TE/Prabhupada 0524 - అర్జునుడు కృష్ణుడి యొక్క శాశ్వతమైన స్నేహితుడు. అతడు మాయలో ఉండలేడు



Lecture on BG 7.1 -- Los Angeles, December 2, 1968


ప్రభుపాద: అవును.

జయ-గోపాల: భగవద్గీతలో నాలుగవ అధ్యాయంలో, ఎన్నో సంవత్సరాల క్రితం సూర్యదేవునికి భగవద్గీత బోధిస్తున్నపుడు అర్జునుడు ఉన్నాడని చెప్పబడింది. ఆయన అక్కడ ఏ పరిస్థితిలో ఉన్నాడు?

ప్రభుపాద: ఆయన కూడా ఉన్నాడు, కానీ ఆయన మర్చిపోయాడు.

జయ-గోపాల: ఏ పరిస్థితిలో ఉన్నాడు, అది కురుక్షేత్ర యుద్ధంలో మాట్లాడకపోయి ఉంటే? ఏ పరిస్థితి?

ప్రభుపాద: భగవంతుని యొక్క మహోన్నత సంకల్పం వల్ల అర్జునుడు ఆ స్థానంలో ఉంచబడ్డాడు. అది గాక రంగస్థల స్థితి వలె‌, తండ్రి కుమారుడు ఇద్దరూ కొంత భాగాన్ని నటిస్తున్నారు. తండ్రి రాజు వలే నటిస్తున్నాడు, కుమారుడు ఇంకొక రాజు వలె నటిస్తున్నాడు. రెండూ విరుద్ధమైనవి. కానీ వాస్తవానికి వారు అలా నటిస్తున్నారు. అదేవిధముగా, అర్జునుడు కృష్ణుడి యొక్క శాశ్వతమైన స్నేహితుడు. అతడు మాయలో ఉండలేడు. కృష్ణుడు తన స్థిరమైన స్నేహితుడైతే అతడు మాయలో ఎలా ఉండగలడు? కానీ అతడు మాయలో ఉండవలసి వచ్చింది, తద్వార అతడు ఒక బద్ధుడైన ఆత్మ యొక్క భాగాన్ని పోషించాడు, కృష్ణుడు ఈ మొత్తం విషయాన్ని వివరించాడు. ఆయన సాధారణ వ్యక్తి వలె నటించాడు, అందువల్ల ఆయన ప్రశ్నలన్నీ సాధారణ మనిషిలానే ఉన్నాయి. తప్ప.... గీత ఉపదేశములు పోయినందున. అది వివరించబడింది. కాబట్టి కృష్ణుడు గీత యొక్క యోగ పద్ధతిని మళ్లీ అందజేయాలని అనుకుంటున్నాడు. కాబట్టి కొంతమంది అడగవచ్చు. మీరు అడుగుతున్నట్లుగానే నేను సమాధానము చెబుతున్నాను. అదేవిధంగా అర్జునుడు, ఆయన భ్రమలో ఉండవలసినది కాదు, ఆయన బద్ధ జీవాత్మ యొక్క ప్రతినిధిగా తనను తాను ఉంచెను, ఆయన చాలా విషయాలు అడిగాడు, జవాబులు భగవంతుడి ద్వారా ఇవ్వబడినవి