TE/Prabhupada 0475 - మనము దేవుడి సేవకుడిగా ఉండాలని విన్నప్పుడు మనము వెంటనే సంకోచిస్తాము

From Vanipedia
Jump to: navigation, search
Go-previous.png మునపటి పేజీ - విడియో 0474
తర్వాతి పేజీ - విడియో 0476 Go-next.png

మనము దేవుడి సేవకుడిగా ఉండాలని విన్నప్పుడు మనము వెంటనే సంకోచిస్తాము.
- Prabhupāda 0475


Lecture -- Seattle, October 7, 1968


మనము మహోన్నతమైన వానిగా మారలేము. కనీసము, మనము ప్రామాణిక వేదముల సాహిత్యంలో కనుగొనలేము, ఒక జీవి దేవుడిలా శక్తివంతమైనది కాగలడు అని. లేదు. ఇది సాధ్యం కాదు. దేవుడు గొప్పవాడు. ఆయన ఎల్లప్పుడూ గొప్పవాడు. మీరు భౌతికము నుండి విముక్తి పొందనప్పటికీ, అప్పటికీ ఆయన గొప్పవాడు. అంటే ... కాబట్టి ఈ శ్లోకము, govindam ādi-puruṣaṁ tam ahaṁ bhajāmi. దేవుడితో మన శాశ్వత సంబంధం ఏమిటంటే, ఆయనను పూజించడము, లేదా ఆయనకు సేవ చేయడము. ఆ సేవ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దానిని తీసుకోండి... మనము సేవ గురించి మాట్లాడిన వెంటనే, మనము అనుకోవచ్చు, మనము సేవలను చేయడము ద్వారా ఇక్కడ బాధపడుతున్నాము అని. మొన్నటి సాయంత్రం ఒక పిల్లవాడు ప్రశ్నించిన విధముగా, "ఎందుకు మనము ప్రణామము చేయాలి?" ఆయన ఇక్కడ ఉన్నాడో నాకు తెలియదు. కొంత మందికి శరణాగతి పొందాటానికి ప్రణామము చేయుట తప్పు కాదు, కాని మనము వేరే పరిస్థితిలో ఉన్నందున, ఇతరులకు శరణాగతి పొందుట వలన, ఇది చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఉదాహరణకు ఎవరూ ఇతర దేశం మీద ఆధారపడి ఉండాలని కోరుకోరు, ఎవరూ ఇతరులపై ఆధారపడి ఉండాలని కోరుకోరు ప్రతి ఒక్కరూ స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటారు, ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచం ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క వికటించిన ప్రతిబింబము కాని ఆధ్యాత్మిక ప్రపంచంలో, మీరు ఎంత శరణాగతి పొందితే, మీరు ఎంత సేవకుడిగా మారితే, మీరు అంత సంతోషంగా ఉంటారు. నువ్వు సంతోషంగా ఉంటావు. కాని ప్రస్తుతానికి మనకు అలాంటి అవగాహన లేదు. మనకు ఆధ్యాత్మిక ఆలోచన లేదు, ఏ ఆధ్యాత్మిక సాక్షాత్కారము లేదు; అందువల్ల మనము దేవుడి సేవకుడిగా ఉండాలని విన్నప్పుడు మనము వెంటనే సంకోచిస్తాము. కాని సంకోచించ వలసిన ప్రశ్నే లేదు. దేవుడి సేవకుడు కావడము చాలా ఆహ్లాదకరముగా ఉంటుంది. మీరు చాలా సంస్కర్తలను చూడండి, వారు వచ్చారు, వారు దేవుడి సందేశమునకు సేవ చేశారు, ఇప్పటికి వారిని పూజిస్తాము. కాబట్టి దేవుడి సేవకుడు కావడము, దేవుడి సేవకుడు, చాలా ప్రాముఖ్యంలేని విషయము కాదు. ఇది చాలా ముఖ్యమైన విషయము. Govindam ādi-puruṣaṁ tam ahaṁ bhajāmi. కాని అంగీకరించకండి. మొదట అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అందువల్ల వేదాంత-సూత్ర చెప్పుతుంది, athāto brahma jijñāsā. బ్రాహ్మణ్ అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. (మైక్రోఫోన్ ధ్వని చేస్తోంది) ఎందుకు ఈ ధ్వని? బ్రాహ్మణ్ అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, ఆయనతో మీ సంబంధం ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆపై, మీరు వాస్తవముగా శరణాగతి పొందినప్పుడు, మీరు మీ శాశ్వతమైన ఆనందకరమైన జీవితమును అనుభవిస్తారు, సంపూర్ణ జ్ఞానమును.

ఇది చాలా చక్కగా భగవంతుడు చైతన్య ఉపదేశములలో వివరించబడింది. భగవద్గీతలో కూడా అదే ఉపదేశము ఉంది, కాని ... మేము ఇప్పటికే రెండు పుస్తకాలు ప్రచురించాము , ఒకటి, భగవద్గీత యథాతథము; మరొక పుస్తకం, చైతన్య మహాప్రభు ఉపదేశములు. కాబట్టి భగవద్గీత శరణాగతి పద్ధతిని బోధిస్తుంది. Sarva-dharmān parityajya mām ekaṁ śaraṇaṁ vraja ( BG 18.66) నీవు నాకు శరణాగతి పొందు, భగవంతుడు చెప్పారు. భగవంతుడు ఉపదేశములు, చైతన్య మహాప్రభు యొక్క ఉపదేశములు, శరణాగతి పొందటము ఎలా. ఎందుకంటే మనము అలవాటు పడినందున, మన ప్రస్తుత బద్ధ జీవితంలో శరణాగతి పొందటానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసాము. చాలా పక్షములు ఉన్నాయి, చాలా "సిద్ధాంతాలు," ఉన్నాయి ప్రధాన సూత్రం ఏమిటంటే "నేను ఎందుకు శరణాగతి పొందాలి?" ఇది ప్రధాన వ్యాధి. ఏ రాజకీయ పక్షము అయినా, ఉదాహరణకు కమ్యూనిస్ట్ పక్షము లాగే ... వారి తిరుగుబాటు , ఉన్నత అధికారులు అయిన పెట్టుబడిదారుల మీద. "ఎందుకు మనము ..." ప్రతిచోటా, అదే విషయము, "నేను ఎందుకు శరణాగతి పొందాలి?" కాని మనము శరణాగతి పొందాలి. అది మన స్వరూప స్థితి. నేను నిర్దిష్ట వ్యక్తి లేదా నిర్దిష్ట ప్రభుత్వానికి శరణాగతి పొందకుండా ఉంటే, లేదా నిర్దిష్ట సమాజం లేదా వర్గము లేదా ఏదో ఒకదానికి, కాని చివరికి నేను శరణాగతి పొందుతాను. నేను ప్రకృతి చట్టాలకు శరణాగతి పొందుతాను. స్వాతంత్రం లేదు. నేను శరణాగతి పొందాలి. క్రూరమైన చేతులు కలిగిన మరణం పిలుస్తునప్పుడు, వెంటనే నేను శరణాగతి పొందాలి. చాలా విషయాలు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ... ఇది బ్రహ్మ-జిజ్ఞాస అని, "ఎందుకు శరణాగతి పొందే పద్ధతి ఉంది?" నేను శరణాగతి పొందకూడదు అనుకుంటే, నేను బలవంతముగా శరణాగతి పొందవలసి ఉంటుంది. రాష్ట్రంలో కూడా, నేను రాష్ట్ర చట్టాలను అనుసరించకపోతే రాష్ట్ర ప్రభుత్వము నన్ను శరణాగతి పొందేలా చేస్తుంది, పోలీసు శక్తి ద్వారా, సైనిక శక్తి ద్వారా, చాలా విషయాలు ఉంటాయి. అదేవిధముగా, నేను చనిపోవాలని అనుకోను, కాని మరణం నన్ను శరణాగతి పొందేలా చేస్తుంది. నేను వృద్ధుడవ్వాలని అనుకోవడం లేదు, అయితే ప్రకృతి నన్ను బలవంతముగా వృద్ధుడిని చేస్తుంది. నేను ఏ వ్యాధిని కోరుకోవటము లేదు, కాని ప్రకృతి నాకు ఏదో ఒక వ్యాధిని బలవంతముగా అంగీకరించేటట్లు చేస్తుంది. కాబట్టి ఈ శరణాగతి పొందు పద్ధతి ఉంది. ఇప్పుడు ఇది ఎందుకు అని అర్థం చేసుకోవాలి. అంటే నా స్వరూప పరిస్థితి శరణాగతి పొందుట, కాని ప్రస్తుత కష్టం నేను తప్పుడు వ్యక్తికి శరణాగతి పొందుతున్నాను. నేను దేవాదిదేవుడికి శరణాగతి పొందాలి అని అర్థం చేసుకున్నప్పుడు, అప్పుడు నా స్వరూప స్థితి పునరుద్ధరించబడుతుంది. అది నా స్వేచ్ఛ