TE/Prabhupada 0541 - మీరు నన్ను ప్రేమిస్తే, నా కుక్కను ప్రేమించండి



Sri Vyasa-puja -- Hyderabad, August 19, 1976


భగవంతుని ఉపదేశాల మీద మీరు వ్యాఖ్యానము చేయలేరు. అది సాధ్యం కాదు. ధర్మా అనగా dharmāṁ tu sākṣād bhagavat-praṇītam ( SB 6.3.19) మీరు మీ ఇంటి వద్ద ఒక రకమైన ధర్మ పద్ధతిని తయారు చేయలేరు. అది మూర్ఖత్వము, అది నిష్ఫలమైనది. ధర్మ అనగా sākṣād bhagavat-praṇītam. ఉదాహరణకు చట్టం లాగానే. చట్టం అంటే ప్రభుత్వం ఇచ్చేది. మీరు మీ ఇంటి వద్ద చట్టాలను తయారు చేయలేరు. వీధిలో, లౌకిక జ్ఞానము, ప్రభుత్వ చట్టం కుడివైపు వెళ్ళండి లేదా ఎడమ వైపు వెళ్ళండి. మీరు చెప్పలేరు "నేను కుడి లేదా ఎడమ వైపు వెళ్ళితే అక్కడ తప్పు ఏమిటి?" లేదు, అది మీరు చేయలేరు. అప్పుడు మీరు నేరస్థులు అవుతారు. అదే విధముగా ఈ రోజుల్లో... ఈ రోజుల్లో కాదు - అనాదిగా, చాలా ధర్మ పద్ధతులు ఉన్నాయి. చాలా. కానీ నిజమైన ధర్మ పద్ధతి అంటే భగవంతుడు చెప్పినది లేదా కృష్ణుడు చెప్పినది. Sarva-dharmān parityajya mām ekaṁ śaraṇaṁ vraja ( BG 18.66) ఇది ధర్మము. సరళమైనది. మీరు ధర్మాన్ని తయారు చేయలేరు.

అందువల్ల శ్రీమద్-భాగవతములో, మొదట, dharmaḥ projjhita-kaitavo 'tra paramo nirmatsarāṇām ( SB 1.1.2) కాబట్టి... ఎవరో అసూయ పడవచ్చు, ఈ వ్యక్తికి ఎవరో ఉన్నతమైన శిష్యులు ఉన్నారు వారు ప్రార్థనలు మరియు పూజ చేస్తున్నారు. కాదు, ఇది పద్ధతి. అసూయపడకండి... Ācāryaṁ māṁ vijānīyān nāvamanyeta karhicit ( SB 11.17.27) ఆచార్యులు భగవంతుని ప్రతినిధి. Yasya prasādād bhagavat-prasādo. మీరు ప్రార్థనలు చేస్తే, ఆచార్యులను గౌరవిస్తే, అప్పుడు కృష్ణుడు, భగవంతుడు, దేవాదిదేవుడు సంతోషముగా ఉంటాడు ఆయనను సంతోష పెట్టడానికి మీరు ఆయన ప్రతినిధిని సంతోష పెట్టాలి మీరు నన్ను ప్రేమిస్తే, నా కుక్కను ప్రేమించండి. భగవద్గీతలో ఆచార్యోపాసనం . అని చెప్పబడినది ఆచార్యోపాసనం. మనము ఆచార్యుని పూజించాలి.

yasya deve parā bhaktir
yathā deve tathā gurau
tasyaite kathita hy arthaḥ
prakāśante mahātmanaḥ
(ŚU 6.23)

ఇది వేదముల మంత్రం. Tad-vijñānārthaṁ sa gurum evābhigacchet (MU 1.2.12).

tasmād guruṁ prapadyeta
jijñāsuḥ śreya uttamam
śabde pāre ca niṣṇātaṁ
brahmaṇy upaśamāśrayam
(SB 11.3.21)

Tad viddhi praṇipātena paripraśnena sevayā ( BG 4.34) కాబట్టి ఇవి ఉపదేశములు. ఈ గురువు పరంపర పద్ధతి ద్వారా రావాలి. అప్పుడు అతడు ప్రామాణికుడు. లేకపోతే ఆయన ఒక మూర్ఖుడు. పరంపర పద్ధతి ద్వారా రావాలి, tad-vijñānam ద్వారా అర్థం చేసుకోవాలి, ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రం, మీరు గురువును సంప్రదించాలి. నేను ఇంట్లోనే ఉండి అర్థం చేసుకోగలను అని మీరు చెప్పలేరు. లేదు. అది సాధ్యం కాదు. అది అన్ని శాస్త్రముల యొక్క ఉపదేశము. Tasmād guruṁ prapad... ఎవరికి గురువు అవసరము? గురువు ఒక ఫ్యాషన్ కాదు, మీరు ఒక ఫ్యాషన్ గా కుక్కను ఉంచుకుంటారు, ఆధునిక నాగరికత, అదేవిధముగా మనము ఒక గురువును ఉంచుకుంటాము. కాదు, అలాంటిది కాదు. ఎవరికి గురువు అవసరం? Tasmād guruṁ prapadyeta jijñāsuḥ śreya uttamam ( SB 11.3.21) వాస్తవమునకు తీవ్రముగా ఆత్మ యొక్క విజ్ఞానాన్ని అర్థం చేసుకోవాలనే వ్యక్తికి. Tad vijñānam. Omṁ tat sat. ఆయనకు ఒక గురువు అవసరం. గురువు ఒక ఫ్యాషన్ కాదు.