TE/Prabhupada 0552 - ఈ జననం మరణం యొక్క పునరావృతి చక్రం ఎలా ఆపాలి.నేను విషాన్ని తాగుతున్నాను



Lecture on BG 2.62-72 -- Los Angeles, December 19, 1968


ప్రభుపాద : Jāniyā śuniyā biṣa khāinu. నాకు తెలుసు, నేను విన్నాను. ఇప్పటికీ, … Jāniyā śuniyā biṣa... కేవలం ఒక దొంగ లాగా. Jāniyā śuniyā... ఈ ఉపదేశాలు చాలా ముఖ్యమైనవి. జానియా అంటే అర్థం తెలుసుకోవడము, శునియా అంటే అర్థం వినడం. కాబట్టి ఒక అలవాటు గల దొంగ, ఆయనకు తెలుసు "నేను దొంగిలిస్తే నేను జైలులో ఉంచబడతాను." మరియు శాస్త్రాల నుండి అతను విని యున్నాడు. "దొంగిలించవద్దు, అప్పుడు నీవు నరకములో ఉంచబడతావు" అందువల్ల ఆయన శాస్త్రాల నుండి విన్నాడు మరియు ఆచరణాత్మకంగా చూశాడు. ఆయన ఆచరణాత్మకంగా అనుభవించాడు, కానీ ఇప్పటికీ, ఆయన జైలు జీవితం నుంచి విముక్తి పొందిన వెంటనే, ఆయన మళ్ళీ అదే తప్పు చేస్తాడు. Jāniyā śuniyā biṣa khāinu. మనకు తెలుసు, మనము విన్నాము, శాస్త్రాల నుండి, ప్రామాణికుల నుండి, వేదముల సాహిత్యాల నుండి, అది నేను దుర్భరమైన బద్ధ శరీరమును, భౌతిక శరీరమును కలిగి ఉన్నాను, మూడు విధముల దుఃఖములను అనుభవించటానికి; ఈ జననం మరణం యొక్క పునరావృతి చక్రం ఎలా ఆపాలనేది ఇప్పటికీ, నాకు అంత ఎక్కువ అతృత లేదు. నేను విషాన్ని తాగుతున్నాను. "Jāniyā śuniyā biṣa khāinu. Hari hari biphale janama goṅāinu. ఈ పాటలు చాలా వివరణాత్మకమైనవి. కేవలం ఉద్దేశ్యపూర్వకంగా, మనము విషం తాగుతున్నాము. కొనసాగించు.

తమాల కృష్ణ: "కృష్ణ చైతన్యంలో ఎవరైతే లేరో, అతను ఎంతటి శక్తిమంతుడైనప్పటికీ, ఇంద్రియాలను నియంత్రించడంలో కృత్రిమంగా అణచివేయడం ద్వారా, చివరికి ఖచ్చితంగా పతనమవ్వును, ఇంద్రియ ఆనందం యొక్క స్వల్పమైన ఆలోచన ఆయన కోరికలను సంతోషపరుచుకునేందుకు తరుముతుంది 63: కోపం నుండి, మోహము కలుగును, మోహము వలన స్మృతి భ్రాంతికి గురియగును స్మృతి భ్రాంతిచే బుద్ధి నశించును, బుద్ధి నశించినప్పుడు మానవుడు తిరిగి సంసార సాగరమున పడిపోవును

"ప్రభుపాద: మన పరిస్థితి, మనము ఈ శరీరముతో నిర్మించబడ్డాము. శరీరం అంటే అర్థం ఇంద్రియాలు మరియు ఇంద్రియాల యొక్క నియంత్రికుడు లేదా, ఏమని పిలుస్తారు, డ్రైవర్, ఇంద్రియాల యొక్క చోదకుడు, మనస్సు. మనస్సు ఆలోచించడము, అనుభూతి చెందటము మరియు, ఇష్టపడటం ద్వారా నిర్వహించబడుతుంది. మనస్తత్వ శాస్త్రం , మనస్తత్వ శాస్త్రం, ఇది బుద్ధితో నిర్వహించబడుతోంది. బుద్ధి పైన, నేను కూర్చొని ఉన్నాను. నేను ఆత్మ. కాబట్టి ఎలా మనం ఈ మాయ యొక్క బాధితులమైనాము, అది ఇక్కడ వర్ణించబడింది, కోపం వలన, అధికమోహం కలుగను మరియు మోహం వలన, జ్ఞాపకశక్తి భ్రమకు గురియగును. మోహపరవశత్వమైన బుద్ధిచే నేను ఈ శరీరం కాదనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయాను, నేను ఆత్మ, అహం బ్రహ్మాస్మి; నేను దేవాది దేవుని , మహోన్నతమైన బ్రహ్మణ్ యొక్క భాగం మరియు అంశం, ఆత్మ, అది నేను మర్చిపోయాను. జ్ఞాపకశక్తి మోహానికి గురైనప్పుడు, మరియు నేను ఆత్మ అని మరచిపోయిన వెంటనే, నన్ను నేను భ్రమతో ఈ భౌతిక ప్రపంచంతో గుర్తించాను. బుద్ధిని కోల్పోయాను. మనస్సు యొక్క కార్యక్రమాలను నిర్వహించడానికి నేను నా బుద్ధి ఉపయోగించవలసినది - ఆలోచించడము, అనుభూతి చెందటము మరియు, ఇష్టపడటం - ఎందుకంటే నా మనస్సు నియంత్రించబడలేదు, నా ఇంద్రియాలు నియంత్రించబడలేదు, అందువలన నేను పతనమయ్యాను ఇది మొత్తం శరీర నిర్మాణ విశ్లేషణ. కొనసాగించు.

తమాల కృష్ణ: 64: నియమ నిబంధనల ద్వారా తన ఇంద్రియాలను నియంత్రించే వ్యక్తి, మరియు రాగద్వేషముల నుండి ముక్తి పొందిన వారు భగవంతుని దయను పొందగలరు.

ప్రభుపాద: అవును. మనము పతనము అయ్యాము. ఎలా మనము పతనము అయ్యాము? ఇంద్రియానందం యొక్క స్థితికి పడిపోయాము. అందువల్ల మీరు ఇంద్రియాల స్థాయి నుండి పవిత్రము అవ్వటము మొదలు పెట్టాలి, ఇంద్రియాలను నియంత్రించాలి. ఇది ఆత్మ సాక్షాత్కారం యొక్క మార్గం. మీరు యోగ సాధన చేసినా లేదా భక్తి, భక్తియుక్త సేవ సాధన చేసినా, ఇంద్రియాలను నియంత్రించడము ప్రారంభము"