TE/Prabhupada 0546 - వీలైనన్ని పుస్తకాలను ప్రచురించండి మొత్తం ప్రపంచము అంతటా వితరణ చేయండి



His Divine Grace Srila Bhaktisiddhanta Sarasvati Gosvami Prabhupada's Appearance Day, Lecture -- Mayapur, February 21, 1976


ప్రభుపాద: ఈ భౌతిక ప్రపంచములో ఉన్నoత వరకు జీవుడు ఆయన భౌతిక ప్రకృతి యొక్క వివిధ గుణాలతో సాంగత్యము కలిగి ఉంటాడు. అదే ఉదాహరణ. ఉదాహరణకు అగ్ని కణము భూమి మీద పడినప్పుడు . కావున భూమి, దానికి వివిధ పరిస్థితిలు ఉన్నాయి. ఒక పరిస్థితి పొడి గడ్డి, ఒక పరిస్థితి తడి గడ్డి, ఒక పరిస్థితి కేవలం భూమి మాత్రమే. అదేవిధముగా, మూడు స్థానాలు ఉన్నాయి: సత్వ గుణము, రజో గుణము, తమో గుణము. కాబట్టి సత్వ-గుణము అంటే అగ్ని కణము పొడి గడ్డి మీద పడితే, అది గడ్డిని కాలుస్తుంది. కాబట్టి సత్వ-గుణములో, ప్రకాశా, ఈ మండుతున్న లక్షణము కనబడుతుంది. కాని నీటి మీద పడితే, తడి నేల, అది పూర్తిగా ఆరిపోతుంది. మూడు దశలు. అదేవిధముగా, మనము ఈ భౌతిక ప్రపంచమునకు వచ్చినప్పుడు, మనము సత్వ-గుణముతో సహవాసం చేస్తే, అప్పుడు ఆధ్యాత్మిక జీవితము మీద కొంత ఆశ ఉంటుoది. మనము రజో గుణమును కలిగి ఉంటే ఆశ లేదు తమో గుణము, ఏ ఆశ లేదు. Rajas-tamaḥ. Rajas-tamo-bhāva kāma-lobhādayaś ca ye. Rajas-tamaḥ. మనము రజో గుణము మరియు తమో-గుణముతో సాంగత్యము చేస్తే అప్పుడు మన కోరికలు కామము మరియు అత్యాశతో ఉంటాయి. Kāma-lobhādayaś ca. Tato rajas-tamo-bhāva kāma-lobhādayaś ca. మనం సత్వ-గుణ లక్షణమును పెoచుకుoటే, అప్పుడు ఈ kāma-lobhādaya, ఈ రెండు విషయాలు, మనను తాక లేవు. మనము కామ-లోభ నుండి కొంత దూరముగా ఉండవచ్చు. కాబట్టి సత్వ-గుణములో... ఇది శ్రీమద్-భాగవతం లో చెప్పబడింది:

śṛṇvatāṁ sva-kathāḥ kṛṣṇaḥ
puṇya-śravaṇa-kīrtanaḥ
hṛdy antaḥ-stho hy abhadrāṇi
vidhunoti suhṛtsatām
(SB 1.2.17)

కాబట్టి మనము ఈ మూడు లక్షణాలను మనం అధిగమించవలసి ఉంటుంది, sattva-guṇa, rajo-guṇa, tamo-guṇa, ముఖ్యంగా రజో గుణము, తమో గుణము. మనo అలా ప్రయత్నము చేయకుoడా ఉంటే , అప్పుడు ఆధ్యాత్మిక ముక్తి కోసం ఎలాoటి ఆశా లేదు, లేదా భౌతిక నిమగ్నత నుండి విముక్తి. కానీ కలి-యుగములో ఆచరణాత్మకంగా సత్వ-గుణము లేదు, కేవలం రజస్, రజో గుణము, తమో గుణము, ముఖ్యంగా తమో-గుణము. Jaghanya-guṇa-vṛtti-sthaḥ ( BG 14.18) Kalau śūdra-sambhavaḥ. అందువల్ల శ్రీ చైతన్య మహాప్రభు ఈ కృష్ణ చైతన్య ఉద్యమమును వ్యాప్తి చేసినారు, హరే కృష్ణ మంత్రాన్ని కీర్తిస్తూ.

ఈ ప్రదేశము నుండి శ్రీ చైతన్య మహాప్రభు ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు, కృష్ణ చైతన్య ఉద్యమం, మొత్తం భారతదేశం అంతటా, ఆయన కోరుకున్నాడు pṛthivīte āche yata nagarādi grāma: అనేక పట్టణాలు గ్రామాలు ఉన్నాయి కాబట్టి, ఈ కృష్ణ చైతన్య ఉద్యమం వ్యాప్తి చెందవలెను. "(CB Antya-khaṇḍa 4.126) కాబట్టి ఈ కృష్ణ చైతన్య ఉద్యమం మీ చేతిలో ఉంది. వాస్తవానికి, 1922 లో, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర, ఆయన ఈ విషయములో ఏదైన చేయాలని కోరుకున్నాడు. అతడు తన శిష్యులందరి నుండి ఆయన కోరుకున్నారు. ముఖ్యంగా ఆయన అనేక సార్లు వక్కాణించారు "మీరు దీన్నిచేయండి. మీరు నేర్చుకున్నది ఏమైనప్పటికీ, మీరు ఆంగ్ల భాషలో విస్తరించేందుకు ప్రయత్నిoచండి. " 1933 లో, ఆయన రాధా కుండం దగ్గర ఉన్నప్పుడు, నా వ్యాపార జీవితానికి సంబంధించి ఆ సమయంలో నేను బొంబాయిలో ఉన్నాను. నేను ఆయనని చూడటానికి వచ్చాను, బొంబాయిలో కొంత భూమి ఇవ్వాలని ఒక స్నేహితుడు కోరుకున్నాడు, బొంబాయిలో గౌడీయ మఠమును మొదలుపెట్టేoదుకు. ఆయన నా స్నేహితుడు. కాని ఆది ఒక పెద్ద కథ, కాని నేను ఈ కథని చెప్పాలనుకుంటున్నాను, భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి యొక్క లక్ష్యము. కావున ఆ సమయంలో నా గురువుగారి శిష్యుడు కూడా ఒకరు ఉన్నారు. ఆయన నా స్నేహితుడి విరాళం గురించి నాకు గుర్తుచేసినాడు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరా ప్రభుపాద వెంటనే భూమిని తీసుకున్నారు. ఆయన అనేక దేవాలయాలు స్థాపించాల్సిన అవసరం లేదు అని చెప్పినారు. మనం కొన్ని పుస్తకాలను ప్రచురించుట మేలు." అని ఆయన అలా అన్నాడు. ఆయన ఇలా అన్నాడు, "మనము ప్రారంభించాము మన ఈ గౌడీయ మఠమును Ultadangaలో. అద్దె చాలా తక్కువ మనము 2 నుండి 250 రూపాయలను సేకరించినట్లయితే, ఇది చాలా బాగుంటుంది. నడుస్తుంది కాని ఈ J.V. దత్తా మనకు ఈ రాయిని ఇచ్చినప్పడి నుంచి, పాలరాయి రాతి Ṭhākurabari, మన శిష్యుల మధ్య పోటీ పెరిగింది, కాబట్టి నేను ఇకపై ఇష్టపడటము లేదు. బదులుగా, నేను పాలరాయి రాతిని బయటకు తీసి దానిని విక్రయించి, కొన్ని పుస్తకాలను ప్రచురించాలని అనుకుంటున్నాను." నేను ఆ విషయమును తీసుకున్నాను, ఆయన కూడా నాకు ప్రత్యేకముగా సలహా ఇచ్చారు మీకు డబ్బు వచ్చినట్లయితే, మీరు పుస్తకాలను ప్రచురించడానికి ప్రయత్నించండి. కాబట్టి ఆయన దీవెనలతో మీ సహకారంతో ఇది చాలా విజయవంతమవ్వుతుంది. ఇప్పుడు మన పుస్తకాలు ప్రపంచ వ్యాప్తంగా విక్రయించబడుతున్నాయి, ఇది చాలా సంతృప్తికరమైన అమ్మకం. కాబట్టి ఈ ప్రత్యేక రోజైన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరా ఆగమనమున, తన ఉపదేశాలను గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి, ఆయన మన తత్వము గురించి అనేక పుస్తకాలు ప్రచరించాలని కోరుకున్నారు, ముఖ్యంగా ఆంగ్లము తెలిసిన ప్రజలకు ఇవ్వాలి, ఎందుకంటే ఆంగ్ల భాష ఇప్పుడు ప్రపంచ భాష. మనము ప్రపంచ వ్యాప్తంగా పర్యటిస్తున్నాము. ఎక్కడైనా మనము ఇంగ్లీష్లో మాట్లాడినా, అది వారికి అర్థం అవుతుంది, కొన్ని ప్రదేశాలలో మినహా, కాబట్టి ఈ రోజు, ప్రత్యేకించి, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరా ఆవిర్భవించిన దినమున, నేను నాతో పాటు సహకరిస్తున్న నా శిష్యులను ప్రత్యేకించి అభ్యర్ధిస్తున్నాను ఎన్ని పుస్తకాలు వీలైతే అన్ని, సాధ్యమైనంత వరకు ప్రచురించడానికి ప్రయత్నించండి మొత్తం ప్రపంచము అంతటా వితరణ చేయండి. అది శ్రీ చైతన్య మహాప్రభు మరియు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరాను సంతృప్తి పరస్తుంది.

చాలా ధన్యవాదాలు.

భక్తులు: జయ శ్రీల ప్రభుపాద