TE/Prabhupada 0530 - అతను విష్ణువు దగ్గరకు వచ్చినప్పుడు బాధ నుండి బయటపడవచ్చు
Radhastami, Srimati Radharani's Appearance Day -- London, August 29, 1971
Athāto brahma jijñāsā. ఈ జీవితం బ్రహ్మణ్ గురించి ప్రశ్నించడానికి ఉద్దేశించబడింది. బ్రహ్మణ్, పరమత్మా, భగవాన్. ఈ విచారణలు అక్కడ ఉండాలి. Jijñāsu. వారిని జిజ్ఞాసు అంటారు, బ్రహ్మ-జిజ్ఞాస, జిజ్ఞాసు, విచారణ. మనము ప్రతి ఉదయం విచారణ చేస్తున్నట్లుగా, "ఈ రోజు వార్తలు ఏమిటి?" వెంటనే మనము వార్తాపత్రికను తీసుకుంటాము. ఆ విచారణ ఉంది. కాని మనం ఉన్నతము కాని విషయములను మాత్రమే ప్రశ్నిస్తున్నాము. అత్యున్నత అవకాశం, బ్రహ్మ-జిజ్ఞాస గురించి ప్రశ్నించే కోరిక లేదు. ఇది ఆధునిక నాగరికతలో లోటు. డబ్బు సంపాదించడం ఎలా అని విచారించడము: divā cārthehayā rājan kuṭumba-bharaṇena vā ( SB 2.1.3) ఈ యుగంలో మాత్రమే కాదు ... ఈ యుగంలో ఇది ప్రధాన కారణముగా మారింది, కాని ఈ భౌతిక ప్రపంచంలో, ప్రతి ఒక్కరూ జీవితం యొక్క ఈ శరీర అవసరాల కోసం మాత్రమే నిమగ్నమై ఉన్నారు. Nidrayā hṛiyate naktam: రాత్రిపూట వారు నిద్ర పోతారు, చాలా గాఢాముగా నిద్ర పోతారు, గురక పెడుతూ. లేదా లైంగిక జీవితం . Nidrayā hṛiyate naktaṁ vyavāyena ca vā vayaḥ ( SB 2.1.3) ఈ విధముగా వారు సమయం వృధా చేస్తున్నారు. పగటిపూట, divā cārthehayā rājan... పగటి సమయంలో, "డబ్బు ఎక్కడ ఉంది? డబ్బు ఎక్కడ ఉంది? డబ్బు ఎక్కడ ఉంది?" Artha ihāya. Kuṭumba-bharaṇena vā. డబ్బు వచ్చిన వెంటనే, అప్పుడు కుటుంబ అవసరాల కోసం ఎలా కొనుగోలు చేయాలి , అంతే కొనుక్కోవటము, నిల్వ చేయటము. ఇది భౌతిక జీవితం యొక్క నిమగ్నత. అందులో, వాస్తవమునకు తెలివైన వ్యక్తి ... Manuṣyāṇāṁ sahasreṣu kaścid yatati siddhaye ( BG 7.3) నిద్రపోవటము, లైంగిక సుఖము అనుభవించటము, డబ్బు సంపాదించడం చేసే ఎందరో మూర్ఖ వ్యక్తులలో చక్కని అపార్ట్మెంట్ మరియు ఆహారము కుటుంబానికి అందించడం ... ఇది సాధారణ వృత్తిగా ఉంది. అలాంటి వేలాది మంది వ్యక్తులలో, జీవితాన్ని ఈ మానవ రూపాన్ని ఎలా పరిపూర్ణంగా చేసుకోవాలనే ఉత్సాహము కేవలము ఒక్కరికే ఉంటుంది . Manuṣyāṇāṁ sahasreṣu kaścid yatati siddhaye.
Siddhaye. సిద్ధి అంటే పరిపూర్ణము. కాబట్టి ఈ జీవితం పరిపూర్ణము చేసుకోవడము కోసం ఉద్దేశించబడింది. పరిపూర్ణము అంటే ఏమిటి? పరిపూర్ణత అనేది మనము బాధాకరమైన పరిస్థితి గల జీవితమును వద్దు అని అనుకుంటున్నాము, మనము దాని నుండి బయటపడాలి. అది పరిపూర్ణము. ప్రతి ఒక్కరూ జీవితం యొక్క దుర్భర పరిస్థితి నుండి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. కాని వారికి దుర్భర జీవితం యొక్క వాస్తవ స్థితి ఏమిటో తెలియదు. జీవితం యొక్క దుర్భర పరిస్థితి: tri-tāpa-yantanaḥ. కాబట్టి దీనిని ముక్తి అని అంటారు లేదా విముక్తి వీటి నుంచి ... Ātyantika-duḥkha-nivṛttiḥ. Duḥkha, duḥkha అంటే బాధ. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ నుండి బయటపడాలని ప్రయత్నిస్తున్నారు. కాని ఆయనకు బాధ నుండి బయట పడటానికి అంతిమ గమ్యము ఏమిటో తెలియదు. Na te viduḥ. వారికి తెలియదు. Na te viduḥ svārtha-gatiṁ hi viṣṇum ( SB 7.5.31) ఆయన విష్ణువు దగ్గరకు వచ్చినప్పుడు బాధ నుండి బయటపడవచ్చు. Tad viṣṇuṁ paramaṁ padaṁ sada paśyanti sūrayaḥ. Tad viṣṇoḥ paramaṁ padam. విష్ణు లోకము ... ఉదాహరణకు ఈ భౌతిక ప్రపంచంలో వలె, వారు చంద్ర లోకమునకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు, కాని ఈ వెర్రి ప్రజలకు తెలియదు, వారు చంద్ర లోకమునకు వెళ్ళినా కూడా ఏమి పొందుతారో. ఇది భౌతిక గ్రహాలలో ఒకటి. కృష్ణుడు ఇప్పటికే భగవద్గీతలో సలహా ఇస్తున్నాడు, abrahma-bhuvanāl lokān ఈ చంద్ర లోకము గురించి ఏమి మాట్లాడతాము - ఇది చాలా దగ్గరగా ఉంది - మీరు ఉన్నత లోకముగా పిలువబడే బ్రహ్మలోకమునకు వెళ్లినా కూడా ... అది మీ ముందు ఉంది, మీరు ప్రతి రోజు చూడగలరు, ప్రతి రాత్రి, ఎన్ని లోకాలు మరియు గ్రహాలు ఉన్నాయో. కాని మీరు అక్కడకు వెళ్ళలేరు. మీరు కేవలం సమీప లోకమునకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. అది కూడా వైఫల్యం అవుతుంది. కానీ మీ శాస్త్రీయ అభివృద్ధి ఏమిటి? కాని అవకాశం ఉంది. Ā-brahma-bhuvanāl lokān. మీరు వెళ్ళ వచ్చు. భౌతిక శాస్త్రవేత్తల గణన ఏమిటంటే ఒక వ్యక్తి ఉన్నత స్థానమునకు వెళ్ళితే, కాంతి యొక్క వేగముతో, కాంతి యొక్క వేగముతో, నలభై వేల సంవత్సరాలు, అప్పుడు ఈ భౌతిక ప్రపంచములో అత్యంత ఉన్నత లోకమునకు చేరుకోవచ్చు. కాబట్టి కనీసము ఆధునిక శాస్త్రీయ గణనలో, ఇది అసాధ్యం. కాని ఒకరు వెళ్ళవచ్చు; పద్ధతి ఉంది. మన చిన్న పుస్తకంలో ఇతర గ్రహాలకి సులభ ప్రయాణములో వివరించడానికి ప్రయత్నించాము. యోగా పద్ధతి ద్వారా ఆయన ఇష్టపడే ఏ లోకమునకు అయినా వెళ్ళవచ్చు. అది యోగ పరిపూర్ణము. ఒక యోగి పరిపూర్ణంగా మారినప్పుడు, అతడు ఇష్టపడే ఏ గ్రహానికి అయినా వెళ్ళవచ్చు, మరియు యోగా అభ్యాసం కొనసాగుతుంది, యోగి తనను తాను పరిపూర్ణంగా చేసుకున్నాడని భావిస్తే తప్ప ఆయన ఇష్టపడే ఏ లోకమునకు అయినా ప్రయాణం చేయటము. అది యోగా అభ్యాసం యొక్క పరిపూర్ణత. కావున, ఇవి ఈ జీవితం యొక్క పరిపూర్ణతలుగా ఉన్నాయి, ఆ చిన్న, గాలిలో తేలుతున్న స్పుట్నిక్. (నవ్వు) జీవన పరిపూర్ణత ఏమిటో వారికి తెలియదు. మీరు ఎక్కడైనా వెళ్ళవచ్చు