TE/Prabhupada 0509 - ఈ జనాలు జంతువులు ఆత్మ కలిగి లేవని చెప్తారు
Lecture on BG 2.18 -- London, August 24, 1973
ప్రభుపాద: Vinā paśughnāt ( SB 10.1.4) ఇది రాజు యొక్క ప్రకటన ...ఏమిటి అది?
భక్తుడు: యుధిష్టర.
ప్రభుపాద: యుధిష్టర కాదు.
భక్తుడు : పరీక్షిత్, పరీక్షిత్ మహారాజు.
ప్రభుపాద: పరీక్షిత్ మహారాజు. ఆయన చెప్పారు దేవునిచైతన్యము, కృష్ణచైతన్యము, జంతువులను చంపేవాడు అర్థం చేసుకోలేడు. Vinā paśughnāt ( SB 10.1.4) Nivṛtta-tarṣair upagīyamānāt. Vinā paśughnāt (SB 10.1.4). మీరు తెలుసుకొనవచ్చు ఎవరైతే జంతువుల హంతకులో, క్రైస్తవులు మహమ్మదీయులు అని పిలవబడే వారు, వారు అర్థం చేసుకోలేరు. వారు కేవలం మూఢభక్తి కలవారు. ఆత్మ అంటే ఏమిటో, భగవంతుడు అంటే ఏమిటో అర్థం చేసుకోలేరు. వారు కొన్ని సిద్ధాంతాలను కలిగి ఉన్నారు మరియు వారు మతస్థులమని భావిస్తున్నారు. పాపం అంటే ఏమిటి, పవిత్ర కార్యక్రమాలంటే ఏమిటి, ఈ విషయాలు వారికి అర్థం కావు. కారణం వారు జంతువులను చంపేవారు. ఇది సాధ్యం కాదు. అందువల్ల భగవంతుడు బుద్ధుడు అహింసను ప్రచారం చేశారు. అహింస. ఎందుకంటే ఆయన చూసారు మొత్తం మానవ జాతి ఈ జంతువులను చంపడం ద్వారా నరకంకు వెళ్లుతున్నారు కాబట్టి, నేను వారిని ఆపుతాను. అప్పుడు భవిష్యత్తులో, వారు తెలివిగా మారవచ్చు Sadaya-hṛdaya darśita: రెండు వైపులా. అన్నింటిలో మొదటగా ఆయన చాలా దయగలవాడు, ఆ దీన జంతువులు, అవి చంపబడ్డుతున్నాయి. మరొక వైపు, ఆయన చూశాడు "మొత్తం మానవ జాతి నరకంకు వెళ్లుతున్నారు. కనుక నేను ఏదైనా చేయాలి." అందువలన ఆయన ఆత్మ యొక్క ఉనికిని తిరస్కరించవలసి వచ్చింది, ఎందుకంటే వారి మనస్సు అలాంటి విషయములను సహించదు. అందువలన ఆయన ఆత్మ లేదా దేవుడు గురించి ఏమీ చెప్పలేదు. ఆయన చెప్పారు "మీరు జంతువుల హత్యలను ఆపండి." నేను మిమ్మల్ని గిల్లితే, మీరు నొప్పి అనుభూతి చెందుతారు. మరి మీరు ఇతరులకు ఎందుకు బాధ కలిగించాలి? అవి ఆత్మను కలిగి లేవని పట్టిoచు కోవద్దు పర్వాలేదు. ఆయన ఆత్మ గురించి ఏమీ మాట్లాడలేదు. కాబట్టి ఈ జనాలు జంతువులు ఆత్మ కలిగి లేవని చెప్తారు. కానీ అది సరే, కానీ మీరు జంతువును చంపినప్పుడు అవి బాధను అనుభవిస్తున్నాయి. మీరు కూడా నొప్పిని అనుభూతి చెందుతున్నారు. మరి ఇతరులకు ఎందుకు బాధ కలిగించాలి? ఇది భగవంతుడు బుద్ధ సిద్ధాంతం. Sadaya-hṛdaya darśita-paśu- ghātam. Nindasi yajña- vidher ahaha śruti-jātam. ఆయన నిరాకరించాడు: "నేను వేదాలను అంగీకరించను." ఎందుకంటే వేదాలలో కొన్నిసార్లు సిఫార్సు చేయబడి ఉంది, చంపడానికి కాదు, కాని ఆ జంతువుకు పునర్ యవ్వనం ఇవ్వడం కోసం. కాని చంపడం, ఆ కోణంలో, యజ్ఞము కోసం ఉంది. కాని భగవంతుడు బుద్ధుడు యజ్ఞములో కూడా జంతువుల హత్యను అంగీకరించలేదు. అందువల్ల, nindasi. నిందాసి అంటే ఆయన విమర్శిస్తున్నాడు. Nindasi yajña-vidher ahaha śruti-jātaṁ sadaya-hṛdaya darśita ఎందుకు? ఆయన చాలా దయ మరియు కరుణ కలిగి ఉన్నాడు. అది కృష్ణ చైతన్యము. దేవుడు చాలా దయగలవాడు, చాలా కరుణ గల వాడు. ఆయనకి ఇష్టం లేదు. కాని అవసరమైనప్పుడు ఆయన చంపగలడు. కాని ఆయన చంపడం మనము చంపడము భిన్నంగా ఉంటాయి. ఆయన అంత మంచివాడు. ఎవరైనా కృష్ణుడి చేత చంపబడిన వాడు, ఆయన వెంటనే మోక్షాన్ని పొందుతాడు. కాబట్టి ఈ విషయాలు అక్కడ ఉన్నాయి.
కొలవశక్యము గానివి. మీరు ఆత్మ అంటే ఏమిటి అనేది కొలవలేరు, కాని ఆత్మ ఉంది, మరియు ఈ శరీరం పాడైపోయేది. మీరు, మీరు పోరాడకపోయినా, మీరు మీ తాత, గురువు మరియు ఇతరుల మృతదేహాలను భద్రపరచండి, ఎందుకంటే మీరు చాలా భ్రాంతి చెందినారు, కాబట్టి అవి పాడవుతాయి. అంతవంత అంటే నేడు లేదా రేపు. ఉదాహరణకు మీ తాత ఇప్పటికే వృద్ధుడు అని అనుకుందాం. కాబట్టి మీరు అతన్ని చంపలేరు, ఇప్పుడే లేదా ఒక సంవత్సరం లేదా ఆరు నెలల తర్వాత, ఆయన చనిపోవచ్చు ఎందుకంటే ఆయన ఇప్పటికే వృద్ధుడు. ఈ వాదనలను మన ముందు పెడుతున్నారు. ప్రధాన విషయం అర్జునుడు ఖచ్చితంగా పోరాడాలని కృష్ణుడు కోరుకోనుచున్నాడు ఆయన తప్పనిసరిగా, ఆయన క్షత్రియునిగా తన బాధ్యత నుండి తప్పించు కోకూడదు. ఆయన శరీర విధ్వంసములో భ్రాంతి చెందకూడదు అందువల్ల ఆయన ఉపదేశము చేస్తున్నాడు: "శరీరం ఆత్మ నుండి భిన్నంగా ఉంటుంది. ఆత్మ చంపబడునని అనుకోవద్దు. నీవు నిలబడి, పోరాడు." ఇది ఉపదేశము.
చాలా ధన్యవాదాలు