TE/Prabhupada 0474 - ఆర్యులు అంటే అభ్యున్నతిని సాధించిన వారు



Lecture -- Seattle, October 7, 1968


ఇప్పుడు మీరు బ్రహ్మము గురించిన విచారణ చేయండి అని వేదాంతసూత్రాలు సూచిస్తున్నాయి. Athāto brahma jijñāsā. ఇది ప్రతి ఒక్క నాగరిక వ్యక్తికీ వర్తిస్తుంది. నేను అమెరికన్ల గురించి,ఐరోపాలో, ఆసియాలో వారి గురించే మట్లాడటం లేదు. ఎక్కడైనా. ఆర్యులు అంటే అభ్యున్నతిని సాధించిన వారు. అనార్యులు అనగా ప్రగతిని సాధించని వారు అని అర్ధం ... ఇది సంస్కృత అర్థము అర్యులు అంటే, మరియు శూద్రులు ... ఆర్యలు నాలుగు వర్ణాలుగా విభజించబడ్డారు. అత్యంత తెలివైన తరగతి వారు బ్రహ్మణులు అని, ... బ్రహ్మణుల కన్నా తక్కువ స్థాయిలో ఉన్నవారు అంటే పాలకులు, రాజకీయ నాయకులు, వారు క్షత్రియులు. మరియు వారి తర్వాత వర్తక తరగతి, వ్యాపారులు, వర్తకులు, పారిశ్రామికవేత్తలు, పాలకతరగతి కంటే తక్కువ స్థాయివారు. మరియు వారికంటే తక్కువ, శూద్రులు. శూద్రులు అంటే కార్మికులు,పనివారు. కాబట్టి ఈ పద్ధతి క్రొత్తది కాదు. ఇది ప్రతిచోటా ఉంది. మానవ సమాజంలో ఎక్కడైనా,ఈ నాలుగు తరగతుల వ్యక్తులు ఉంటారు. కొన్నిసార్లు నేను భారతదేశంలో కుల పద్ధతి ఎందుకు ఉందనే ప్రశ్నను వేసాను. సరే, ఈ కుల పద్ధతి అనేది ఉంది. ఇది సహజంగానే వుంది. భగవద్-గీత ఇలా చెబుతూంది,cātur-varṇyaṁ mayā sṛṣṭaṁ guṇa-karma-vibhāgaśaḥ: ( BG 4.13) ఈ నాలుగు తరగతుల వ్యక్తులు ఉన్నారు. అది భగవంతుని సూత్రము. ఎలా నాలుగు తరగతులు వున్నాయి? Guṇa-karma-vibhāgaśaḥ. గుణ అంటే లక్షణము, కర్మ అంటే పని. మీరు చాలా మంచి లక్షణము కలిగి ఉంటే, బుద్ధి, బ్రాహ్మణ లక్షణాలు ... బ్రాహ్మణ లక్షణాలు అంటే మీరు సత్యాన్ని మాట్లడతారు,పరిశుభ్రంగా ఉంటారు. మరియు మీరు ఆత్మ-నిగ్రహం కలిగివుంటారు, మీ మనస్సు సమతుల్యతలో ఉంటుంది, మీరు సహనశీలురవుతారు, అలా చాలా లక్షణాలు వున్నాయి ... మీరు దేవుణ్ణి విశ్వసిస్తారు, ఆచరణరీతిగా శాస్త్రాలు తెలుసుకునివుంటారు. ఈ లక్షణాలు ఉన్నత వర్గమైన బ్రహ్మణులకు చెందినటువంటివి. ఒక బ్రాహ్మణుని యొక్క మొదటి అర్హత నిజాయితీగా ఉండడం. ఆయన తన శత్రువు పట్లకూడా పారదర్శకంగా వుంటాడు. ఆయన ఎప్పటికీ, నా ఉద్దేశం ఏమంటే, ఏదీ దాచివుంచడు . సత్యాన్ని. శౌచం చాలా శుచిత్వంగా వుండడం. ఒక బ్రాహ్మణుడు రోజువారీ మూడుసార్లు స్నానం ఆచరించవలసివుంది, మరియు హరే కృష్ణ మంత్రాన్ని జపించాలి. బహ్యాభ్యన్తర, బయట శుభ్రం, లోపల శుభ్రం. ఇవి లక్షణలు. ... ఈ అవకాశాలు ఉన్నప్పుడు, అప్పుడు వేదంత-సూత్రాల ప్రకారం, ఇప్పుడు మీరు బ్రహ్మము గురించి విచారణను ప్రారంభించండి అని వేదాంత సూత్రాలు సూచిస్తున్నాయి.

Athāto brahma jijñāsā. Athāto brahma jijñāsā. ఎవరైనా భౌతిక పరిపూర్ణముకు చేరుకున్నప్పుడు, తదుపరి కార్యము విచారణచేయడం. మనము విచారణ చేయకపోతే, బ్రహ్మం అంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకపోతే, అప్పుడు మనము తప్పక విసుగు చెందుతాము. ఎందుకంటే ప్రాకులాట ఉంది కాబట్టి, పురోగతి, విజ్ఞాన పురోగతి వుంది. విజ్ఞాన పురోగతి సిద్ధాంతం ఏమంటే, ఎవరూ అంతటితో తృప్తి చెందకూడదు. విజ్ఞానం తో,మనకు ఇప్పటికే తెలిసిన దానితో తృప్తిపడకూడదు. వారు మరింత తెలుసుకోవాలి. కాబట్టి మీ దేశంలో, ప్రస్తుతకాలంలో ఉన్న ఇతర దేశాలతో పోలిస్తే, మీరు భౌతికంగా చాలా చక్కగా పురోగమించారు. ఇప్పుడు మీరు ఈ బ్రహ్మ-జిజ్ఞాసను పొందండి,పరబ్రహ్మము గురించి విచారణ చేయండి. ఆ పరమోన్నతం అంటే ఏమిటి? నేను ఏమిటి? నేను కూడ బ్రహ్మాన్ని. ఎందుకంటే నేను బ్రహ్మం యొక్క అంశను కాబట్టి నేను కూడా బ్రహ్మాన్నే . ఎలాగంటే అణుఅంశం, బంగారం యొక్క ఒక చిన్న కణం కూడా బంగారమే. అది ఇతరం ఏదీ కాదు. అదేవిధముగా, మనము కూడా పరబ్రహ్మం యొక్క లేదా దేవదేవుని యొక్క అణుఅంశలము. ఎలాగంటే సూర్యరశ్మి యొక్క అణువుల వలె, అవి కూడా సూర్యగోళం వలె ప్రకాశవంతంగా ఉంటాయి, కాని అవి చాలా సూక్ష్మమైనవి. అదేవిధముగా, మనము జీవులము, మనము కూడ దేవదేవుని మాదిరి వారమే. కాని ఆయన సూర్యగోళము లేద సూర్యగోళ దేవత వలె బృహదాకారుడు, కానీ మనము చిన్న కణాలము, సూర్యరశ్మి యొక్క అణువులము. ఇదే భగవంతునికీ మరియూ మనకు మధ్య పోలిక.