TE/Prabhupada 0491 - మన సంకల్పమునకు వ్యతిరేకముగా అనేక కష్టాలు ఉన్నాయి
(Redirected from TE/Prabhupada 0491 - మన సంకల్పమునకు వ్యతిరేకముగా అనేక కష్టాలను పొందుతాము)
Lecture on BG 2.14 -- Germany, June 21, 1974
కాబట్టి మీరు జీవితాన్ని అధ్యయనం చేయండి. ఈ శరీరాన్ని స్వీకరించినప్పటి నుండి, తల్లి యొక్క గర్భంలో వున్నప్పుడు, అది పూర్తిగా ఇబ్బందికరమైన పరిస్థితి. మన సంకల్పమునకు వ్యతిరేకముగా అనేక కష్టాలను పొందుతాము.చాలా కష్టాలు ఉన్నాయి. తర్వాత మీరు ఎదిగేకొద్దీ ,కష్టాలు పెరుగుతూ పెరుగుతూ ఉంటాయి. అవి తగ్గే ప్రశ్న ఉండదు. మొదట జన్మ ,తర్వాత ముసలితనం,తర్వాత వ్యాధులు. మీరు ఎంతవరకైతే ఈ శరీరాన్ని కలిగివుంటారో అంతవరకు ఈ కష్టాలు వుంటాయి ...పేరుకు శాస్త్రవేత్తలు అని పిలవబడేవారు వారు చాలా సమర్థవంతమైన ఔషధాల ఆవిష్కరణలు, నూతన ఆవిష్కరణలు చేస్తూనేవుంటారు. కేవలము ...,ఏమని అంటారు? స్ట్రెప్టోమైసిన్? అలా,చాలా వచ్చాయి. కానీ వారు వ్యాధులను ఆపలేరు. అది సాధ్యం కాదండి, మీరు వ్యాధిని నయం చేసేందుకు చాలా ఉన్నత-స్థాయి మందులను తయారు చేయవచ్చు. అవి వ్యాధిని నయం చేయలేవు. తాత్కాలిక ఉపశమనం ఇస్తాయి. కాని ఏ శాస్త్రవేత్త "మీరు ఈ ఔషధం తీసుకోండి, మీకు ఏ వ్యాధీ రాదు" అని చెప్పే ఔషధాన్ని కనిపెట్టలేకపోయాడు. అది సాధ్యం కాదు. "మీరు ఈ ఔషధం తీసుకోండి, మరణించే అవసరం ఉండదు" అని చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి ఎవరైతే తెలివైన వారు ఉన్నారో, వారికి చాలా బాగా తెలుసు, ఇది దుఃఖాలయం, అశాశ్వతం అని ( BG 8.15) అది భగవద్గీతలో వివరించబడింది. ఇది దుఃఖాలతో కూడిన ప్రదేశము. ఇక్కడ ఉన్నంత కాలం అవి ఉంటాయి ... కానీ మనం ఎంత మూర్ఖులమంటే,ఆ విషయాన్ని మనం గ్రహించలేము. మనము "ఈ జీవితం చాలా ఆహ్లదకరంగా ఉంది, నేను సుఖిస్తాను."అని భావిస్తాము. కానీ అది ఆహ్లాదకరమైనది కాదు, కాలానుగుణ మార్పులు, ఎల్లప్పుడూ వుంటాయి. ఈ బాధ లేదా ఆ బాధ, ఈ వ్యాధి లేదా ఆ వ్యాధి. ఒక అసౌకర్యం,ఏదోఒక ఆందోళన వస్తూనేవుంటాయి. మూడు రకాలయిన క్లేశాలు ఉన్నాయి: ఆధ్యాత్మిక, ఆదిభౌతిక,ఆదిదైవిక. ఆధ్యాత్మిక క్లేశాలు అంటే ఈ శరీరం, మనస్సు కు సంబంధించిన బాధలు. ఆదిదైవిక అంటే భౌతిక ప్రకృతి ద్వారా కల్పించబడే బాధలు. ప్రకృతి. అకస్మాత్తుగా భూకంపం రావచ్చు. అకస్మాత్తుగా కరువు వస్తుంది, ఆహర కొరత ఏర్పడుతుంది, అతివృష్టి ,అనావృష్టి, అతి వేడి, అతి శీతలం, తీవ్ర చలి ఉంటాయి. ఈ దుఃఖాలను ,త్రివిధ తాపాలను అనుభవించక తప్పదు. కనీసం ఒకటి,లేక రెండు వుండొచ్చు . అయినప్పటికీ, "ఈ ప్రదేశం దుఃఖంతో నిండివుంది,అని గ్రహించలేము. ఎందుకంటే నేను ఈ భౌతిక శరీరాన్ని కలిగి వున్నాను" కాబట్టి.
కాబట్టి ఒక సగటు మనిషి కర్తవ్యం ఏమంటే ఈ భౌతిక శరీరాలను తీసుకోవడాన్ని ఆపివేయాలి. ఇదే బుద్ధియోగం. ఆయన "నేను ఎల్లప్పుడూ బాధల్లో ఉన్నాను,"అని గ్రహించాలి. మరియు నేను ఈ శరీరాన్ని కాదు, కానీ నేను ఈ శరీరం లో బంధించబడ్డాను. కాబట్టి సరైన అవగహన నేను ఈ శరీరం కాదు అని. ఏదో ఒకవిధముగా నేను ఈ శరీరం లేకుండా జీవించగలగితే, అప్పుడు నా దుఃఖాలు ముగుస్తాయి. ఇదే బుద్ధికుశలత. అది సాధ్యమే. అందుకోసమే కృష్ణుడు అవతరిస్తాడు. అందువల్ల భగవంతుడు అవతరించి ఈ సూచన ఇస్తాడు "మీరు ఈ శరీరం కాదు. మీరు ఒక ఆత్మ,జీవాత్మ. మరియు ఈ శరీరంలో ఉండడం వలననే మీరు చాలా బాధలను అనుభవిస్తున్నారు. " అందువల్ల కృష్ణుడు "ఈ బాధలన్నీ ఈ శరీరం కారణంగా కలుగుతున్నాయి" అని సూచించాడు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకు మీరు కష్టసుఖాలు అనుభవిస్తున్నారు? అవన్నీ శరీరం కారణంగా కలుగుతున్నాయి.
అందువలన బుద్ధ తత్వము కూడ అదే, మీరు ఈ శరీరాన్ని విడచిన తర్వాత నిర్వాణాన్ని పొందుతారు. నిర్వాణం. నిర్వాణం అంటే ... వారి తత్వము ప్రకారం మీ కష్టసుఖానుభూతులు, అవి ఈ శరీరం కారణం గా కలుగుతున్నాయి. వారు కూడా అంగీకరిస్తారు.