TE/Prabhupada 0472 - ఈ చీకటిలోనే ఉండకండి.వెలుగు రాజ్యమునకు మీరు బదిలీ అవ్వండి



Lecture -- Seattle, October 7, 1968


ప్రభుపాద: Govindam ādi-puruṣaṁ tam ahaṁ bhajāmi. భక్తులు: Govindam ādi-puruṣaṁ tam ahaṁ bhajāmi. ప్రభుపాద: కాబట్టి మనము గోవిందుని పూజిస్తున్నాము, అన్ని ఆనందాల నిధి, గోవిందుడు, కృష్ణుడు. ఆయన మొదటి వ్యక్తి, ādi-puruṣaṁ. కాబట్టి govindam ādi-puruṣaṁ tam ahaṁ bhajāmi భజామి అంటే "నేను పూజిస్తాను" నేను ఆయనకు శరణాగతి పొందుతాను నేను ఆయనను ప్రేమించటానికి అంగీకరిస్తున్నాను. వీటిని బ్రహ్మ, శ్లోకాల ద్వారా అర్పిస్తున్నారు. ఆ బ్రహ్మ సంహిత చెప్పుకోదగిన ఒక పెద్ద పుస్తకము. ఐదవ అధ్యాయంలో మొదటి శ్లోకములో చెప్పడినది భగవంతుడు, గోవిందుడు, ఆయన తన ప్రత్యేక లోకమును కలిగి ఉన్నారు, ఇది గోలోక వృందావనము అని పిలువబడుతుంది. ఈ భౌతిక ఆకాశం బయట ఉంది. ఈ భౌతిక ఆకాశమును మీరు మీ దృష్టి వెళ్ళేంత వరకు చూడవచ్చు, కానీ ఆ ఆకాశం అవతల ఆధ్యాత్మిక ఆకాశం ఉంది. ఈ భౌతిక ఆకాశం భౌతిక శక్తిచే కప్పబడి ఉన్నది, మహత్-తత్వ, భూమి, నీరు, అగ్ని, గాలి ... అనే ఏడు పొరలచే కప్పబడి ఉన్నది. ఆ కప్పు దాటిని తరువాత సముద్రం ఉంది, ఆ మహాసముద్రం దాటిన తరువాత ఆధ్యాత్మిక ఆకాశం మొదలవుతుంది. ఆ ఆధ్యాత్మిక ఆకాశంలో, అత్యున్నత లోకము గోలోక వృందావనం అని పిలువబడుతుంది. ఈ విషయాలు భగవద్గీతలో వేదముల సాహిత్యంలో వివరించబడ్డాయి. భగవద్గీత బాగా ప్రసిద్ధి చెందిన పుస్తకం. దానిలో కూడా ఇది పేర్కొనబడింది,

na yatra bhāsayate sūryo
na śaśāṅko na pāvakaḥ
yad gatvā na nivartante
tad dhāma paramaṁ mama
(BG 15.6)

భగవద్గీతలో మరొక ఆధ్యాత్మిక ఆకాశం ఉంది, అక్కడ సూర్యరశ్మి అవసరం లేదు. Na yatra bhāsayate sūryo. సూర్య అంటే సూర్యుడు, bhāsayate అంటే సూర్యరశ్మిని పంపిణి చేయడం. సూర్యరశ్మి అవసరం లేదు. Na yatra bhāsayate sūryo na śaśāṅko. Śāśāāka అంటే చంద్రుడు. చంద్రకాంతి అవసరం లేదు. Na śaśāṅko na pāvakḥ. విద్యుత్ అవసరం లేదు. దీనర్థం ఆ రాజ్యం కాంతిని కలిగి ఉన్నది. ఇక్కడ, ఈ భౌతిక ప్రపంచం చీకటి రాజ్యం. మీకు ప్రతి ఒక్కరికీ తెలుసు. నిజానికి చీకటి. ఈ భూమి యొక్క మరొక వైపున సూర్యుడు ఉన్న వెంటనే, ఇక్కడ చీకటి ఉంటుంది. ప్రకృతి వలన అది చీకటిగా ఉంటుంది. సూర్యరశ్మి, చంద్రుడు విద్యుత్తు ద్వారా మనము దానిని వెలుగులో ఉంచుతున్నాము. వాస్తవమునకు, ఇది చీకటి. చీకటి అంటే అజ్ఞానం కూడా. ఉదాహరణకు రాత్రివేళ ప్రజలు అజ్ఞానములో ఉంటారు. మనము అజ్ఞానములో ఉన్నాము, కాని రాత్రి పూట మనము మరింత అజ్ఞానములో ఉంటాము. కాబట్టి వేదముల సూచన అనేది tamasi mā jyotir gama.. వేదాలు ఇలా చెబుతున్నాయి: "ఈ చీకటిలోనే ఉండకండి. ఈ చీకటిలోనే ఉండకండి.వెలుగు రాజ్యమునకు మీరు బదిలీ అవ్వండి వెలుగు రాజ్యమునకు మీరు బదిలీ అవ్వండి." భగవద్గీత కూడా చెప్పుతుంది ఒక ప్రత్యేక ఆకాశం, లేదా ఒక ఆధ్యాత్మిక ఆకాశం ఉంది అని, అక్కడ సూర్యరశ్మి అవసరం లేదు, చంద్రకాంతి అవసరం ఉండదు, విద్యుత్తు అవసరం లేదు, yad gatvā na nivartante ( BG 15.6) - ఎవరైనా ఆ కాంతి రాజ్యమునకు వెళ్ళితే ఆయన తిరిగి ఈ చీకటి రాజ్యమునకు తిరిగి రాడు.

అoదుకే మనం ఆ వెలుగు రాజ్యoలోకి ఎలా వెళ్ళవచ్చు? మొత్తం మానవ నాగరికత ఈ సూత్రాలపై ఆధారపడి ఉంది. వేదాంతము చెప్పుతుంది, athāto brahma jijñāsā. Atha ataḥ. అందువల్ల ఇప్పుడు బ్రాహ్మణ్, పరమ సత్యమును గురించి మీరు ప్రశ్నించాలి. కాబట్టి ఇప్పుడు అర్థం... ప్రతి పదం ముఖ్యమైనది. అందువలన మీకు ఈ మానవ శరీరం వచ్చింది కనుక- ataḥ అంటే "ఇకనుంచి." ఇకమీదట నుంచి అంటే మీరు అనేక జన్మలు, జన్మలు తీసుకున్నారు, 8,400,000 జీవన జాతులు. జలచరములు - 900,000. Jalajā nava-lakṣāṇi sthāvarā lakṣa-viṁśati.