TE/Prabhupada 0511 - ఆత్మ యొక్క ఆకలి వాస్తవమైనది. ఆత్మ ఆధ్యాత్మిక ఆహారాన్ని పొందడం లేదు



Lecture on BG 2.25 -- London, August 28, 1973


ఎవరైనా ఈ భౌతిక శరీరం చాలా ముఖ్యమైనదని అంగీకరిస్తాన్నారో... ఉదాహరణకు వేరే రోజు లాగా, కొంతమంది మూర్ఖులు వచ్చారు. వారు ఈ శరీరానికి ఆహారం అందించటానికి చాలా ఆసక్తిని కలిగి ఉన్నారు. ఎవరైతే ఆకలితో ఉన్నవారు, పస్తులతో... జీవితం యొక్క శరీర భావన ఆకలితో. కానీ ఆధ్యాత్మిక ఆకలి ఉంది. అది మనము శ్రద్ధ తీసుకోవడం లేదు. భౌతిక ఆకలి ఉంటుంది, కానీ వాస్తవానికి అది సమస్య కాదు ఎందుకంటే ఈ భౌతిక శరీరాన్ని నిర్వహించడం కొరకు తగినంత ఏర్పాటు ఉంటుంది. ఆత్మ యొక్క ఆకలి వాస్తవమైనది. ఆత్మ ఆధ్యాత్మిక ఆహారాన్ని పొందడం లేదు. ఇక్కడ, ఈ సమావేశంలో, ఆకలితో ఉన్న ఆత్మకు ఇవ్వడానికి ఇది ఉద్దేశించబడింది. మరియు వెంటనే మీరు కొంత ఆధ్యాత్మిక ఆహారాన్ని పొందుతారు, అప్పుడు మనము సంతోషంగా మారతాము. అది పరిస్థితి. Yayātmā suprasīdati. మీరు ఆధ్యాత్మిక ఆహారాన్ని తీసుకోకపోతే వాస్తవమైన ఆత్మ యొక్క సంతృప్తి ఉండదు. అదే ఉదాహరణ, బోను లోపల అక్కడ పక్షి ఉంది. మీరు కేవలం చాలా నాజూకుగా పంజరం కడగడం మరియు దానిని కవర్ చేసి, రంగు వేసి, బోను లోపల పక్షి ఏడుస్తుంది, ఆకలితో, ఈ నాగరికత ఏమిటి? అదేవిధముగా, మనము ఆత్మ, మనము ఈ శరీరం లోపల బంధించబడ్డాము, మన సహజ కోరిక ఈ బంధనం నుండి స్వేచ్ఛ పొందటం. ఎలాగైతే పక్షి పంజరంలో నుండి స్వేచ్ఛ పొందడానికి కష్టపడుతుందో అలా. అదేవిధముగా, మనము కూడా, మనము సంతోషంగా లేము. పంజరంలో బంధించబడ్డాము. నిన్న భగవద్-గీత నుండి మనము చదువుకున్నాము ఆత్మ యొక్క స్థానం సర్వ -గతః. ఆత్మ ఎక్కడైనా వెళ్ళవచ్చు. అంటే, అది స్వేచ్ఛను కలిగి ఉంది. యోగ మార్మిక శక్తి ద్వారా ఆధ్యాత్మికంగా పురోగమించిన వారు, వారు కూడా ఎక్కడికైనా వారు ఇష్టపడిన చోటుకు వెళ్తారు. అనిమ, లఘిమా సిద్ధి. భారతదేశంలో యోగులు ఇప్పటికీ ఉన్నారు, ఉదయం పూట, నాలుగు ధామములలో స్నానం చేసుకుంటారు: హరిద్వార్, జగన్నాథ పురి, రామేశ్వరం, ద్వారక. యోగులు ఇప్పటికీ ఉన్నారు. ఒక గంటలో, వారు నాలుగు ప్రదేశాలలో స్నానం చేస్తారు. సర్వ-గతః, వేగం. వారు ఒకే ధామములో కూర్చుని, కొన్ని నిమిషాలలో, యోగ పద్ధతి ద్వారా, లేస్తారు, ఇక్కడ ఈ నీటిలో మునిగి. మీరు అనుకోండి లండన్ లో మునిగి , థేమ్స్ నది లో మీరు మునక వేసి, మరియు మీరు లేవంగనే కలకత్తా గంగాస్ లో మీరు చూస్తారు. అలాంటి యోగ పద్ధతి ఉంది. సర్వ- గతః ఇలా ఆత్మ చాలా స్వేచ్ఛ కలిగి ఉంటుంది, సర్వ- గతః, ఆయన ఇష్టపడిన ఎక్కడికైనా ఆయన వెళ్తారు. కానీ అవరోధం ఈ శరీరం ఇది మన స్వేచ్ఛను ఆపుతుంది . కాబట్టి మీరు ఈ భౌతిక శరీరాన్ని వదిలితే, ఆధ్యాత్మిక శరీరంలో ఉంచబడతారు ... నారద ముని లాగా, ఆయన ఎక్కడికైనా వెళ్ళగలడు, ఆయన వెళ్తాడు, ఆయన కర్తవ్యము వెళ్లడం. కొన్నిసార్లు ఆయన వైకుంఠ లోకాలకు వెళ్తాడు లేదా కొన్నిసార్లు ఈ భౌతిక లోకాలకు వస్తాడు. ఆయన ఆధ్యాత్మిక శరీరం పొందారు, ఆయన ఎక్కడికైనా స్వేచ్చగా కదిలి వెళ్తాడు, స్పేస్ మెన్ . వారు మెషీన్లో అంతరిక్షంలో ప్రయాణించటానికి ప్రయత్నిస్తున్నారు. అక్కడ యంత్రం అవసరం లేదు. Yantrārūḍhāni māyayā ( BG 18.61) యంత్రం మాయ చేత తయారుచేయబడింది. కాని మీరు సొంత శక్తి కలిగి ఉన్నారు. ఇది చాలా వేగవంతమైనది. ఇది ఆపబడుతుంది అందువల్ల చాలా జాగ్రత్త వహించాలి ఆత్మను ఎలా పొందాలో ఈ భౌతిక శరీరం యొక్క బంధనం నుండి బయటపడ్డానికి . అది మన మొదటి పనై ఉండాలి. కానీ ఎవరైతే కేవలం ఈ శరీరానికి సంబంధించి నిమగ్నమై ఉంటారో, వారు జంతువులు, ఆవులు, గాడిదలు కన్నా ఉన్నతం కాదు. Sa eva go-kharaḥ ( SB 10.84.13)