TE/Prabhupada 0510 - ఆధునిక నాగరికతలో ఉన్న, వారికి ఆత్మ గురించి జ్ఞానము లేదు
Lecture on BG 2.25 -- London, August 28, 1973
ప్రద్యుమ్న: "ఆత్మ, కనబడనిది, అనూహ్యమైనది, మార్పులేనిది అని చెప్పబడింది. ఇది తెలుసుకోవడము ద్వారా, మీరు శరీరం కోసం దుఃఖించకూడదు. "
ప్రభుపాద:
- avyakto 'yam acintyo 'yam
- avikāryo 'yam ucyate
- tasmād evaṁ viditvainaṁ
- nānuśocitum arhasi
- (BG 2.25)
అప్పటినుండి కృష్ణుడు అర్జునుడికి ఈ ఉపదేశమును ప్రారంభించాడు, aśocyān anvaśocas tvaṁ prajñā-vādāṁś ca bhāṣase ( BG 2.11) నీవు జ్ఞానవంతుడైన పండితుడిలా మాట్లాడుతున్నావు, కాని నీవు శరీరం గురించి విలపిస్తున్నావు, ఏదైతే అసలు ముఖ్యమైనది కాదో." Nānuśocanti. ఇక్కడ కూడా అదే విషయము. Tasmād evaṁ viditvainam, ఈ శరీరం, na anuśocitum arhasi. ఈ శరీరం గురించి చాలా తీవ్రముగా ఉండకoడి. ఆత్మ ఆలోచించవలసిన విషయము. కాని ఆధునిక నాగరికత, వారు ఈ శరీరము గురించి ఆలోచిస్తున్నారు. కేవలం వ్యతిరేకం. కృష్ణుడు ఇలా చెబుతున్నాడు: ఆత్మ శాశ్వతముగా కనుక అందువలన, tasmād evaṁ viditvā, ఈ సూత్రం యొక్క అవగాహన, enam, ఈ శరీరం, na anuśocitum arhasi. వాస్తవమైన అంశం ఆత్మ. మనము శరీరాన్ని కాదు, ఆత్మ యొక్క శ్రద్ధ వహించాలి. శరీరం గురించి ఆలోచిస్తే, వాతావరణ మార్పుల వలె కష్ట- సుఖములు ఉన్నాయి. Āgamāpāyinaḥ anityāḥ, అటువoటి శరీర కష్ట-సుఖాలు వస్తాయి వెళ్ళిపోతాయి; అవి శాశ్వతమైనవి కావు. Tāṁs titikṣasva bhārata. మీరు ఈ శరీర కష్ట సుఖాలను తట్టుకొని ఉండటము తెలుసుకోవాలి, కాని మీరు ఆత్మ యొక్క శ్రద్ధ వహించాలి. కాని ఆధునిక నాగరికతలో ఉన్న, వారికి ఆత్మ గురించి జ్ఞానము లేదు, దాని జాగ్రత్త తీసుకోవటము గురించి ఏమి మాట్లాడతాము, జంతువుల వలె , వారు శరీర భావనలో ఉన్నారు, శరీరం గురించి చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు, కాని వారికి ఆత్మ యొక్క ఏ సమాచారము లేదు, ఆత్మ యొక్క జాగ్రత్త తీసుకోవడం గురించి ఏమి మాట్లాడతాము.
ఆధునిక నాగరికత యొక్క దుఃఖకరమైన పరిస్థితి ఇది. జంతు నాగరికత. జంతువులు కేవలము శరీరం యొక్క శ్రద్ధ వహిస్తాయి, వాటికి ఆత్మ యొక్క సమాచారం లేదు. కాబట్టి ఈ నాగరికత, జంతు నాగరికత, mūḍha. Mūḍha అంటే జంతువులు, గాడిదలు. ఇప్పుడు మనం సాధారణంగా ప్రజలకు చెప్పినట్లయితే, వారు మన మీద కోపంగా ఉంటారు, కాని నిజానికి ఇది పరిస్థితి. Yasyātma-buddhiḥ kuṇape tri-dhātuke ( SB 10.84.13) నేను అనేక సార్లు ఈ శ్లోకమును వివరించాను . Yasya ātma-buddhiḥ. Ātmā అంటే అర్థం ఆత్మ ; బుద్ధి ఈ శరీరాన్ని ఆత్మగా తీసుకుoటుంది. Yasyātma-buddhiḥ. కాని ఈ శరీరం ఏమిటి? ఈ శరీరము ఒక సంచి తప్పితే ఏమి కాదు. tri-dhātu,, కఫ, పిత్త, వాయు, దాని ఉప-ఉత్పత్తులు. ఈ మూడు విషయాలు శ్లేష్మం, పైత్యము, గాలి సంకర్షణ ద్వారా... ఈ భౌతిక ప్రపంచం వలె, ఈ ఇల్లు. ఈ ఇల్లు ఏమిటి? Tejo-vāri-mṛdāṁ vinimayaḥ. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నఏదైనా, అది ఏమిటి? Tejo-vāri-mṛdāṁ vinimayaḥ. అగ్ని, నీరు భూమి యొక్క మార్పిడి. Tejo-vāri-mṛdāṁ vinimayaḥ. మార్పిడి. నీవు భూమిని తీసుకొని, నీవు నీటిని తీసుకొని వాటిని కలపoడి, అగ్నిలో ఉంచండి, అది ఇటుక అవుతుంది, అప్పుడు పొడి చేయండి, అది సిమెంట్ అవుతుంది, మళ్ళీ వాటిని మిళితం చేయండి, అది ఒక గొప్ప ఆకాశహార్మ్యభవనం అవుతుంది. కాబట్టి ఈ భౌతిక ప్రపంచములో, మీరు తీసుకునే ఏదైనా, ఇది కేవలం ఈ మూడు పదార్ధాల కలయిక, ఎండబెట్టడం కోసం గాలి మరియు ఆకాశము. ఎండబెట్టడానికి గాలి అవసరం. ఐదు అంశాల కలయిక. అదేవిధముగా, ఈ శరీరం కూడా ఐదు మూలకాల కలయిక. తేడా లేదు. కాని గొప్ప ఆకాశహార్మ్యభవనం లో ఏ ఆత్మ లేదు కనుక, అది ఒక ప్రదేశములోనే నిలుస్తుంది, కానీ శరీరమునకు ఆత్మ ఉన్నది, అందువలన అది కదులుతుంది. ఇది తేడా. ఆత్మ ముఖ్యమైన విషయము. కాని వారికి తెలియదు. మనము విమానం తయారు చేసినట్లు. దానిలో ఏ ఆత్మ లేదు, కాని మరొక ఆత్మ, అంటే పైలట్ . ఆయన దానిని జాగ్రత్తగా చూసుకుంటాడు. ఆయన నడుపుతాడు. అందువలన, అది కదులుతోంది. ఆత్మ లేకుండా, ఏ కదలిక ఉండదు. ఆత్మ అయినా ఉండాలి లేదా మరిక ఆత్మ అయిన దాని జాగ్రత్త తీసుకోవాలి. అప్పుడు అది కదులుతుంది. అందువలన, ముఖ్యమైనది ఆత్మ, ఈ భౌతిక శరీరము కాదు