే పూజించటము అవసరమో ... ఇది చౌక ఆరాధన కాదు. ఇది దివ్య-జ్ఞానము ను ప్రకాశించే పద్ధతి. ధన్యవాదాలు. భక్తులు: జయ ప్రభుపాద.