TE/Prabhupada 0503 - గురువును అంగీకరించడం అంటే ఆయన దగ్గర పరమ సత్యం గురించి అడిగి తెలుసుకోవడము
Lecture on BG 2.15 -- Hyderabad, November 21, 1972
కాబట్టి వేదాంత-సూత్రం యొక్క సహజ వ్యాఖ్యానము శ్రీమద్-భాగవతము. Jīvasya tattva-jijñāsā, jīvasya tattva-jijñāsā. ఇది మన జీవితం. జీవస్య, ప్రతి జీవి యొక్క. ప్రతి జీవి యొక్క అంటే ప్రత్యేకంగా మానవులు. ఎందుకంటే పిల్లులు మరియు కుక్కలు, అవి బ్రాహ్మణ్ లేదా సంపూర్ణ సత్యము గురించి ప్రశ్నించలేవు, కాబట్టి మానవ జీవితం యొక్క సారంశము ఏమిటంటే, కేవలం జంతు ప్రవృత్తులలో నిమగ్నమవ్వకూడదు. అది కేవలం సమయం వృధా. పరమ సత్యము గురించి ఆయన విచారణ చేయాలి. Athāto brahma jijñāsā. ఆయన అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. Tad viddhi, tattva-darśibhiḥ. తత్వ-దర్శి నుండి. Jñāninaḥ, tattva-darśinaḥ,ఇవి పదాలు. కాబట్టి మానవ జీవితములో ప్రతి సమాజంలో, పధ్ధతి ఏమిటంటే పిల్లలను పాఠశాలకు, కళాశాలలకు, విషయాలు అర్థం చేసుకోవడానికి పంపుతాము. అదే విధముగా, ఆధ్యాత్మిక అవగాహన కోసం, tad-vijñānārthaṁ sa gurum eva abhigacchet (MU 1.2.12). Abhigacchet అంటే తప్పకుండా, మరొక ప్రత్యామ్నాయం లేదు. ఎవరు చెప్ప కూడదు "నేను వెళ్తాను... నేను వెళ్ళను." కాదు మీరు వెళ్ళకపోతే, మీరు మోసం చేస్తున్నారు. ఇది మన వైష్ణవ పద్ధతి. Ādau gurvāśrayam. మొదటి విషయము ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురువు దగ్గర ఆశ్రయం తీసుకోవడం. Ādau gurvāśrayaṁ sad-dharma-pṛcchā. అంతే కాని నేను చేస్తాను కాదు, ఇది ఒక పద్ధతిగా మారింది: నేను ఒక గురువును తయారు చేస్తాను. ఇప్పుడు నా కర్తవ్యము పూర్తయింది. నాకు ఒక గురువు ఉన్నారు. కాదు. Tattva-jijñāsā. Jīvasya tattva-jijñāsā. గురు అంటే అర్థం, గురువును అంగీకరించడం అంటే ఆయన దగ్గర పరమ సత్యం గురించి అడిగి తెలుసుకోవడము. Jijñāsuḥ śreya uttamam. ఇవి వేదముల నియమములు. jijñāsu అంటే జిజ్ఞాస కలిగిన వాడు Jijñāsuḥ śreya uttamam. Śreyaḥ. Śreyaḥ ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి uttamam, ప్రధాన ప్రయోజనము. జీవితం యొక్క ప్రధాన ప్రయోజనము గురించి తెలుసుకోవటానికి ఉత్సాహవంతుడైన వ్యక్తి, ఆయన ఒక గురువును అంగీకరించడం అవసరం.
- tasmād guruṁ prapadyeta
- jijñāsuḥ śreya uttamam
- śābde pare ca niṣṇātaṁ
- brahmaṇy upaśamāśrayam
- ( SB 11.3.21)
కాబట్టి ఇది మన కృష్ణ చైతన్యము ఉద్యమము. ప్రజలకు జీవన విలువలను నేర్పించడానికి మనము ప్రయత్నిస్తున్నాం, ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవతము యొక్క విలువ, భాగవత. Dharmān bhāgavatān iha. కాబట్టి, ఆధ్యాత్మిక జీవితాన్ని అర్థం చేసుకోవడం ద్వారా, ఒకరి వాస్తవ స్వరూప స్థానమును అర్థం చేసుకోవడము ద్వారా, అతడు జ్ఞానవంతుడు అవ్వ వచ్చు జీవితం యొక్క లక్ష్యం ఏమిటి, జీవితం యొక్క బాధ్యత ఏమిటి, జీవితం యొక్క ప్రయోజనము ఏమిటి. ఇది కృష్ణ చైతన్యము ఉద్యమము.
చాలా ధన్యవాదాలు.
హరే కృష్ణ.