TE/Prabhupada 0537 - ఆరాధన కోసం కృష్ణుడు పేదవానికి కూడా అందుబాటులో ఉన్నాడు
Janmastami Lord Sri Krsna's Appearance Day Lecture -- London, August 21, 1973
శాస్త్రంలో ఇది చెప్పబడింది, janasya moho 'yam ahaṁ mameti ( SB 5.5.8) ఈ "నేను మరియు నా" తత్వము భ్రాంతి. కాబట్టి ఈ భ్రాంతి అంటే మాయ. మాయ... మీరు ఈ భ్రమ నుండి బయటపడాలనుకుంటే, మాయ, అప్పుడు మీరు కృష్ణుడి సూత్రాన్ని అంగీకరించాలి. Mām eva ye prapadyante māyām etāṁ taranti te. మార్గదర్శకానికి ప్రతీది భగవద్గీతలో ఉంది భగవద్గీత యధాతథము యొక్క తత్వమును మనము అంగీకరించినట్లయితే. అంతా ఉంది. శాంతి ఉంది, శ్రేయస్సు ఉంది. కాబట్టి అది సత్యము. దురదృష్టవశాత్తు, మనము దీనిని ఆమోదించము. అది మన దురదృష్టం. లేదా మనము అది తప్పుగా అర్థం చేసుకుంటాము. కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు, man-manā bhava mad-bhakto mad-yājī māṁ namaskuru ( BG 18.65) కృష్ణుడు చెప్తాడు, "మీరు ఎల్లప్పుడూ నా గురించి అలోచించoడి," man-manā bhava mad-bhakto. నా భక్తుడు అవ్వండి. మద్యాజి, "మీరు నన్ను ఆరాధించండి." మామ్ నమస్కురు, " నాకు ప్రణామములు చేయండి." ఇది చాలా కష్టమైన పనా? ఇక్కడ కృష్ణుడు యొక్క అర్చామూర్తి ఉంది. మీరు ఈ అర్చామూర్తి గురించి అలోచిస్తే, రాధా-కృష్ణుడు గురించి ఆలోచిస్తే, ఇది చాలా కష్టమా? మన్మనా. మీరు ఆలయంలోకి వస్తారు, ఒక భక్తుడిగా, భగవంతునికి ప్రణామము చేస్తారు, man-manā bhava mad-bhakto. సాధ్యమైనంతవరకు దైవాన్ని పూజించే ప్రయత్నం చేస్తే, patraṁ puṣpaṁ phalaṁ toyaṁ yo me bhaktyā prayacchati ( BG 9.26) కృష్ణుడికి మీ మొత్తం ఆస్తి అవసరము లేదు. ఆరాధన కోసం కృష్ణుడు పేదవానికి కూడా అందుబాటులో ఉన్నాడు ఆయన ఏమి అడుగుతున్నాడు? ఆయన చెప్తాడు, patraṁ puṣpaṁ phalaṁ toyaṁ yo me bhaktyā prayacchati: భక్తితో, ఒక వ్యక్తి నాకు ఒక చిన్న ఆకును అర్పిస్తే, చిన్న పండును, కొంచెం నీరును, నేను దానిని స్వీకరిస్తాను." కృష్ణుడు ఆకలితో లేడు, కానీ కృష్ణుడు మిమ్మల్ని భక్తుడిగా చేయాలని అనుకుంటాడు. ఇది ప్రధాన విషయము. Yo me bhaktyā prayacchati. అది ప్రధాన సూత్రం. మీరు కృష్ణుడికి చిన్న వస్తువులను అందిస్తే ... కృష్ణుడు ఆకలితో లేడు; అందరికీ కృష్ణుడే ఆహారం అందిస్తున్నాడు. Eko yo bahūnāṁ vidadhāti kāmān. కానీ కృష్ణుడు మీ ప్రేమను, మీ భక్తిని కోరుకుంటున్నారు. అందువల్ల అతడు వేడుకుంటున్నాడు కొంచము patraṁ puṣpaṁ phalaṁ toyaṁ. Man-manā bhava mad-bhakto. కృష్ణుడిని అర్థం చేసుకోవడంలో మరియు కృష్ణ చైతన్యమును స్వీకరించడానికి ఎటువంటి కష్టము లేదు. కానీ మనము అలా చేయము; అది మన వ్యాధి. లేకపోతే, అది ఏ మాత్రము కష్టం కాదు. మనము కృష్ణుడి భక్తుడు అయిన వెంటనే, మనము మొత్తం పరిస్థితిని అర్థం చేసుకుంటాము. మన తత్వము, భాగవత తత్వము, ఇది కూడా కమ్యూనిజము, సమసమాజ సిద్ధాంతము, ఎందుకంటే మనము కృష్ణుడిని మహోన్నతమైన తండ్రిగా అంగీకరిస్తాము , అన్ని జీవులు, వారందరు కృష్ణుడి కుమారులు.
అందువల్ల ఆయన అన్ని లోకముల యొక్క యజమాని అని కృష్ణుడు చెబుతాడు, సర్వ-లోక-మహేశ్వరం ( BG 5.29) అందువలన ఏమైతే ఉందో, ఆకాశంలో లేదా నీటిలో లేదా భూమిలో గాని, అవి అన్నీ కూడా కృష్ణుడి ఆస్తి. ఎందుకనగా మనము కృష్ణుడి కుమారులము, కాబట్టి మనలో ప్రతి ఒక్కరు తండ్రి ఆస్తిని ఉపయోగించుకునే హక్కు ఉంది. కానీ మనము ఇతరుల మీద చొరబడకూడదు. ఇది శాంతి సూత్రం. Mā gṛdha kasya svidhanam, īśāvāsyam idaṁ sarvam ( ISO 1) ప్రతీది భగవంతుడికి చెందుతుంది. మీరు భగవంతుడి కుమారులు. మీరు, తండ్రి ఆస్తిని ఉపయోగించుకునే హక్కు మీకు ఉంది, కానీ మీకు కావలసిన దాని కంటే ఎక్కువ తీసుకోవద్దు. అది శిక్షార్హమైనది. ఈ విషయాలు శ్రీమద్-భాగవతంలో చెప్పబడ్డాయి. భగవద్గీతలో,Stena eva sa ucyate ( BG 3.12) "ఆయన ఒక దొంగ." ఎవరైనా అతని అవసరం కంటే ఎక్కువ తీసుకుంటే, అప్పుడు అతను ఒక దొంగ. Yajñārthāt karmaṇo 'nyatra loko 'yaṁ karma-bandhanaḥ ( BG 3.9) కృష్ణుడి సంతృప్తి కోసం... యజ్ఞ అంటే కృష్ణ. కృష్ణుడికి మరో నామము యజ్ఞేశ్వర. కాబట్టి మీరు కృష్ణుడి కోసం సేవ చేయండి, మీరు కృష్ణుడి ప్రసాదమును తీసుకోండి. అది మనం ఇక్కడ బోధిస్తున్నాం. ఈ ఆలయంలో, మనము నివసిస్తున్నాం అమెరికన్లు, భారతీయులు, ఆంగ్లేయులు, కెనడియన్లు, ఆఫ్రికన్లు, ప్రపంచంలోని వేర్వేరు భాగాల వారు. అది మీకు తెలుసు. ఈ ఆలయంలో మాత్రమే కాదు, ప్రపంచమంతా. (విరామం)
కృష్ణుడు మహోన్నతముగా ఆనందించేవాడు మరియు కృష్ణుడు అందరికీ మహోన్నతమైన మిత్రుడు. మీరు దీనిని మరచిపోయినప్పుడు, మనము ఈ భౌతిక ప్రపంచంలోకి వస్తాము జీవితము కోసం పోరాటం, ఒకరితో ఒకరు పోరాడతాము. ఇది భౌతిక జీవితం. కాబట్టి మీరు పొందలేరు ... రాజకీయవేత్తలు, దౌత్యవేత్తలు, తత్వవేత్తలు, వారు చాలా ప్రయత్నించారు, కానీ నిజానికి ఏదీ ఫలము ఇవ్వలేదు. యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్యసమితి లాగే. ఇది రెండవ పెద్ద ప్రపంచ యుద్ధం తర్వాత ప్రారంభించబడింది, వారు మనము ప్రతిదీ శాంతిగా పరిష్కరించుకోవాలని కోరుకున్నారు. కానీ అలాంటిదేమీ లేదు. పోరాటం జరగబోతోంది, పాకిస్తాన్ మరియు భారతదేశం మధ్య, వియత్నాం మరియు అమెరికా మధ్య, దీనికి దానికి మధ్య. ఇది పద్ధతి కాదు. పద్ధతి కృష్ణ చైతన్యము. ప్రతి ఒక్కరూ ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి, మనము యజమాని కాదు. యజమాని కృష్ణుడు. అది సత్యము. ఉదాహరణకు అమెరికా వలె. రెండు వందల సంవత్సరాల క్రితం అమెరికన్లు, యూరోపియన్ వలసదారులు, వారు యజమాని కాదు - ఎవరో యజమాని. వారికి ముందు, ఎవరో యజమాని లేదా అది ఖాళీగా ఉన్న భూమి. వాస్తవ యజమాని కృష్ణుడు. కానీ కృత్రిమంగా మీరు "ఇది నా ఆస్తి." అని చెప్పుకుంటున్నారు Janasya moho 'yam ahaṁ mameti ( SB 5.5.8) దీన్ని మాయ అని పిలుస్తారు