TE/Prabhupada 0505 - మీరు శరీరాన్ని రక్షించలేరు. అది సాధ్యం కాదు



Lecture on BG 2.18 -- London, August 24, 1973


ప్రద్యుమ్న: "నాశనరహితమైన, శాశ్వతమైన జీవాత్మ యొక్క భౌతిక శరీరం మాత్రమే నాశనముచెందుతుంది; అందుచేత యుద్ధము చేయి. ఓ భరత వంశీయుడా."

ప్రభుపాద:

antavanta ime dehā
nityasyoktāḥ śarīriṇaḥ
anāśino 'prameyasya
tasmād yudhyasva bhārata
(BG 2.18)

ప్రభుపాద: Antavanta ime dehā nityasyoktāḥ śarīriṇaḥ. ఇది బహువచన సంఖ్య. Śarīriṇaḥ. కాబట్టి śarīrin లేదా śarīrī అంటే అర్థం శరీరం లేదా దేహం యొక్క యజమాని. Śarīra అంటే ఈ శరీరం అని అర్థం మరియు śarīrin శరీరాన్ని కలిగి ఉన్నవాడు, కాబట్టి śarīriṇaḥ బహువచన సంఖ్య. śarīriṇaḥ. వివిధ రకాలుగా, కృష్ణుడు అర్జునుని ఒప్పిస్తున్నాడు, . ఆత్మ ఈ శరీరం నుండి భిన్నంగా ఉంటుంది ఈ శరీరం, antavat, అది నాశనము అవుతుంది. అయితే మీరు ఎలా ప్రయత్నించినా, శాస్త్రీయంగా, సౌందర్య మరియు ఇతర విషయములు పూసుకున్నా మీరు శరీరాన్ని రక్షించలేరు. అది సాధ్యం కాదు. Antavat. అంతవత్ అంటే, అంత అంటే ముగింపు, వట్ అంటే కలిగి ఉన్న అని అర్థం. అందువలన మీ పని పోరాటాము చేయుట మరియు నీవు మీ తాత లేదా గురువు లేదా బంధువుల శరీరం అని ప్రలాపిస్తున్నావు వారు నాశనం అవుతారు నీవు బాధగా ఉంటావు. అది సరియైనది, నీవు బాధగా ఉంటావు, కానీ నీవు పోరాడకపోయినా, వారి శరీరం నాశనమవుతుంది నేడో లేదా రేపో లేదా కొన్ని సంవత్సరాల తర్వాత. నీ కర్తవ్యము విడిచిపెట్టి ఎందుకు నీవు తిరిగి వెళ్ళాలి? ఇది విషయము. ఆత్మకు సంబంధించినంత వరకు, నీ తాత, గురువు ఇతరులు, వారు నిత్య, శాశ్వతమైనవారు. ఇప్పటికే వివరించాను, nityasya uktāḥ.

ఇప్పుడుకూడా కృష్ణుడు చెప్పుతున్నాడు ukta. ukta అంటే "ఇది చెప్పబడింది." నేను మొండిగా మాట్లాడటం లేదు, నేను సిద్ధాంతాల్ని చేస్తున్నాను అని కాదు. లేదు. ఇది ఇప్పటికే వివరించబడింది, ఇది ఇప్పటికే నిర్ధారించబడింది. మరియు వైదిక సాహిత్యంలో, ప్రామాణికులచే అది చెప్పబడింది. ఇది సాక్ష్యాలను చూపెట్టే మార్గం. కృష్ణుడు కూడా, దేవాదిదేవుడు, ఆయన కూడా సిద్ధాంతీకరించడు. ఆయన చెప్పాడు, "ఇది చెప్పబడింది," ప్రామాణికం. అనాశినో 'ప్రమేయస్య. Anāśinaḥ. నాశినః అంటే నాశనంచేయదగిన, అనాశినః నాశనంచేయదగినది కాదు. Śarīriṇaḥ, ఆత్మ, అనాశినః, ఇది ఎప్పటికి నాశనం చేయబడదు. మరియు అప్రమేయస్య . అప్రమేయస్య , కొలవలేనిది. దానిని కొలవలేరు కూడా. వేదముల సాహిత్యంలో కొలిచే ప్రమాణం వర్ణించబడింది, కాని మీరు కొలవలేరు. ఏదైనా, చాలా విషయాలు వేదముల సాహిత్యంలో వివరించబడ్డాయి. మీరు శాస్త్రీయ పరిజ్ఞానంలో చాలా ఉన్నత స్థానమునకు వచ్చారు, కానీ అది సత్యము కాదని మీరు చెప్పలేరు. మీరు అంచనా వేయలేరు. ఉదాహరణకు పద్మ పురాణములో ఉన్నట్లుగా, జీవుల రకాలు వర్ణించబడ్డాయి: jalajā nava-lakṣāṇi. జల చరాలు లేదా జీవులు తొమ్మిది వందల వేలు. కాబట్టి మీరు చెప్పలేరు, లేదు, అవి తొమ్మిది వందల వేలు కాదు, ఇవి తక్కువ లేదా ఎక్కువ." మీరు ఎన్ని రకాలున్నాయో చూడాలంటే నీటిలో ఇది సాధ్యం కాదు. మీరు చేసి ఉండవచ్చు, జీవశాస్త్రవేత్తలు, వారు ప్రయోగం చేసి ఉండవచ్చు, కానీ తొమ్మిది వందల వేల రూపాలను చూడటం సాధ్యం కాదు. అది సాధ్యం కాదు. Jalajā nava-lakṣāṇi sthāvarā lakṣa-viṁśati