TE/Prabhupada 0538 - చట్టం అంటే ప్రభుత్వముచే ఇవ్వబడిన ఆజ్ఞ. మీరు ఇంట్లో చట్టం చేయలేరు



Janmastami Lord Sri Krsna's Appearance Day Lecture -- London, August 21, 1973


కాబట్టి మనకు పాఠములు ఇవ్వాలని కృష్ణుడు అవతరిస్తాడు Yadā yadā hi dharmasya glānir bhavati bhārata ( BG 4.7) కృష్ణుడు చెప్తాడు, "నా ప్రియమైన అర్జునా, నేను వస్తాను, ధర్మ ఆచరణకు హాని ఉన్నప్పుడు." Dharmasya glānir bhavati. ధర్మ అంటే ఏమిటి? ధర్మ యొక్క సాధారణ నిర్వచనం dharmāṁ tu sākṣād bhagavat-praṇītam ( SB 6.3.19) ఇది ధర్మము .dharmāṁ tu sākṣād bhagavat-praṇītam ( SB 6.3.19) ఉదాహరణకు మీకు చట్టం అంటే ఏమిటి? చట్టం అంటే ప్రభుత్వముచే ఇవ్వబడిన ఆజ్ఞ. మీరు ఇంట్లో చట్టం చేయలేరు. అది సాధ్యం కాదు. ప్రభుత్వం మీకు ఇచ్చినది ఏదైనా, "మీరు ఇలా ఉండాలి," అది చట్టము. అదేవిధముగా, ధర్మము అంటే దేవుడిచ్చిన నిర్దేశాన్ని సూచిస్తుంది. అది ధర్మము . సాధారణ నిర్వచనం. మీరు ధర్మమును సృష్టించుకోండి. నేను ఈ ధర్మాన్ని సృష్టించాను, మరొక మనిషి మరొక ధర్మాన్ని సృష్టిస్తాడు; ఇవి ధర్మము కాదు. అందువలన, భగవద్గీత ముగిసిన చోట, ఆక్కడ sarva-dharmān parityajya mām ekaṁ śaraṇaṁ ( BG 18.66) ఇది ధర్మము - కృష్ణుడికి శరణాగతి పొందటానికి. ఏదైనా ఇతర ధర్మము, అది ధర్మము కాదు. లేకపోతే, ఎందుకు కృష్ణుడు sarva-dharmān parityajyaను అడుగుతాడు: "వదిలేయండి"? ఆయన dharma-saṁsthāpanārthāya sambhavāmi yuge yuge: గురించి చెప్పాడు ధర్మము యొక్క సూత్రాలను స్థాపించడానికి నేను వస్తున్నాను. అంతిమంగా ఆయన చెప్పుతారు,sarva-dharmān parityajya. అంటే మనము తయారు చేసిన ధర్మములు అని పిలిచేవి, మానవ నిర్మిత ధర్మాలు, అవి ధర్మములు కాదు. ధర్మ అంటే దేవుడిచే ఇవ్వబడినది. కాని మనకు ఏ అవగాహన లేదు దేవుడు అంటే ఏమిటి మరియు ఆయన ఉపదేశము ఏమిటి? ఇది ఆధునిక నాగరికత లోపం. కాని ఆజ్ఞ ఉంది, దేవుడు ఉన్నాడు - మనము అంగీకరించము. శాంతి అవకాశం ఎక్కడ ఉంది? ఆజ్ఞ ఉంది. కృష్ణుడు చెప్తాడు, మహోన్నతమైనవాడు, భగవాన్ ఉవాచ. వ్యాసదేవుడు వ్రాస్తాడు భగవాన్ ఉవాచ. భగవాన్ అంటే ఏమిటో మనము తెలుసుకోవాలి. వ్యాసదేవుడు కృష్ణుడు ఉవాచ అని రాసి ఉండవచ్చు. లేదు ఆయన చెప్పాడు ... ఎవరైనా కృష్ణుడిని తప్పుగా అర్థం చేసుకుంటే, అందుచే ఆయన ప్రతి చరణములో, ప్రతి శ్లోకములో, శ్రీ భగవాన్ ఉవాచ అని వ్రాస్తాడు. కాబట్టి భగవాన్ ఉన్నాడు. భగవాన్ మాట్లాడుతున్నాడు. భగవాన్ -ఆచార్యులు అందరిచే ఆమోదించబడ్డాడు. రామానుజాచార్య, మధ్వాచార్య, విష్ణు స్వామి. తాజాగా, భగవంతుడు చైతన్య మహాప్రభు, శంకరాచార్య కూడా, ఆయన కూడా Kṛṣṇas tu bhagavān svayaṁ కృష్ణుడిని అంగీకరించారు. కాబట్టి ఆధునిక ఆచార్యుల తీర్పు, గతంలో కూడా, వ్యాసదేవుడు, నారద, అసిత, ప్రతి ఒక్కరూ కృష్ణుడిని అంగీకరించారు, దేవాదిదేవుడు కృష్ణుడి నుండి విన్న అర్జునుడు భగవద్గీతను అర్థం చేసుకున్న తరువాత, ఆయన చెప్పాడు, paraṁ brahma paraṁ dhāma pavitraṁ paramaṁ bhavān puruṣam ādyaṁ śāśvatam ( BG 10.12)

కాబట్టి ప్రతిదీ ఉంది. ముఖ్యంగా భారతదేశములో, మనము దేవుడిని అర్థం చేసుకోవడానికి, చాలా ఆస్తి ఉంది. సాధారణ విషయము. ప్రతిదీ తయారు చేసి సిద్ధంగా ఉంది. కాని మనము అంగీకరించలేము. అలాoటి వ్యాధికి నివారణ ఏమిటి? మనము శాంతి కొరకు వెతుకుతున్నాము, కాని వాస్తవానికి మనము శాంతిని ఇచ్చే దేనిని అంగీకరించము. ఇది మన వ్యాధి. కాబట్టి ఈ కృష్ణ చైతన్య ఉద్యమం మేలుకోల్పడానికి ప్రయత్నిస్తుంది ప్రతి ఒక్కరి హృదయంలో దాగి ఉన్న కృష్ణ చైతన్యమును. లేకపోతే, ఎలా ఈ యూరోపియన్లు అమెరికన్లు ఇతర దేశస్థులు, వారు నాలుగు లేదా ఐదు సంవత్సరాల క్రితం కృష్ణుడి గురించి ఎన్నడూ వినలేదు, వారు ఎలా కృష్ణ చైతన్యాన్ని తీవ్రముగా తీసుకొంటున్నారు? అందరి హృదయంలో కృష్ణ చైతన్యము ఉంది. దానిని తప్పక జాగృతం చేయాలి. ఇది చైతన్య-చరితామృతంలో వివరించబడింది:

nitya-siddha kṛṣṇa-bhakti 'sādhya' kabhu naya
śravaṇādi-śuddha-citte karaye udaya
(CC Madhya 22.107)

ఇది జాగృతం అవ్వాలి. కృష్ణుడి కోసము ప్రేమ, కృష్ణుడి కోసము భక్తి, అక్కడ ఉంది, ప్రతి ఒక్కరి హృదయం లోపల, కాని ఆయన(వారు) మర్చిపోయారు. కాబట్టి ఈ కృష్ణ చైతన్య ఉద్యమము కేవలం కృష్ణ చైతన్యాన్ని మేల్కొల్పడానికి ఉద్దేశించబడింది. ఇది పద్ధతి. మీరు నిద్రపోతున్నప్పుడు, మిమ్మల్ని, నేను బిగ్గరగా పిలవాలి. అటువoటి మరియు అటువoటి అటువoటి , అయ్యా లేవండి. మీకు ఈ కర్తవ్యము ఉన్నది. మీరు నిద్రపోతున్నప్పుడు ఇతర ఇంద్రియాలు ఏవి పని చేయవు. కాని చెవి మాత్రము పని చేస్తుంది. అందువలన, ఈ యుగములో, ప్రజలు పతితులైనప్పుడు వారు ఏది వినరు, మనం ఈ హరే కృష్ణ మహా మంత్రాన్ని కీర్తన చేసినప్పుడు, ఆయన కృష్ణ చైతన్యమునకు మేల్కొoటాడు. ఇది ఆచరణాత్మకమైనది