TE/Prabhupada 0500 - మీరు భౌతిక ప్రపంచంలో శాశ్వత ఆనందాన్ని ఆశించలేరు



Lecture on BG 2.15 -- Hyderabad, November 21, 1972



ప్రభుపాద: మీరు నిజముగా ఆనందమును కోరుకుంటే వాస్తవమునకు ఆనందమును, మీరు వాస్తవమైన ఆనందమును కోరుకుంటే, అప్పుడు మీరు కృష్ణ చైతన్యవంతులు కావడానికి ప్రయత్నించండి. అది మిమ్మల్ని నిజముగా సంతోష పెడుతుంది. లేకపోతే, మీరు ఈ భౌతిక పరిస్థితులతో కలవరపడితే, nāsato vidyate bhāvo nābhāvo vidyate sataḥ ubhayor api dṛṣṭo 'ntas tv anayos tattva-darśibhiḥ ( BG 2.16)

Tattva-darśibhiḥ, ఎవరైతే పరమ వాస్తవము చూసిన వారు, లేదా సంపూర్ణ సత్యమును సాక్షాత్కారము పొందిన వారు, వారు ఈ పదార్ధమునకు శాశ్వతమైన జీవితము లేదని నిర్ధారించారు, ఆత్మ నాశనము అవ్వదు ఈ రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. Asataḥ. అసతః అంటే అర్థం భౌతికము. Nāsato vidyate bhāvaḥ. Asataḥ, అసత్ ఏమైనప్పటికీ. భౌతిక ప్రపంచంలో ఏదైనా, అది ఆసత్. అసత్ అంటే ఉనికిలో ఉండదు తాత్కాలికమైనది. కాబట్టి మీరు తాత్కాలిక ప్రపంచంలో శాశ్వత ఆనందాన్ని ఆశించలేరు. అది సాధ్యం కాదు. కానీ వారు సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. చాలా ప్రణాళికలు తయారు చేసే కమీషన్లు, utopian కానీ వాస్తవానికి ఇక్కడ సంతోషం లేదు. చాలా కమీషన్లు ఉన్నాయి. కానీ అక్కడ.. తత్వ-దర్శి, వారికి తెలుసు... తత్వ-దర్శి, ఒకరు చూశారు లేదా అవగాహన చేసుకున్నారు సంపూర్ణ సత్యమును, ఆయన భౌతిక ప్రపంచంలో ఏ ఆనందం ఉండదు అని తెలుసు. ఈ తీర్మానం చేయాలి. ఇది కేవలం అసాధ్యమైనది, మీరు ఈ భౌతిక ప్రపంచంలో సంతోషంగా ఉండాలనుకుంటే.

కానీ ప్రజలు చాలా మూర్ఖంగా మారారు, ముఖ్యంగా ప్రస్తుత రోజులలో, వారు కేవలం ఈ భౌతిక ప్రపంచంపై ప్రణాళిక చేస్తున్నారు, వారు ఎలా సంతోషంగా ఉంటారు. మేము ఆచరణాత్మకంగా చూసినాము. మా దేశంలో ఏమి ఉంది? అది భౌతిక నాగరికతలో చాలా చాలా వెనుక బడి ఉంది. అమెరికాలో, చాలా మోటారు కార్లు ఉన్నాయి. ప్రతి మూడవ వ్యక్తి లేదా రెండవ వ్యక్తికి కారు ఉంటుంది మనము పేదవారిమి, మనము సన్యాసులము, బ్రహ్మచారులము. అయినప్పటికీ, ప్రతి ఆలయంలో మనకు కనీసం నాలుగు, అయిదు కార్లు ఉన్నాయి. ప్రతి ఆలయంలోనూ. మంచి చక్కని కారు. భారతదేశంలో అలాంటి కారును మంత్రులు కూడా ఊహించుకోలేరు. మీరు చూడండి? చక్కని, చక్కని కార్లు. కాబట్టి వారు చాలా కార్లు కలిగి ఉన్నారు కానీ సమస్య ఏమిటంటే వారు ఎల్లప్పుడూ రోడ్లు తయారు చేయడములో నిమగ్నమై ఉన్నారు, ఫ్లైవేస్, ఒకటి తరువాత మరొకటి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత... ఇది ఈ దశకు వచ్చింది, నాలుగు, ఐదు. నాలుగు-, ఐదు అంతస్తుల రహదారులు. (నవ్వు) మీరు ఎలా సంతోషంగా ఉంటారు? అందువల్ల tattva-darśibhiḥ na asataḥ. మీరు ఈ భౌతిక ప్రపంచంలో శాశ్వతంగా సంతోషంగా ఉండలేరు. అది సాధ్యం కాదు. కాబట్టి సంతోషంగా ఉండటానికి మీ సమయం వృధా చేయవద్దు. ఇంకొక ప్రదేశములో, ఇది చెప్పబడింది, padaṁ padaṁ yad vipadāṁ na teṣām ( SB 10.14.58) ఇదే ఉదాహరణ ఇవ్వవచ్చు. అమెరికాలో, లక్షలాదిమంది ప్రజలు మోటారు ప్రమాదాల్లో చనిపోతున్నారు. ఎంత మంది? గణాంకములు ఏమిటి? మీకు గుర్తు లేదా?

శ్యామసుందర: అరవై వేల మంది అని, నేను భావిస్తాను...

ప్రభుపద: అరవై వేలమంది? కాదు కాదు. అంత కంటే ఎక్కువ అరవై ...కంటే ఎక్కువ... చాలా మంది మోటార్ ప్రమాదాలలో మరణిస్తున్నారు. మా విద్యార్థులలో కొందరు , కొన్ని నెలల క్రితం, వారు మోటార్ ప్రమాదంలో మరణించారు. అమెరికాలో మోటారు ప్రమాదములో చనిపోవడము చాలా ఆశ్చర్యము కాదు. ఎందుకంటే మోటర్స్, నేను చెప్పేదానికి అర్థం ఏమిటంటే, డెబ్బై మైళ్ళ వేగంతో నడుస్తున్న, ఎనభై మైళ్ళు, తొంభై మైళ్ళు, ఒక్క మోటారు కారు, ఒకదాని తరువాత ఒకటి, వందలు. ఒకవేళ ఒకరు కొంచెం నెమ్మదిగా ఉంటే, వెంటనే, (గుద్దు కునే ధ్వనిని అనుకరిస్తున్నారు) "టక్ టక్".