TE/Prabhupada 0478 - మీ హృదయంలో టెలివిజన్ పెట్టెఉంది
(Redirected from TE/Prabhupada 0478 - మీ హృదయంలో టెలివిజన్ పెట్టెఉంది.)
Lecture -- Seattle, October 18, 1968
ప్రభుపాద:Govindam ādi-puruṣaṁ tam ahaṁ bhajāmi. భక్తులు: Govindam ādi-puruṣaṁ tam ahaṁ bhajāmi. ప్రభుపాద: కాబట్టి మనము గోవిందుని పూజిస్తాము, దేవాది దేవుడిని కాబట్టి ఈ ధ్వని, గోవిందం ādi-puruṣaṁ tam ahaṁ bhajāmi, ఆయనను చేరుకుంటుంది. ఆయన విoటున్నాడు. ఆయన వినడని మీరు చెప్పలేరు. మీరు చెప్పగలరా? లేదు ముఖ్యంగా ఈ శాస్త్రీయ యుగంలో, టెలివిజన్, రేడియో సందేశాలు ప్రసారం, వేలాది మైళ్ల దూరం ప్రసారమవ్వుతున్నాయి, మీరు వినవచ్చు, ఇప్పుడు నీవు ఎందుకు ....? మీ ప్రార్ధనను, హృదయపూర్వకమైన ప్రార్థనను కృష్ణుడు ఎందుకు వినకూడదు? మీరు ఎలా చెప్పగలరు? ఎవరూ దీనిని తిరస్కరించలేరు. కాబట్టి, premāñjana-cchurita-bhakti-vilocanena santaḥ sadaiva hṛdayeṣu vilokayanti (Bs. 5.38) వేలాది మైళ్ల దూరం మీరు టెలివిజన్ చిత్రాన్ని పంపిస్తున్నట్లుగా, లేదా మీ రేడియో ధ్వనిని, అదేవిధముగా, మీరు సిద్ధం అయితే, అప్పుడు మీరు ఎప్పుడూ గోవిందుడిని చూడవచ్చు. ఇది కష్టం కాదు. ఇది బ్రహ్మ సంహితలో చెప్పబడింది premāñjana-cchurita-bhakti-vilocanena.. అదే విధముగా మీరు మీ కళ్ళను, మీ మనసును ఆ విధముగా సిద్ధం చేయాలి. మీ హృదయంలో టెలివిజన్ పెట్టె ఉంది. ఇది యోగ యొక్క పరిపూర్ణము. ఇది మీరు ఒక యంత్రం లేదా టెలివిజన్ సెట్‌ను కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. ఇది ఉంది, దేవుడు అక్కడ కూడా ఉన్నాడు. మీరు చూడగలరు, మీరు వినగలరు, మీరు మాట్లాడగలరు, మీరు మీ యంత్రాన్ని పొందగలిగితే. మీరు రిపేరు చేయాలి, అంతే. మరమత్తు పద్ధతి కృష్ణ చైతన్యము. లేకపోతే, ప్రతిదీ సరఫరా చేయబడింది, పూర్తిగా, మీలో మీ యంత్రం యొక్క పూర్తి సెట్ ఉన్నది. మరమత్తు కోసం, ఒక నిపుణుడైన మెకానిక్ అవసరం, అదేవిధముగా, మీకు ఒక నిపుణుడి యొక్క సహాయం అవసరం. అప్పుడు మీ యంత్రం పనిచేస్తుందని మీరు చూస్తారు. అర్థం చేసుకోవడం కష్టం కాదు. అది సాధ్యం కాదని ఎవరూ చెప్పలేరు. శాస్త్రంలో మనము వింటాము కూడా. Sādhu śāstra, guru vākya, tinete kariya aikya. ఆధ్యాత్మిక పరిపూర్ణత్వము మూడు సమాంతర పద్ధతులచే పరిపూర్ణముగా ఉంటుంది. సాధు. సాధు అంటే సాధువులు, ఆత్మ సాక్షాత్కారము పొందిన వ్యక్తులు శాస్త్రం. శాస్త్రం అంటే గ్రంథాలు, ప్రామాణిక శాస్త్రములు, వేద శాస్త్రములు సాధువు, శాస్త్రము, గురువు, ఒక ఆధ్యాత్మిక గురువు. ఈ మూడు సమాంతరముగా ఉండాలి. మీరు మూడు సమాంతర రేఖలపై మీ కారు లేదా వాహనాన్ని నడిపినట్లయితే, మీ కారు కృష్ణుడి దగ్గరకు నేరుగా వెళ్ళుతుంది. Tinete kariyā aikya. ఉదాహరణకు రైల్వే లైన్ లో మీకు రెండు సమాంతర రేఖలు కనిపిస్తాయి. అవి సరిగ్గా ఉంటే, గమ్యస్థానానికి రైల్వే పెట్టెలు చాలా సున్నితంగా వెళ్లుతాయి. ఇక్కడ కూడా, మూడు సమాంతర రేఖలు ఉన్నాయి - సాధువు, శాస్త్రము, గురువు: సాధువు, సాధువు యొక్క సాంగత్యము, ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురువును అంగీకరించడం, గ్రంథాలలో విశ్వాసము. అంతే. అప్పుడు మీ బండి ఏ విధమైన భంగం లేకుండా, చక్కగా వెళ్తుంది. Sādhu śāstra guru vākya, tinete kariya aikya.
ఇక్కడ భగవద్గీతలో, దేవాదిదేవుడు తనను తాను వివరిస్తున్నాడు, కృష్ణుడు. మీరు చెప్పినట్లైతే, "ఎలా కృష్ణుడు చెప్పాడని నేను విశ్వసిoచాలి? ఎవరో కృష్ణుడి పేరిట వ్రాశారు, 'కృష్ణుడు చెప్పాడు,' 'దేవుడు చెప్పాడు.' " లేదు. దీనిని గురు శిష్య పరంపర ద్వారా అని అంటారు. మీరు ఈ పుస్తకంలో, భగవద్గీతలో చూస్తారు, కృష్ణుడు, కృష్ణుడు చెప్పినది, అర్జునుడు ఎలా అర్థం చేసుకున్నాడు. ఈ విషయాలు అక్కడ వివరించబడ్డాయి. సాధువు, వ్యాసదేవుడి దగ్గర నుండి, నారద, అనేక ఆచార్యుల వరకు, రామానుజాచార్య, మధ్వాచార్య, విష్ణు స్వామి, తాజాగా, భగవంతుడు చైతన్య మహా ప్రభువు, ఈ విధముగా, వారు అంగీకరించారు: అవును. ఇది కృష్ణుడిచే మాట్లాడబడిoది. కాబట్టి ఇది సాక్ష్యం. సాధువులు అంగీకరించినట్లయితే ... వారు నిరాకరించలేదు. ప్రామాణికులు, వారు అంగీకరించారు, "అవును." దీనిని సాధువు అని పిలుస్తారు. ఎందుకంటే సాధువులు అంగీకరించారు, కాబట్టి ఇది శాస్త్రము అది పరీక్ష. ఉదాహరణకు ... ఇది లోకజ్ఞానం విషయము. న్యాయవాదులు ఏదైనా పుస్తకాన్ని అంగీకరించినట్లయితే, ఇది న్యాయపుస్తకము అని అర్థం చేసుకోవాలి. ఈ చట్టం నేను ఎలా అంగీకరిస్తాను? అని చెప్పలేరు సాక్ష్యం న్యాయవాదులు అంగీకరిస్తున్నారు. వైద్య ... వైద్యులు అంగీకరించినట్లయితే, అది ప్రామాణిక వైద్యం. అదేవిధముగా, సాధువులు భగవద్గీతను శాస్త్రముగా అంగీకరించినట్లయితే, మీరు దీనిని తిరస్కరించలేరు. సాధువు శాస్త్రం: సాధువులు మరియు శాస్త్రములు , రెండు విషయాలు, ఆధ్యాత్మిక గురువుతో, మూడు, మూడు సమాంతర పంక్తులు, ఎవరు సాధువు మరియు శాస్త్రాన్ని అంగీకరిస్తారో. సాధువు శాస్త్రాన్ని ధృవీకరిస్తారు ఆధ్యాత్మిక గురువు శాస్త్రాన్ని అంగీకరిస్తారు. సాధారణ పద్ధతి. కాబట్టి వారు విభేదిoచడము లేదు. శాస్త్రములో మాట్లాడినది సాధువు అంగీకరిస్తారు, శాస్త్రములో ఏదైతే చెప్పబడిందో, ఆధ్యాత్మిక గురువు ఆ విషయమును మాత్రమే వివరిస్తారు. అంతే. కాబట్టి ప్రసార మాధ్యమం శాస్త్రము న్యాయవాది మరియు దావావేసినవారి లాగా - ప్రసార మాధ్యమం న్యాయ పుస్తకములు. అదేవిధముగా, ఆధ్యాత్మిక గురువు, శాస్త్రము ... సాధువు అంటే ఎవరు వేదముల ఉత్తర్వును నిర్ధారిస్తారో, ఎవరు అంగీకరిస్తారో. శాస్త్రము అంటే సాధువులు అంగీకరించినది. ఆధ్యాత్మిక గురువు అంటే శాస్త్రములను అనుసరిoచినవారు. కాబట్టి విషయములు ఒకే విషయమునకు సమానంగా ఉంటే, అవి ఒక దానితో మరొకటి సమానంగా ఉంటాయి. ఇది సిద్ధాంత సత్యము. మీ దగ్గర వంద డాలర్లు ఉంటే, మరొక వ్యక్తి దగ్గర వంద డాలర్లు ఉంటే నేను వంద డాలర్లు కలిగి ఉంటే, అప్పుడు మనము అందరము సమానంగా ఉంటాము. అదేవిధముగా, sādhu śāstra guru vākya, ఈ మూడు సమాంతర రేఖలు ఒక దానితో ఒకటి అంగీకారములో ఉంటే, అప్పుడు జీవితం విజయవంతము అవుతుంది