TE/Prabhupada 0512 - కాబట్టి ఎవరైతే భౌతిక ప్రకృతికి శరణాగతి పొందినారో వారు బాధ పడాలిLecture on BG 2.25 -- London, August 28, 1973


yasyātma-buddhiḥ kuṇape tri-dhātuke
sva-dhīḥ kalatrādiṣu bhauma ijya-dhīḥ
yat-tīrtha-buddhiḥ salile na karhicij
janeṣv abhijñeṣu sa eva go-kharaḥ
(SB 10.84.13)

గో- ఖరః . గో- ఖరః అంటే గాడిదలు మరియు ఆవులు.

కాబట్టి ఈ నాగరికత, ఆధునిక నాగరికత, ఆత్మ గురించి ఏ సమాచారం కలిగిలేదు, ఇది కేవలం జంతువుల సమాజం మాత్రమే, అంతే. అందువల్ల వారి కార్యక్రమాల యొక్క ఫలితమేమిటో వారు పట్టించుకోరు, ఎందుకంటే వారు పవిత్ర, భక్తి మరియు దుష్ట కార్యక్రమాలను పట్టించుకోరు. వారు అన్నింటినీ తీసుకుంటారు... అది రాక్షస నాగరికత. Pravṛttiṁ ca nivṛttiṁ ca na vidur āsura-janāḥ ( BG 16.7) అసుర-జనా అంటే ఈ దుష్టులు లేదా రాక్షసులు, నాస్తికులు, మూర్ఖులు, దుష్టులు, వారికి తెలియదు ఈ ప్రవృత్తి మరియు నివృత్తి. ప్రవృత్తి అనగా మనము ఆసక్తి తీసుకోవలసిన విషయము. దానిని ప్రవృత్తి అని పిలుస్తారు. మరియు నివృత్తి అంటే మనము ఆసక్తి తీసుకోకూడని విషయము, లేదా మనము దానిని వదిలివేయాలని ప్రయత్నిస్తాము. అసుర-జనా, వారికి తెలియదు. ఉదాహరణకు మనము ప్రవృత్తి అభిలాషతో వచ్చాము, Loke vyavāya āmiṣa mada-sevā nityasya jantuḥ. ప్రతి జీవి భౌతికముగా పొంది ఉన్నారు... రెండు ప్రకృతులు ఉన్నాయి, ఆధ్యాత్మిక మరియు భౌతిక. భౌతికముగా, లైంగిక ఆనందము మరియు మాంసం తినడం మీద అభిలాష - āmiṣa, అమీషా అంటే మాంసం తినడం, మాంసం మరియు చేపలు అలాంటివి. దీనిని అమీషా అని పిలుస్తారు. శాకాహారము అనగా నిరమీష. కాబట్టి అమీషా మరియు మద మరియు వ్యవాయ. వ్యవాయ అంటే మైథునం. Loke vyavāya āmiṣa mada-sevā. లైంగిక ఆనందం మాంసం తినడం, మాంసం, గుడ్లు మరియు మద్యపానం. మద అంటే మద్యం. నిత్యాస్య జంతుః. జంతువు. భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు అతడిని జంతు అంటారు. జంతు అంటే జంతువు. ఆయన జీవి అయినప్పటికీ, ఆయన జీవ ఆత్మ అని పిలవబడడు. ఆయన జంతు అని పిలవబడును. Jantur dehopapattaye. జంతువు. ఈ భౌతిక శరీరం, జంతువు వలె అభివృద్ధి చెందుతోంది. ఎవరైతే ఆధ్యాత్మిక జ్ఞానం లేకుండా ఉన్నాడో, అతడు జంతు అని లేదా జంతువు అని పిలవబడును. ఇది శాస్త్రంకు సంబంధించిన ఉత్తర్వు. Jantur dehopapattaye. ఈ భౌతిక శరీరాన్ని ఎవరు పొందుతారో? జంతు, జంతువు. కాబట్టి, ఎంతో కాలము ఇలాగనే మనం ఉంటామో, ఈ భౌతిక శరీరాన్ని నిరంతరంగా పొందుతాము లేదా మారుస్తాము, మనము జంతువులా ఉంటాము, జంతువు. Kleśada āsa dehaḥ. ఒక జంతువు, జంతువు, తట్టుకుంటుంది, లేదా ఆయన బలవంతము వలన ఓర్చుకోవాలి. ఒక ఎద్దు వలె బండి కాడి కి కట్టి మరియు కొరడాదెబ్బలతో. ఆయన తట్టుకోవాలి. ఆయన బయటకు రాలేడు. అదేవిధముగా, వాటిని చంపబడటానికి కబేళానికి తీసుకువెళ్ళబడినప్పుడు, ఆయన దానిని తట్టుకోవాలి. ఇంక మార్గం లేదు. దీనిని జంతు అంటారు.

కాబట్టి ఎవరైతే భౌతిక ప్రకృతికి శరణాగతి పొందినారో వారు బాధ పడాలి. అతనూ బాధపడాలి. బయట పడడానికి మార్గం లేదు. మీరు ఈ శరీరాన్ని అంగీకరించారు. మీరు తప్పక బాధపడాలి. Kleśada āsa dehaḥ. ఈ భౌతిక శరీరం అంటే బాధలు. కాబట్టి వారికి దీని గురించి తెలియదు. వారు చాలా ఏర్పాట్లు మరియు ప్రణాళికలు చేస్తున్నారు ఎలా సంతోషంగా ఉండాలి అనేదాని కొరకు, ఎలాంటి దుర్బర పరిస్థితి లేకుండా శాంతిగా ఉండడం ఎలా, కానీ ఈ మూర్ఖులు, వారికి ఎంత కాలము మీరు ఈ భౌతికము శరీరము కలిగి ఉంటారో, ఒక రాజు శరీరమైనా లేదా చీమ శరీరమైనా- మీరు తప్పక బాధ పడాలి. వారికి తెలియదు. అందువల్ల ఇక్కడ కృష్ణుడు చెప్పాడు, మీరు ఆత్మను గురించి శ్రద్ధ తీసుకోవాలి. Tasmād evam. Tasmād evaṁ viditvā. కేవలము అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఆత్మ ముఖ్యమైనదని . మీరు ఈ శరీరం కోసం భాద పడవలసిన అవసరము లేదు. ఇది ఎప్పుడో నిర్ణయింపబడింది. చాలా బాధలు, చాలా సుఖాలు, మీరు పొందుతారు. శరీరం ఉన్నప్పటికీ, భౌతిక శరీరం... ఎందుకంటే మూడు గుణాల ప్రకారం భౌతిక శరీరం కూడా సృష్టించబడింది. Kāraṇaṁ guṇa-saṅgo 'sya sad-asad-janma-yoniṣu ( BG 13.22)