TE/Prabhupada 0466 - నల్ల పాము, మనిషి పాము కంటే తక్కువ హానికరం



Lecture on SB 7.9.8 -- Mayapur, February 28, 1977


ఒక పాము లక్షణము ఉన్న మనిషి చాలా ప్రమాదకరమైనవాడు. చాణిక్య పండితుడు అన్నాడు,

sarpaḥ krūraḥ khalaḥ krūraḥ
sarpāt krūrataraḥ khalaḥ
mantrauṣadhi-vaśaḥ sarpaḥ
khalaḥ kena nivāryate

రెండు రకముల అసూయ జీవులు ఉన్నాయి. ఒక్కటి పాము, నల్ల పాము, రెండోవారు నల్ల పాము యొక్క లక్షణముతో ఉన్న మనిషి. " ఆయన ఏదైనా మంచి విషయమును చూడలేడు. Sarpaḥ krūraḥ. పాము అసూయపడేది. ఏ తప్పు లేకుండా అది కరుస్తుంది. వీధిలో ఒక పాము ఉంది, మీరు దాని దగ్గరగా వెళ్ళితే దానికి కోపము వస్తుంది, వెంటనే అది కరుస్తుంది. కాబట్టి ఇది పాము యొక్క స్వభావం. అదేవిధముగా, పాము వలె వ్యక్తులు ఉన్నారు. ఏ తప్పు లేకుండా వారు నిందిస్తారు. వారు కూడా పాము. అయితే చాణిక్య పండితుడు చెప్పుతాడు "నల్ల పాము, మనిషి పాము కంటే తక్కువ హానికరం." ఎందుకు? ఇప్పుడు, ఈ నల్ల పామును, కొన్ని మంత్రములు జపించుట ద్వారా లేదా కొన్ని మూలికల ద్వారా మీరు దానిని మీ నియంత్రణలో తెచ్చుకోవచ్చు కాని ఈ మనిషి పామును మీరు మార్చలేరు. ఇది సాధ్యం కాదు.

కావున ఉంటుంది... ఈ హిరణ్యకశిపుని ప్రహ్లాద మహారాజు పాములాగా వర్ణించారు. నరసింహ స్వామి కోపంతో ఉన్నప్పుడు, అందువలన ఆయన ఆ తర్వాత చెప్పుతారు, అది ఏమిటంటే modeta sādhur api vṛścika-sarpa-hatyā ( SB 7.9.14) నా ప్రభు, మీరు నా తండ్రిపై చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన మరణించాడు, మీరు కోపంగా ఉండటానికి ఎటువంటి కారణం లేదు. శాంతముగా ఉండండి. నా తండ్రిని చంపినందువలన ఎవరూ బాధపడుట లేదు, నిజముగా. కాబట్టి వేదనకు కారణం లేదు. వీరు అందరూ, ఈ దేవతలు, భగవంతుడు బ్రహ్మ ఇతరులు, వారు అందరూ మీ సేవకులు. నేను నీ దాసుని సేవకునిగా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు అసూయతో ఉన్న పాము చంపబడింది, ప్రతిఒక్కరూ సంతోషంగా ఉన్నారు." అందువల్ల ఆయన ఈ ఉదాహరణను ఇచ్చాడు odeta sādhur api vṛścika-sarpa-hatyā: ఒక సాధువు, ఏ జీవిని చంపడానికి ఎప్పటికీ ఇష్టపడరు. వారు సంతోషంగా ఉండరు ... ఒక చిన్న చీమను చంపినా కూడా, వారు సంతోషంగా ఉండరు: "ఎందుకు చీమను చంపాలి?" ఇతరుల గురించి ఏమి మాట్లాడుతాము, ఒక చిన్న చీమను కూడా. Para-duḥkha-duḥkhī. అది ఒక చీమ అయివుండవచ్చు, అత్యంత అల్పమైనది, కాని మరణం సమయంలో అది బాధపడుతుంది, ఒక వైష్ణవ బాధగా ఉంటారు: ఎందుకు చీమను చంపాలి? ఇది para duḥkha-duhkhi. అయితే అదే వైష్ణవుడు పామును మరియు తేలును చంపినప్పుడు ఆయన సంతోషంగా ఉంటారు. Modeta sādhur api vṛścika-sarpa-hatya. కాబట్టి ఒక పామును లేదా తేలును చంపినప్పుడు ప్రతిఒక్కరూ సంతోషంగా ఉంటారు, ఎందుకంటే అవి చాలా చాలా ప్రమాదకరమైనవి. ఏ తప్పు లేకుండా అవి కాటు వేసి, బీభత్సం చేస్తాయి.

కాబట్టి ఈ పాము వంటి వ్యక్తులు ఉన్నారు, వారు మన ఉద్యమం గురించి అసూయపడతారు; వారు వ్యతిరేకిస్తున్నారు. అది స్వభావం. ప్రహ్లాద మహారాజును కూడా ఆతని తండ్రి వ్యతిరేకించారు, ఇతరుల గురించి ఏమి మాట్లాడుతాము . ఈ విషయాలు జరగుతాయి, కాని మనము నిరాశ పడకూడదు, ప్రహ్లాద మహారాజ ఎన్నడూ నిరాశ చెందలేదు, అయితే ఆయనను చాలా విధాలుగా ఏడిపించినారు . ఆయనకు విషము కూడా ఇచ్చారు, ఆయనను సర్పాల మధ్య విసిరినారు. ఆయనను కొండ మీద నుండి విసిరినారు, ఆయనను ఏనుగు పాదాల క్రింద ఉంచారు. చాలా విధాలుగా బాధ పెట్టారు... అందువల్ల చైతన్య మహాప్రభు మనకు ఆదేశించారు నిరాశ చెందవద్దు. దయచేసి భరించండి. Tṛṇād api sunīcena taror api sahiṣṇunā ( CC Adi 17.31) చెట్టు కంటే ఎక్కువ ఓర్పుతో ఉండండి నేను చెప్పేదేమిటంటే, గడ్డి కంటే చాలా తక్కువగా, వినయముగా ఉండవలెను. ఈ విషయాలు జరగవచ్చు. ఒక జీవితంలో మనము మన కృష్ణ చైతన్యపు వైఖరిని అమలు చేస్తే, కొద్దిగా బాధ ఉన్నా కూడా, పట్టించుకోవద్దు. కృష్ణ చైతన్యముతో వెళ్ళండి. నిరాశ చెందవద్దు లేదా నిరాశగా ఉండకండి, కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా. ఇది భగవద్గీతలో కృష్ణుడిచే ప్రోత్సహించబడింది, āgamāpāyino 'nityās tāṁs titikṣasva bhārata ( BG 2.14) నా ప్రియమైన అర్జునా, నీవు కొంత నొప్పిని అనుభవించినా కూడా, ఈ శారీరక నొప్పి, అది వస్తుంది వెళుతుంది. ఏదీ శాశ్వతమైనది కాదు, కాబట్టి ఈ విషయాల పట్ల శ్రద్ధ తీసుకోకండి. మీ కర్తవ్యమును కొనసాగించండి. "ఇది కృష్ణుడి ఉపదేశము. ప్రహ్లాద మహారాజు మనకు ఆచరణాత్మక ఉదాహరణ, ప్రహ్లాద మహారాజు లాంటి వ్యక్తి యొక్క అడుగుజాడలను అనుసరించడమే మన బాధ్యత