TE/Prabhupada 0501 - మనము కృష్ణ చైతన్యమునకు రాకపోతే మనం ఆందోళన-లేకుండా ఉండలేము
Lecture on BG 2.15 -- Hyderabad, November 21, 1972
కాబట్టి మీరు సంతోషంగా ఉండలేరు. ఈ అబ్బాయిలు ఈ అమ్మాయిలు, అమెరికన్, అమెరికన్, యూరోపియన్, వారు ఈ మోటార్ కార్ నాగరికతను రుచి చూశారు. వారు చాలా చక్కగా రుచి చూశారు. మోటార్ కార్, నైట్ క్లబ్ మరియు త్రాగటం, వారు చాలా చక్కగా రుచి చూశారు. ఆనందం లేదు. అందువల్ల వారు కృష్ణ చైతన్యమునకు వచ్చారు. అందువల్ల, nāsato vidyate bhāvo nābhāvo vidyate sataḥ. అభావః, మరియు సతః . మనం అసత్ ను అంగీకరించినందున మనము దుఃఖముగా ఉన్నాము, ఇది అస్సలు ఉనికిలో ఉండదు. ఇది ప్రహ్లాద మహా రాజు చే ఇవ్వబడిన వర్ణన: sadā samudvigna-dhiyām asad-grahāt ( SB 7.5.5) Sadā samudvigna-dhiyām. మనము ఎల్లప్పుడూ ఉద్వేగంతో , పూర్తిగా ఉద్విగ్నతతో నిండిపోయాము. అది వాస్తవము. మనలో ప్రతి ఒక్కరూ, పూర్తిగా ఆందోళనలతో . ఎందుకు? అసద్-గ్రహాత్. ఎందుకంటే మనము ఈ భౌతిక శరీరాన్ని అంగీకరించాము. అసద్-గ్రహాత్ . Tat sādhu manye 'sura-varya dehināṁ sadā samudvigna-dhiyām. దేహినామ్ . దేహినామ్ అంటే... దేహ దేహి, మనము ఇప్పటికే చర్చించాము. దేహి అంటే శరీరము యొక్క యజమాని. కాబట్టి ప్రతి ఒక్కరూ దేహి, జంతువు లేదా మానవుడు లేదా చెట్టు లేదా ఎవరైనా. ప్రతి జీవి భౌతిక శరీరాన్ని అంగీకరించింది. అందువల్ల వారిని దేహి అని పిలుస్తారు. కాబట్టి దేహినామ్, ప్రతి దేహీ, ఆయన ఈ భౌతిక శరీరాన్ని అంగీకరించినందున, ఆయన ఎల్లప్పుడూ పూర్తిగా ఆందోళనతో నిండి ఉంటాడు.
కాబట్టి మనము కృష్ణ చైతన్యమునకు రాకపోతే మనం ఆందోళన-లేకుండా ఉండలేము. అది సాధ్యం కాదు. మీరు కృష్ణ చైతన్యవంతుడిగా మారాలి, brahma-bhūtaḥ prasannātmā ( BG 18.54) - వెంటనే మీరు ఆందోళనరహితంగా ఉంటారు. మీరు కృష్ణ చైతన్యము యొక్క స్థితికి రాకపోతే, మీరు ఎల్లప్పుడూ ఆందోళనలతో నిండిపోతారు. Sadā samudvigna-dhiyām asad-grahāt, hitvātma-pātaṁ gṛham andha-kūpaṁ, vanaṁ gato yad dharim āśrayeta ( SB 7.5.5) అంటే ప్రహ్లాద మహా రాజు మనకు దిశను ఇస్తున్నారు, ఆందోళన యొక్క ఈ స్థితిలో నుండి ఉపశమనం పొందాలంటే, sadā samudvigna-dhiyām, then hitvātma-pātam, hitvātma-pātaṁ gṛham andha-kūpam... గృహం అంధ-కూపం . గృహ అర్థం... చాలా అర్థాలు ఉన్నాయి. ముఖ్యంగా దాని అర్థం: ఇల్లు . ఇల్లు. ఇంటి ధ్యాస. మన వేదముల నాగరికత, అది ఇంటి నుండి దూరంగా తీసుకు వెళ్ళుతుంది. ఇంటి నుండి దూరముగా తీసుకు వెళ్ళుతుంది సన్యాసను తీసుకోవటానికి, వానప్రస్తాను తీసుకోవడానికి. కుటుంబ సభ్యునిగా, తాతగా లేదా ముత్తాతగా చివరి క్షణము వరకు, మరణం వరకు ఉండకూడదు. అది మన వేదముల నాగరికత కాదు. ఒకరు కొంచము పెద్ద వారైన వెంటనే, pañcāśordhvaṁ vanaṁ vrajet, ఆయన ఈ గృహం అంధ-కూపం నుండి బయటకు రావాలి. గృహం అంధ-కూపం , మనము శిధిలమైన వాటి గురించి చర్చించినట్లయితే, అది అంత రుచికరమైనది కాకపోవచ్చు. కానీ మనము శాస్త్రము నుండి చర్చించవలసి ఉంటుంది. గృహ అంటే ఏమిటి గృహ, అది... మరో పదం, అది అంగనాశ్రయము అంటారు. అంగనా. అంగనా అంటే స్త్రీ. భార్య రక్షణలో జీవించడము. అంగనాశ్రయ. అందువల్ల ఈ అంగనాశ్రయము వదలి వేయమని పరమహంస- ఆశ్రయము దగ్గరకు వెళ్ళమని శాస్త్రము సిఫారసు చేస్తుంది. అప్పుడు మీ జీవితం రక్షించ బడుతుంది. లేకపోతే, ప్రహ్లాద మహా రాజు చెప్పినట్లుగా, గృహం అంధ-కూపం, మీరు మీ కుటుంబ జీవితము అని పిలువ బడే ఈ చీకటి బావిలో మీరు ఎల్లప్పుడూ ఉంటే, అప్పుడు మీరు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. "Ātma-pātam. ఆత్మ పాటం అంటే మీరు ఆధ్యాత్మిక జీవితాన్ని అర్థం చేసుకోలేరు. అయితే, ఎల్లప్పుడూ కాదు, కానీ సాధారణంగా. సాధారణంగా, కుటుంబ జీవితం లేదా కుటుంబ జీవితానికి సంభంధించిన వారితో చాలా ఎక్కువగా అనుబంధమును కలిగి ఉంటే... విస్తరించిన - కుటుంబ జీవితం, తరువాత సమాజం జీవితం, తరువాత వర్గపు జీవితం, తరువాత జాతీయ జీవితం, తరువాత అంతర్జాతీయ జీవితం. వారు అందరూ గృహం అంధ-కూపంలో ఉన్నారు. అందరూ గృహం అంధ-కూపం