TE/Prabhupada 0506 - మీ కళ్ళు శాస్త్రముగా ఉండాలి. ఈ మొద్దు కళ్ళతో కాదు



Lecture on BG 2.18 -- London, August 24, 1973


కాబట్టి చెట్లు మరియు మొక్కలు, అవి ఇరవై లక్షల రకాలు ఉన్నాయి. Sthāvarā lakṣa-viṁśati kṛmayo rudra-saṅkhyayaḥ. కీటకాలు, అవి పదకొండు వందల వేలు ఉన్నాయి. అందువల్ల వేదముల సాహిత్యం ప్రతిదీ సరిగ్గా ఎలా చెప్పుతుంది అనేది కలవర పెడుతుంది తొమ్మిది వందల వేలు, పదకొండు వందల వేలు, రెండు మిలియన్లు, అవి ఉన్నట్లు. దీనిని సాక్షాత్కారము అని పిలుస్తారు. కాబట్టి మనము అది సరి అయినది అని తీసుకుంటాము మన సౌకర్యం, ఎందుకంటే మనము వేదాలను ప్రామాణికముగా అంగీకరిస్తాము, అందువలన జ్ఞానం ఉంది, సిద్ధంగా. ఎవరైనా నన్ను లేదా మిమ్మల్ని అడిగితే , నీటిలో ఎన్ని రకాల జీవులు ఉన్నాయో చెప్పగలరా? ఇది చాలా కష్టము. జీవశాస్త్రజ్ఞులు కూడా చెప్పలేరు. వారు చాలా నిపుణులు అయినప్పటికీ. నేను చెప్పలేను. కాని మన సౌకర్యాల ప్రకారము, మనము వెంటనే చెప్పగలము, తొమ్మిది వందల వేలు ఉన్నాయి. నేను ఎప్పుడూ ప్రయోగాలు చేయలేదు, వ్యక్తిగతంగా చూడలేదు, కాని వేదముల సాహిత్యంలో వివరించబడినందున, నేను సరిగ్గా చెప్పగలను. అందువలన వేదాంత-సూత్రంలో చెప్పబడింది, మీరు ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్న ... అనేక మూర్ఖులు వచ్చి, వారు సవాలు చేస్తారు, మీరు నాకు దేవుడుని చూపించగలరా? ... అవును. నీకు దేవుణ్ణి చూపించగలను, నీకు చూడటానికి కళ్ళు ఉంటే. దేవుడిని వివిధ రకాల కళ్ళతో చూడవచ్చు. ఈ కళ్ళతో కాదు. ఇది శాస్త్రములో చెప్పబడింది. Ataḥ śrī-kṛṣṇa-nāmādi na bhaved grāhyam indriyaiḥ ( CC Madhya 17.136) ఇంద్రియ అంటే ఇంద్రియాలు, ఈ భౌతిక ఇంద్రియాలు అని అర్థం. ఈ భౌతిక ఇంద్రియాలతో, మీరు నేరుగా అనుభవించలేరు, భగవంతుడు యొక్క రూపం ఏమిటి, ఆయన లక్షణము ఏమిటి, ఆయన ఏమి చేస్తున్నాడు. దేవుని గురించి చాలా విషయాలు మనము తెలుసుకోవాలని కోరుకుంటున్నాము. కాని శాస్త్రము దేవుని యొక్క లక్షణాలను వివరిస్తుంది, భగవంతుడు యొక్క రూపమును, భగవంతుడు యొక్క కార్యక్రమాలను. మీరు తెలుసుకోవచ్చు. Śāstra-yonitvāt. యోని అంటే మూలం, మూలం.Śāstra-yonitvāt. Śāstra-cakṣus. మీ కళ్ళు శాస్త్రముగా ఉండాలి. ఈ మొద్దు కళ్ళతో కాదు. శాస్త్రము, పుస్తకము ద్వారా మనము కూడా ప్రతీది అనుభవిస్తున్నాము.

కాబట్టి మనము ప్రామాణిక పుస్తకాల ద్వారా చూడాలి, మన అవగాహనకు మించిన వివరణను. Acintyāḥ khalu ye bhāvā na tāṁs tarkeṇa yojayet. Tarkeṇa, వాదన ద్వారా, అది మీ జ్ఞానం అవగాహన బయట ఉన్నది. చాలా విషయాలు. మనము రోజు చాలా గ్రహాలను చూస్తాము, ఆకాశంలో నక్షత్రాలు, కాని మనకు సమాచారం లేదు. వారు చంద్రుని లోకము చూడటానికి నేరుగా వెళుతున్నారు, కాని నిరాశగా తిరిగి వస్తున్నారు. ఇది చాలా అనుమానాస్పదంగా ఉంది ఇలా చెప్పడానికి. వారు పిడివాద ముద్ర కలిగి ఉన్నారు: ఈ గ్రహములో తప్ప, ఇతర గ్రహములలో, చాలా వాటిలో, జీవులు లేరు. ఇవి పరిపూర్ణ అవగాహన కాదు. śāstra-yoni నుండి, మీరు శాస్త్రము ద్వారా చూడాలనుకుంటే... ఉదాహరణకు చంద్ర లోకము. శ్రీమద్-భాగవతం నుండి మనకు సమాచారం ఉన్నది, అక్కడ ప్రజలు, వారు పది వేల సంవత్సరాలు జీవిస్తారు. సంవత్సరం యొక్క కొలత ఏమిటి? మన ఆరు నెలలు వారి ఒక రోజుకి సమానం. ఇప్పుడు అటువoటి పది వేల సంవత్సరాలు, ఊహించుకోండి. దీనిని daiva-varṣa అని పిలుస్తారు. daiva-varṣa అంటే సంవత్సరము దేవతల లెక్కల ప్రకారము. బ్రహ్మ యొక్క రోజు లాగానే అది దేవతల లెక్కలు. Sahasra-yuga-paryantam ahar yad brahmaṇo viduḥ ( BG 8.17) మనకు భగవద్గీత నుండి సమాచారం ఉన్నది, కృష్ణుడు ఇలా చెబుతున్నాడు, వారు దేవతల సంవత్సరాలు లెక్కిస్తారు. ప్రతిఒక్కరి సంవత్సరం గణిస్తారు. దీన్ని అంటారు ... ఇది ఆధునిక శాస్త్రం, సాపేక్ష సత్యం లేదా సాపేక్ష సిద్ధాంతంచే ఆమోదించబడింది. ఒక చిన్న చీమ, ఆయనకు కూడా వంద సంవత్సరాల వయస్సు ఉన్నది. కాని చీమ యొక్క వంద సంవత్సరాలు మరియు మన వంద సంవత్సరాలు వేరు. దీనిని సాపేక్షము అని పిలుస్తారు.మీ శరీర పరిమాణం ప్రకారం, ప్రతిదీ సంబంధములో . మన వంద సంవత్సరాలు మరియు బ్రహ్మ యొక్క వంద సంవత్సరాలు, అది భిన్నమైనది. అందువల్ల కృష్ణుడు ఇలాంటి లెక్కలు చెప్పుతాడు: sahasra-yuga-paryantam ahar yad brahmaṇo viduḥ ( BG 8.17)