TE/Prabhupada 0459 - ప్రహ్లాద మహారాజు మహాజనులలో ఒకరు, ప్రామాణికమైన వ్యక్తులలో ఒకరుLecture on SB 7.9.7 -- Mayapur, February 27, 1977


ప్రద్యుమ్న: అనువాదం - "ప్రహ్లాద మహారాజ భగవంతుడు నరసింహ స్వామి మీద తన మనస్సును దృష్టిని స్థిరపర్చారు పూర్తి శ్రద్ధతో, పూర్తిగా సమాధి స్థితిలో. స్థిరమైన మనసుతో ఆయన ప్రార్థనలను ప్రేమతో, తడబడుతున్న గొంతుతో పాడటం ప్రారంభించారు. "

ప్రభుపాద:

astauṣīd dharim ekāgra-
manasā susamāhitaḥ
prema-gadgadayā vācā
tan-nyasta-hṛdayekṣanaḥ
(SB 7.9.7)

కాబట్టి ఇది పద్ధతి. ఈ పద్ధతిని మీరు వెంటనే ఆశించలేరు, కాని మీరు సాధారణ పద్ధతిని సాధన చేస్తే, చాలా సులభంగా చేయబడుతుంది, ఇది భగవద్గీతలో సిఫార్సు చేయబడింది, man-manā bhava mad-bhakto mad-yājī māṁ namaskuru ( BG 18.65) మీరు వెంటనే ప్రహ్లాద మహారాజు స్థానాన్ని పొందలేరు. అది సాధ్యం కాదు. ఈ విధానం, మొదటిది, సాధన-భక్తి. ఈ ప్రహ్లాద మహారాజ యొక్క పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఆయన మహా-భాగవత. చాలా ప్రదేశాలలో మనము ఇప్పటికే చూశాము, ఆయన నిత్య-సిద్ధ. రెండు రకాలైన భక్తులు, మూడు: నిత్య-సిద్ధ, సాధన-సిద్ధ, కృపా-సిద్ధ. ఈ విషయాలు "భక్తి రసామృత సింధు పుస్తకములో" వివరించబడ్డాయి. నిత్య సిద్ధ అంటే వారు భగవంతునితో నిరంతరం అనుబంధం కలిగి ఉంటారు. వారు నిత్య-సిద్ధ అని పిలువబడతారు. సాధన-సిద్ధ అంటే ఈ భౌతిక ప్రపంచములో ఉన్నవారు కాని నియమాలు నియంత్రణ ప్రకారం భక్తియుక్త సేవ సాధన ద్వారా, శాస్త్రము యొక్క సూచన, గురువు యొక్క మార్గదర్శకత్వం, ఈ విధముగా, నిత్య-సిద్ధ ఉండే అదే స్థానానికి వ్యక్తులు చేరుకోవచ్చు. ఇది సాధన-సిద్ధ. మరొకటి ఉంది. ఇది కృపా-సిద్ధ. కృపా-సిద్ధ అంటే ... నిత్యానంద ప్రభు లాగే, ఈ జగాయ్ మాదాయ్ లు, రక్షించబడాలని కోరుకున్నారు సాధన లేదు. వారు ఏ నియమాలు నిబంధనలను అనుసరించలేదు. వారు దొంగలు పోకిరీలు, చాలా నీచమైన పరిస్థితి. కాని నిత్యానంద ప్రభు ఒక ఉదాహరణ చూపించాలని కోరుకున్నారు, ఈ ఇద్దరు సోదరులను నేను ముక్తులను చేస్తాను, వారు ఎంత పతితులైనా పర్వాలేదు దీనిని కృపా-సిద్ధ అని పిలుస్తారు. అందువల్ల మూడు వర్గాలు ఉన్నాయి అని ఎల్లప్పుడూ గుర్తు ఉంచుకోవాలి: నిత్య-సిద్ధ, సాధన-సిద్ధ కృపా-సిద్ధ. కాని వారు సిద్ధ అయిన్నప్పుడు, పరిపూర్ణము, ఏ పద్ధతి ద్వారా అయిన, వారు ఒకే స్థాయిలో ఉoటారు. ఏ వ్యత్యాసం లేదు.

ప్రహ్లాద మహారాజ యొక్క పరిస్థితి నిత్య సిద్ధ. Gaurāṅgera saṅgi gane nitya-siddha boli māne. చైతన్య మహాప్రభు, ఆయన వచ్చినప్పుడు ... ఆయన మాత్రమే కాదు, ఇతరులు కూడా. చాలామంది భక్తులు కృష్ణుడితో వచ్చారు. ఉదాహరణకు అర్జునుడి వలె. అర్జునుడు నిత్య-సిద్ధ, నిత్య-సిద్ధ స్నేహితుడు. కృష్ణుడి "నేను భగవద్గీత తత్వమును సూర్య-దేవుడికి చెప్పాను" aṁ vivasvate yogaṁ proktavān aham avyayam ( BG 4.1) ఆది చాలా లక్షల సంవత్సరాల క్రితం. ఈ విషయాన్ని మనము అర్థము చేసుకొనేoదుకు, అర్జునుడు "కృష్ణుడు, నీవు నా వయస్సు గల వాడివి. లక్షలాది సoవత్సరాల క్రితo మీరు ఈ తత్వమును మీరు మాట్లాడారని ఎలా నమ్మమంటావు? " కావున కృష్ణుడు సమాధానం చెప్పాడు, "నా ప్రియమైన అర్జునా, నీవు నేను ఇద్దరము, మనము అనేక సార్లు అవతరించాము. తేడా ఏమిటంటే నీవు మర్చిపోయావు. అంటే నీవు కూడా ఆ సమయములో ఉన్నావు, ఎందుకంటే నీవు నా నిత్య-సిద్ధ స్నేహితుడివి. నేను అవతరిoచినప్పుడల్లా నీవు కూడా వస్తావు. కాని నీవు మర్చిపోయావు; నేను మర్చిపోలేదు. " ఇది జీవ (అస్పష్టముగా ఉన్నది), మరియు భగవంతుని మధ్య తేడా, మనము దేవాదిదేవునిలో ఒక్క చిన్న కణము; మనం మరచిపోవచ్చు. కాని కృష్ణుడు మరచిపోడు. ఇది తేడా. కాబట్టి నిత్య-సిద్ధ. ప్రహ్లాద మహారాజు నిత్య, మహా-భాగవత, నిత్య-సిద్ధ అని అర్థం చేసుకోవాలి. వారు కృష్ణుడి యొక్క లీలను పూర్తి చేయటానికి వస్తారు. కాబట్టి మనము ప్రహ్లాద మహారాజును అనుకరించటానికి ప్రయత్నించకూడదు. ఇది మంచిది కాదు. Mahājano yena gataḥ sa panthāḥ, నేను ఇప్పటికే వివరించాను. నిన్న. ప్రహ్లాద మహారాజు మహాజనులలో ఒక్కరు, ప్రామాణికమైన వ్యక్తులలో ఒక్కరు, ప్రామాణిక భక్తుడు. మనము ఆయనని అనుసరించడానికి ప్రయత్నించాలి. Mahājano yena gataḥ sa panthāḥ. కాబట్టి

tarko 'pratiṣṭhaḥ śrutayo vibhinnā
nāsau munir yasya matam na bhinnam
dharmasya tattvaṁ nihitaṁ guhāyāṁ
mahājano yena gataḥ sa panthāḥ
(CC Madhya 17.186)

మీరు తర్కం వాదనలు ద్వారా దేవుణ్ణి అర్థం చేసుకోలేరు. ఇది ఎప్పటికి తీరని సంశయము. చాలామoది మాయావాదులు ఉన్నారు, వారు నిరంతరం చెప్పుతున్నారు: "దేవుడు అంటే ఏమిటి?" Neti neti: "ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, బ్రాహ్మణ్ అంటే ఏమిటి?" కాబట్టి ఆ పద్ధతి ద్వారా మీరు దేవుణ్ణి అర్థం చేసుకోలేరు. Jñāne prayāse udapāsya namanta eva. చైతన్య మహాప్రభు ఈ సూత్రాన్ని అంగీకరించారు. జ్ఞానం ద్వారా, మీ గొప్ప పాండిత్యము ద్వారా, మీరు అర్థం చేసుకోవాలంటే - మీరు చాలా అధిక-ప్రామాణికమైన పండితుడు కావచ్చు - కాని దేవుడిని అర్థం చేసుకోవడానికి అది మీ అర్హత కాదు. అది అర్హత కాదు. మీరు "నేను చాలా ధనవంతుడిని," "నేను చాలా జ్ఞానవంతుడిని" అనే అహంకారమును విడచిపెట్టాలి నేను చాలా అందంగా ఉన్నాను, "నేను చాలా ..."ఇంకా, ఇంకా. అవి janmaiśvarya śruta śrī ( SB 1.8.26) ఆవి అర్హత కాదు. కుంతీదేవి చెప్పినది akincana gocaraḥ: "కృష్ణుడు, నీవు akincana gocaraḥ." Akiñcana. కించన అనగా కొంత మంది "నేను దీనిని కలిగి ఉన్నాను, అందుచే నేను కృష్ణుడిని కొనుగోలు చేయవచ్చు" అని అనుకుంటారు, లేదు, అది కాదు. అది సాధ్యం కాదు. మీరు ఖాళీగా అవ్వాలి, akiñcana-gocaraḥ