TE/Prabhupada 0540 - ఒక వ్యక్తిని చాలా ఉన్నతమైన వ్యక్తిగా పూజించడము అనేది ఒక విప్లవం



Sri Vyasa-puja -- Hyderabad, August 19, 1976


శ్రీపాద సంపత్ భట్టాచార్య, లేడీస్ అండ్ జెంటిల్మెన్: ఈ వ్యాస పూజ వేడుక సందర్భంగా మీరు దయతో ఇక్కడకు వచ్చినందుకు ధన్యవాదాలు. Vyāsa-pūjā ... వారు కూర్చోవటానికి నేను ఏర్పాటు చేసిన ఈ ఆసనమును, దీనిని వ్యాసాసనము అని పిలుస్తారు. గురువు వ్యాసదేవుని యొక్క ప్రతినిధి. మీలో ప్రతి ఒక్కరూ వ్యాసదేవుడి పేరు, వేద వ్యాసుని పేరును విన్నారు. కాబట్టి గొప్ప ఆచార్యులుకు ప్రాతినిధ్యము వహిస్తున్న వ్యక్తి ఎవరైనా, వ్యాసదేవా, ఆయన వ్యాసాసనముపై కూర్చోవడానికి అనుమతించబడ్డాడు. కాబట్టి వ్యాస-పూజ... గురువు వ్యాసదేవుని ప్రతినిధి, అందువలన ఆయన జన్మ వార్షికోత్సవము Vyāsa-pūja గా అంగీకరించబడిoది.

ఇప్పుడు నేను నా స్థానాన్ని వివరించాలి ఎందుకంటే ఈ రోజుల్లో, ఒక వ్యక్తిని చాలా ఉన్నతమైన వ్యక్తిగా పూజించడము అనేది ఒక విప్లవం. ఎందుకంటే వారికి ప్రజాస్వామ్యం అంటే ఇష్టం, ఓటు వేయడం ద్వారా ఎంతటి దుష్టుడిని అయినా ఉన్నత స్థానములో కూర్చోపెట్టవచ్చు కాని మన పద్ధతి, గురు-పరంపర పద్ధతి, భిన్నంగా ఉంటుంది. మా పద్ధతి, మీరు వేదముల జ్ఞానాన్ని అంగీకరించకపోతే గురు-పరంపర పద్ధతి ద్వారా, ఇది పనికిరానిది. వేదముల భాష యొక్క వివరణను మీరు తయారు చేయలేరు. కేవలం ఆవు పేడ వలె ఆవు పేడ జంతువు యొక్క మలం. వేదముల ఉత్తర్వు అనేది మీరు ఆవు పేడను తాకినట్లయితే ..., జంతువు యొక్క ఏ మలమైనా, మీరు వెంటనే స్నానం చేసుకొని , మరియు మీరు పవిత్రము చేసుకోవాలి. కాని వేదముల ఉత్తర్వు కూడా ఉంది, ఆవు పేడ ఏదైనా అపవిత్ర ప్రదేశమును శుభ్రపరచగలదు. ముఖ్యంగా మనము హిందువులము, మనము దానిని అంగీకరిస్తాము. ఇప్పుడు కారణము పరముగా ఇది విరుద్ధంగా ఉంది. ఒక జంతువు యొక్క మలం అపవిత్రముగా ఉంటుంది, వేదముల ఉత్తర్వు ఆవు పేడ పవిత్రమైనది. వాస్తవానికి మనము ఆవు పేడను పవిత్రమైనదిగా, ఏ ప్రదేశమునైనా పవిత్రము చేయటానికి అంగీకరిస్తాము. పంచ గవ్యలో ఆవు పేడ ఉంది, ఆవు మూత్రం ఉంది.

కాబట్టి ఇది విరుద్ధముగా ఉంది, వేదముల శాసనము. కాని మనము అంగీకరిస్తాము ఎందుకంటే అది వేదముల అజ్ఞ అంటే... అది వేదాలను అంగీకరించడము. ఉదాహరణకు భగవద్గీత వలె. భగవద్గీత, చాలామంది దుష్టులు ఉన్నారు, వారు దానిని చిన్నదిగా చేస్తారు, చాలా భాగము తీసేసి: నేను దీన్ని ఇష్టపడుతున్నాను; నాకు ఇది ఇష్టం లేదు. కాదు అర్జునుడు చెప్పుతున్నాడు sarvam etad ṛtaṁ manye ( BG 10.14) ఇది వేదాల యొక్క అవగాహన. ఒక దుష్టుడు కత్తిరించినట్లయితే, కత్తిరించి, "నాకు ఇది ఇష్టం లేదు, నేను వివరిస్తాను" ఇది భగవద్గీత కాదు. భగవద్గీత అంటే మీరు యధాతథముగా అంగీకరించాలి. అది భగవద్గీత. అందువల్ల మనము భగవద్గీత యధాతథమును ఇస్తున్నాము. కృష్ణుడు చెప్తాడు, భగవద్గీత యొక్క వక్త, ఆయన ఇలా అంటాడు: sa kāleneha yogo naṣṭaḥ parantapa. నా ప్రియమైన అర్జునా, ఈ భగవద్గీత శాస్త్రం, imaṁ vivasvate yogaṁ proktavān aham avyayam ( BG 4.1) నేను సూర్యదేవుడికి మొదట ఉపదేశించాను, అతడు తన కుమారునికి ఉపదేశించాడు, vivasvān manave prāha. వైవస్వత మనువుకు. Manur ikṣvākave 'bravīt. Evaṁ paramparā-prāptam imaṁ rājarṣayo viduḥ ( BG 4.2) ఇది పద్ధతి. Sa kāleneha yogo naṣṭaḥ parantapa. ఈ పరంపర పద్ధతి ద్వారా రాని ఎవరైనా, వేదముల సాహిత్యం యొక్క ఏదైనా వివరణను ఆయన ప్రచారము చేస్తే, అది ఉపయోగము లేదు. ఇది నిరుపయోగం. దానికి అర్థము లేదు. Yogo naṣṭaḥ parantapa. కాబట్టి ఇది జరగబోతోంది. దానికి అర్థము లేదు