TE/Prabhupada 0458 - హరే కృష్ణ జపము చేయడము. మీ నాలుకతో మీరు కృష్ణుడిని తాకుతున్నారని తెలుసుకోవాలి



Lecture on SB 7.9.6 -- Mayapur, February 26, 1977


ప్రభుపాద: నరసింహస్వామి ప్రహ్లాద మహారాజు తలపై తాకినట్లు, వెంటనే మీరు అదే సౌకర్యం కలిగి ఉంటారు. ఆ సౌకర్యం ఏమిటి? ఎలా? నరసింహ-దేవ ఇక్కడ లేడు. కృష్ణుడు ఇక్కడ లేడు . లేదు. అతను ఇక్కడ ఉన్నాడు. "అది ఏమిటి?" Nama rūpe kali kale kṛṣṇa avatāra ( CC Adi 17.22) కృష్ణుడు తన నామముతో ఉన్నారు,కృష్ణ ఈ కృష్ణ, హరే కృష్ణ, ఈ పేరు, కృష్ణుడి నుండి భిన్నమైనదిగా భావించవద్దు. సంపూర్ణంగా కృష్ణుడే, అర్చామూర్తి కృష్ణుడు, నామము కృష్ణుడు ,వ్యక్తి కృష్ణుడు- ప్రతిదీ, అదే సంపూర్ణ వాస్తవము. భేదం లేదు. ఈ యుగంలో కేవలం జపిస్తూ: kīrtanād eva kṛṣṇasya mukta-saṅgaḥ paraṁ vrajet ( SB 12.3.51) కేవలం కృష్ణుడి పవిత్ర నామాన్ని జపిస్తూ... Nama-cintāmaṇi kṛṣṇaḥ caitanya-rasa-vigrahaḥ, pūrṇaḥ śuddho nitya-muktaḥ ( CC Madhya 17.133) కృష్ణుడి పవిత్రమైన నామము కృష్ణుడి నుండి భిన్నమైనదిగా భావించవద్దు. ఇది పూర్ణము. Pūrṇaḥ pūrṇam adaḥ pūrṇam idam (Īśopaniṣad, Invocation). అంతా పూర్ణము . పూర్ణ అంటే "పూర్తి." మన Īśopaniṣad లో ఈ పరిపూర్ణమును వివరించడానికి ప్రయత్నించాము. మీరు చదివారు. కృష్ణుడి యొక్క పవిత్ర నామముతో బంధము ఏర్పరచుకోండి. మీరు ప్రహ్లాద మహారాజు పొందిన అలాంటి ప్రయోజనమును పొందుతారు. నరసింహ -దేవ యొక్క కమలహస్తం యొక్క ప్రత్యక్ష స్పర్శ ద్వారా. అక్కడ ఏ తేడా లేదు. ఎల్లప్పుడూ అదే విధంగా అనుకోవాలి. హరే కృష్ణని మీరు జపించేటప్పుడు, మీ నాలుకతో మీరు కృష్ణుడిని తాకుతున్నారని తెలుసుకోవాలి. అప్పుడు మీరు ప్రహ్లాద మహారాజు లాంటి ప్రయోజనము పొందుతారు. ధన్యవాదాలు. భక్తులు: జయ!