TE/Prabhupada 0529 - రాధా కృష్ణుల ప్రేమ వ్యవహారాలు సాధారణమైనవి కావుRadhastami, Srimati Radharani's Appearance Day -- London, August 29, 1971


కాబట్టి కృష్ణుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కృష్ణుడు ఆనందించాలనుకున్నప్పుడు, ఏ విధమైన ఆనoదo ఉoటుoది? ఈ విషయం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కృష్ణుడు చాలా గొప్పవాడు; దేవుడు గొప్పవాడు, అందరికీ తెలుసు. కాబట్టి గొప్పవాడు ఆనoదిoచాలని అనుకున్నప్పుడు , అది ఏ రకమైన ఆనందం అవ్వాలి? అది అర్థం చేసుకోవాలి. రాధా-కృష్ణ... అందువల్ల స్వరూప దామోదర గోస్వామి ఒక శ్లోకము రాశారు,rādhā-kṛṣṇa-praṇaya-vikṛtiḥ. రాధా కృష్ణుల ప్రేమ వ్యవహారాలు సాధారణమైనవి కావు, ఈ భౌతిక ప్రేమ వ్యవహారాలు, అలా కనిపించినప్పటికీ కాని కృష్ణుడిని ఏవరు అర్థం చేసుకోలేరు, avajānanti māṁ mūḍhāḥ ( BG 9.11) మూఢా, దుష్టులు, మూర్ఖులు, వారు కృష్ణుడిని సాధారణ మనిషిగా అర్థం చేసుకుంటారు. కృష్ణుడిని మనలో ఒకరిగా తీసుకున్న వెంటనే ... Mānuṣīṁ tanum āśritāṁ, paraṁ bhāvam ajānantaḥ. ఈ దుష్టులు, వారికి పరం భావమ్ తెలియదు. వారు కృష్ణుడి లీలను, రాస-లీలను అనుకరించటానికి ప్రయత్నిస్తారు. అనేక మూర్ఖులు ఉన్నారు. కాబట్టి ఈ విషయాలు జరుగుతున్నాయి. కృష్ణుడు అంటే అవగాహన లేదు. కృష్ణుడిని అర్థం చేసుకోవడం చాలా కష్టము.

manuṣyāṇāṁ sahasreṣu
kaścid yatati siddhaye
yatatām api siddhānāṁ
kaścin māṁ vetti tattvataḥ
(BG 7.3)

లక్షలాది మoదిలో, తన జీవితాన్ని పరిపూర్ణoగా చేసుకోవడానికి ఒక వ్యక్తి ప్రయత్నిoచవచ్చు. అందరూ జంతువులు లాగా పని చేస్తున్నారు. జీవిత పరిపూర్ణత గురించి ఏ ప్రశ్నా లేదు. జంతు ప్రవృత్తులు: తినడం, నిద్రపోవటం, సంభోగము చేయడము, రక్షించుకోవటము ... కాబట్టి అందరూ జంతువులు వలె నిమగ్నమై ఉన్నారు. వారికి వేరే పని లేదు ఉదాహరణకు జంతువు, పందులు, కుక్కలు వలె, మొత్తం పగలు రాత్రి పని చేస్తున్నారు: "మలం ఎక్కడ ఉంది? మలం ఎక్కడ ఉంది?" దానికి కొoత మలము వచ్చిన వెంటనే, కొoత కొవ్వు వస్తుంది, "మైథున సుఖము ఎక్కడ ఉంది? మైథున సుఖము ఎక్కడ ఉంది?" తల్లి లేదా సోదరి అని పరిగణన లేదు. ఇది పంది జీవితము.

కాని మానవ జీవితం పంది నాగరికతకు ఉద్దేశించబడలేదు. కాబట్టి ఆధునిక నాగరికత పంది నాగరికత, ఇది చొక్కా కోటుతో మెరుగుపెట్టినప్పటికీ. కాబట్టి, మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఈ కృష్ణ చైతన్య ఉద్యమం కృష్ణుడిని అర్థం చేసుకోవడానికి. కృష్ణుడిని అర్థం చేసుకోవడానికి, కొంచము శ్రమ, తపస్సు, నిష్ఠ అవసరం. Tapasya brahmacāryeṇa śamena damena ca. తపస్య. వ్యక్తులు తపస్యను పాటించవలసి ఉంటుoది. Brahmacārya, బ్రహ్మచర్య. తపస్య. బ్రహ్మచర్య అంటే లైంగిక జీవితం ఆపటం లేదా లైంగిక జీవితాన్ని నియంత్రించడం. Brahmacārya. అందుచే వేదముల నాగరికత , ప్రారంభము నుండి, బ్రహ్మచర్య , బ్రహ్మచారి కావాడానికి బాలురికి శిక్షణ ఇస్తుంది. ఈ ఆధునిక రోజులలో, పాఠశాలలో, అబ్బాయిలు అమ్మాయిలు, పది సంవత్సరాలు, పన్నెండు సంవత్సరాలు, వారు ఆనందిస్తున్నారు. మెదడు చెడిపోయింది. వారు ఉన్నత విషయాలు అర్థం చేసుకోలేరు. మెదడు కణజాలం పాడైపోయింది. కాబట్టి బ్రహ్మచారి అవ్వకుండా, ఆధ్యాత్మిక జీవితాన్ని ఎవరూ అర్థం చేసుకోలేరు. Tapasya brahmacāryeṇa śamena damena ca. Śama అంటే ఇంద్రియాలను నియంత్రించుట, మనస్సుని నియంత్రించుట; దమేన, ఇంద్రియాలను నియంత్రించటం; tyāgena; Śaucena, శుభ్రత; త్యాగేన, త్యాగా అంటే దానము చేయు గుణము. ఇవి మనల్ని మనము అవగాహన చేసుకొనే పద్ధతులు, ఆత్మ-సాక్షాత్కారమునకు కాని ఈ యుగములో ఈ పద్ధతులన్నీ పాటించుట చాలా కష్టము. ఆచరణాత్మకంగా ఇది అసాధ్యం. అందువలన భగవంతుడు చైతన్య, కృష్ణుడు, ఒక పద్ధతి ద్వారా తానే సులభముగా అందుబాటులోకి వచ్చారు :

harer nāma harer nāma harer nāmaiva kevalam
kalau nāsty eva nāsty eva nāsty eva gatir anyathā
(CC Adi 17.21)

ఈ యుగములో, కలి యుగ ... కలి-యుగము బాగా పతితమైన యుగముగా పరిగణించబడుతుంది. మనం చాలా ఉన్నతి సాధిస్తున్నామని మనము ఆలోచిస్తున్నాం, కాని ఇది చాలా పతితమైన యుగము ఎందుకంటే ప్రజలు జంతువులుగా మారుతున్నారు. జంతువులకు ఏ ఇతర ఆసక్తి లేదు - శారీరక అవసరాలు నాలుగు సూత్రాల కంటే తినడం, నిద్ర పోవడము, సంభోగము చేయడము రక్షించుకోవటము - కాబట్టి ఈ యుగములో, ప్రజలు శరీరమునకు కావలసిన నాలుగు సూత్రాల మీద ఆసక్తి కలిగి ఉన్నారు. వారికి ఆత్మ యొక్క ఏ సమాచారము లేదు, వారు ఆత్మను గ్రహించటానికి సిద్ధంగా లేరు. ఈ యుగము యొక్క లోపము ఇది. కాని మానవ రూపం ప్రత్యేకించి ఆత్మ సాక్షాత్కారము కొరకు, "నేను ఏమిటి?" ఇది మానవ జీవితం యొక్క లక్ష్యం