TE/Prabhupada 0504 - మనం అన్ని కోణాల దృష్టి నుండి శ్రీమద్-భాగవతమును అధ్యయనం చేయాలి



Lecture on SB 1.10.2 -- Mayapura, June 17, 1973


ఈ ప్రపంచము కృష్ణుడిచే సృష్టించబడింది, అది సరిగా నిర్వహించబడాలని ఆయన కోరుకుంటాడు. ఎవరు నిర్వహించగలరు? ఆయన ప్రతినిధి. రాక్షసులు కాదు. అందువలన రాజు కృష్ణుడి ప్రతినిధిగా భావించబడతాడు. ఆయన సరిగా ఈ ప్రపంచాన్ని నిర్వహిస్తాడు. ఒక వైష్ణవుడు, ఆయన కృష్ణుడి కోసం ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటాడు. ఈ సృష్టి యొక్క లక్ష్యం, ఈ బద్ధజీవులకు మరో అవకాశం ఇస్తుంది విముక్తి కోసము . అది ఉద్దేశ్యం. మొత్తం ప్రపంచం నాశనమైనప్పుడు, అప్పుడు జీవులు అందరు మళ్లీ మహా-విష్ణువు యొక్క శరీరంలోకి ప్రవేశిస్తారు. అప్పుడు, మళ్ళీ సృష్టి ఉన్నప్పుడు, అప్పుడు జీవులు తిరిగి బయటకు వస్తారు, వారి గత పరిస్థితి ప్రకారం. ఈ మూర్ఖపు సిద్ధాంతాన్ని, డార్విన్ ను మనము స్వీకరించము, తక్కువ-స్థాయి జీవితం నుండి వారు... అలాంటి ఉన్నతి ఉంది అని, కాని సృష్టిలో ప్రతిదీ ఉంది. మొత్తం 84,00,000 జాతులు అన్ని, అవి అన్ని ఉన్నాయి. శ్రేణులు ఉన్నప్పటికీ. కాబట్టి గత కర్మ ప్రకారం, karmaṇā daiva-netreṇa ( SB 3.31.1) ప్రతి ఒక్కరూ మళ్ళీ బయటకు వస్తారు, వేరొక రకమైన శరీరాన్ని పొందుతారు, తన పని ప్రారంభిస్తారు. మళ్ళీ మరొక అవకాశం. "అవును, మీరు మానవ అవగాహన స్థాయికి రండి. కృష్ణుడితో మీ సంబంధాన్ని అర్థం చేసుకుని మీరు విముక్తి పొందండి. ఇంటికి వెళ్ళటానికి, భగవద్ధామమునకు తిరిగి వెళ్ళటానికి ... " మీరు ఈ అవకాశాన్ని కోల్పోతే - ఈ సృష్టి ఆ ప్రయోజనము కోసం తయారు చేయబడింది - మరలా మీరు ఉండవచ్చు. మళ్ళీ, ప్రతిదీ నాశనం అయినప్పుడు, మీరు నిద్రాణ దశలో ఉంటారు, లక్షలాది సంవత్సరాలు. మళ్లీ మీరు సృష్టించబడతారు.

కాబట్టి ఒక గొప్ప శాస్త్రం ఉంది. ప్రతి ఒక్కరూ మానవ జీవితం యొక్క బాధ్యత అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ బాధ్యతను ప్రచారము చేయడానికి, వ్యక్తులను ఉంచడానికి, మానవ సమాజమును, వారి బాధ్యతలో, మంచి రాజు అవసరము మహారాజు యుధిష్టరుని వలె. అందువలన రాజు దేవుడు ప్రతినిధిగా భావించబడతాడు. కాబట్టి ఈ రాక్షసులను చంపిన తరువాత, కురు, kuror vaṁśa-davāgni-nirhṛtaṁ saṁrohayitvā bhava-bhāvano hariḥ niveśayitvā nija-rājya īśvaro yudhiṣṭhiram...

ఆయన చూసినపుడు, "ఇప్పుడు మహారాజ యుధిష్టర అధిష్టించారు సింహాసనంపై ప్రపంచ నియంత్రణ కోసం " ఆయన ..., prīta-manā babhua ha, ఆయన సంతృప్తి చెందారు: నా వాస్తవమైన ప్రతినిధి ఉన్నారు, ఆయన చక్కగా పని చేస్తారు.

కాబట్టి ఈ రెండు విషయాలు జరుగుతున్నాయి. తన వ్యక్తిగత ఆశయం కోసం ప్రభుత్వ అధికారమును తీసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు, వారు చంపబడతారు. వారు చంపబడతారు. ఈ విధముగా లేదా ఆ విధముగా, వారు చంపబడతారు. కృష్ణుడి ప్రతినిధిగా ప్రభుత్వ నిర్వహణ బాధ్యత వహిస్తున్న వ్యక్తులు, వారు కృష్ణుడిచే ఆశీర్వదించబడతారు, కృష్ణుడు సంతోషిస్తాడు. ప్రస్తుత క్షణము, ప్రజాస్వామ్యం అని పిలవబడే, ... ఎవరూ కృష్ణుడి ప్రతినిధి కాదు. అందరూ రాక్షసులు. అందరూ ఒక రాక్షసుడు. మీరు ఈ ప్రభుత్వం కింద శాంతి మరియు శ్రేయస్సు ఎలా ఆశించవచ్చు? ఇది సాధ్యం కాదు. మీకు కావాలంటే ... మనము రాజకీయంగా కూడా ఆలోచించవచ్చు, ఎందుకంటే ఏమైనప్పటికీ ప్రాణులు అన్ని కృష్ణుడిలో భాగం, కృష్ణుడు వారి సంక్షేమమును కోరుకుంటారు, తద్వారా వారు భగవత్ ధామమునకు తిరిగి రావచ్చు, భగవంతుని దగ్గరకు తిరిగి వస్తారు. కాబట్టి కృష్ణ చైతన్యములో ప్రజలు క్రమంగా విద్యావంతులు అవుతున్నారని చూడటము వైష్ణవుని యొక్క కర్తవ్యము. మనం చేయగలిగితే, మనం కూడా రాజకీయ అధికారమును చేపట్టవలెను, ఇది బహుశా ఉత్తమము అనేక పక్షములు ఉన్నట్లు, కమ్యూనిస్ట్ పక్షము, కాంగ్రెస్ పక్షము, ఈ పక్షము, ఆ పక్షము, కాబట్టి ఒక కృష్ణుడి పక్షము ఉండాలి. ఎందుకు ఉండకూడదు? అప్పుడు కృష్ణుడి పక్షము ప్రభుత్వమునకు వచ్చినట్లయితే ప్రజలు సంతోషంగా ఉంటారు. వెంటనే శాంతి ఉంటుంది. భారతదేశంలో, భారతదేశంలో చాలా కబేళాలు ఉన్నాయి. అక్కడ ఉన్నాయి... పది వేల ఆవులు ప్రతిరోజు చంపబడుతున్నాయని చెప్పబడింది, భూమిలో ఎక్కడైతే, ఒక ఆవును చంపడానికి ప్రయత్నిస్తారో, వెంటనే మహారాజ పరిక్షిత్ తన కత్తిని తీసుకొని "నీవు ఎవరు?" ఆ దేశంలో ఇప్పుడు పది వేల ఆవులు ప్రతి రోజు చంపబడుతున్నాయి. మీరు శాంతి ఆశిస్తున్నారు? మీరు శ్రేయస్సు ఆశిస్తున్నారు? ఇది సాధ్యం కాదు. అందువల్ల ఏదో ఒక రోజు కృష్ణుడి ప్రతినిధి ప్రభుత్వ అధికారాన్ని తీసుకుంటే, అప్పుడు ఆయన వెంటనే ఈ కబేళాలను మూసి వేస్తాడు, ఈ వ్యభిచారాన్నీ, ఈ మద్యశాలలను. అప్పుడు శాంతి శ్రేయస్సు ఉంటుంది. Bhūta-bhāvana, కృష్ణుడు సంతోషంగా ఉంటాడు, "ఇక్కడ నా ప్రతినిధి ఉన్నాడు."

కాబట్టి శ్రీమద్-భాగవతం నుండి అర్థం చేసుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి, పూర్తి జ్ఞానం, జ్ఞానం అంతా, అది మానవ సమాజమునకు అవసరము. కాబట్టి మనం అన్ని కోణాల దృష్టి నుండి అధ్యయనం చేయాలి, కేవలం సెంటిమెంట్ ద్వారా కాదు. ఇది శ్రీమద్-భాగవతం. చాలా ధన్యవాదాలు