TE/Prabhupada 0553 - మీరు హిమాలయాలకు వెళ్లవలసిన అవసరం లేదు.మీరు లాస్ ఏంజిల్స్ నగరంలోనే ఉండండి



Lecture on BG 2.62-72 -- Los Angeles, December 19, 1968


ప్రభుపాద: కావున యోగులు ఇతర పద్దతుల ద్వారా, వారు బలవంతముగా ఇంద్రియాలను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు. నేను హిమాలయాలకు వెళ్తాను. నేను ఏ అందమైన మహిళను ఇక చూడను. నేను నా కన్నులను మూసుకుంటాను. "ఇవి బలవంతముగా చేయడము. మీరు మీ ఇంద్రియాలను నియంత్రించలేరు. అనేక సందర్భాలు ఉన్నాయి. మీరు హిమాలయాలకు వెళ్లవలసిన అవసరం లేదు. మీరు లాస్ ఏంజిల్స్ నగరంలోనే ఉండండి మీ కన్నులను కృష్ణుడిని చూడటానికి నిమగ్నము చేయండి, నీవు హిమాలయాలకు వెళ్ళిన వ్యక్తి కన్నా ఎక్కువ. మీరు అన్నిటినీ మరచిపోతారు. ఇది మన పద్ధతి. మీ స్థానమును మీరు మార్చుకోవలసిన అవసరం లేదు. భగవద్గీత వినేందుకు మీ చెవులను నిమగ్నం చేయండి, మీరు చెత్త అంతటనూ మర్చిపోతారు. అర్చామూర్తి, కృష్ణుడి యొక్క అందమును చూడడానికి మీ కళ్ళను నిమగ్నము చేస్తే. మీరు కృష్ణ ప్రసాదమును రుచి చూడడానికి మీ నాలుకను నిమగ్నం చేస్తే. మీరు మీ మీ కాళ్లను ఆలయానికి రావడానికి నిమగ్నము చేస్తే. మీరు మీ చేతులను కృష్ణుడి సేవ కోసం నిమగ్నము చేస్తే. మీరు కృష్ణుడికి అర్పించిన పువ్వులను వాసన చూడడానికి మీ ముక్కును నిమగ్నము చేస్తే. అప్పుడు మీ ఇంద్రియాలు వెళ్తాయా? ఆయన అన్ని వైపులా బంధించబడతాడు. పరిపూర్ణము తప్పకుండా ఉంటుంది. మీరు బలవంతంగా మీ ఇంద్రియాలను నియంత్రించాల్సిన అవసరం లేదు, చూడవద్దు, చేయవద్దు, చేయవద్దు. కాదు మీరు మీ నిమగ్నతను మార్చుకోవాలి, స్థాయిని మార్చాలి. అది మీకు సహాయం చేస్తుంది. కొనసాగించు.

తమాల కృష్ణ: భాష్యము. "కొన్ని కృత్రిమ పద్ధతుల ద్వారా బాహ్యముగా ఇంద్రియాలను నియంత్రించవచ్చు, కానీ భగవంతుని యొక్క భక్తి యుక్త సేవలో ఇంద్రియాలు నిమగ్నము చేయకపోతే, పతనము అవ్వడానికి అవకాశం ఉంది. కృష్ణ చైతన్యము కలిగిన వ్యక్తి ఇంద్రియల భావనలో బహుశా ఉన్నప్పటికీ, వాస్తవానికి, ఆయన కృష్ణ చైతన్యములో ఉన్నాడు కనుక, ఆయనకు ఇంద్రియాలకు సంబంధించిన కార్యక్రమాల పట్ల ఎటువంటి ఆసక్తి లేదా నిరాశక్తి లేదు. కృష్ణ చైతన్యము కలిగిన వ్యక్తి కేవలము కృష్ణుడి సంతృప్తి గురించే ఆలోచిస్తాడు, వేరే దేని గురించి లేదు. అందువల్ల అతడు ఆసక్తి లేదా నిరాశక్తి కి అతీతముగా ఉంటాడు. కృష్ణుడు కోరుకుంటే, భక్తుడు సాధారణంగా కోరుకోనిది ఏదైనా చేస్తాడు, కృష్ణుడికి ఇష్టము లేకపోతే, తన సొంత సంతృప్తి కోసం ఆయన సాధారణంగా చేసేది కూడా చేయడు. అందువలన వ్యవహరించాలా వద్దా అనేది ఆయన నియంత్రణలోనే ఉంటుంది ఎందుకంటే ఆయన కృష్ణుని యొక్క నిర్దేశము క్రింద మాత్రమే పని చేస్తాడు. ఈ చైతన్యము భగవంతుని యొక్క కారణములేని దయ దానిని భక్తుడు ఇంద్రియాల స్థాయిలో ఉంటున్నప్పటికీ భక్తుడు సాధించగలడు. " 65: "అలా ఉన్నవాని కోసం, భౌతిక జీవనం యొక్క త్రివిధ క్లేశములు ఇక ఉండవు. అటువంటి సంతోషకరమైన స్థితిలో ఒకరి తెలివితేటలు స్థిరంగా ఉంటాయి. " 66: "ఆధ్యాత్మిక చైతన్యములో లేని వ్యక్తికి నియంత్రించబడిన మనస్సు లేదా స్థిరమైన బుద్ధి ఉండదు, ఇది లేకుండా శాంతముగా ఉండే అవకాశం లేదు, శాంతముగా లేకుండా ఆనందముగా ఉండే అవకాశము ఎక్కడ ఉంటుంది? "67...

ప్రభుపాద: ఈ భౌతిక ప్రపంచంలో అందరూ, వారు శాంతి కొరకు ప్రయత్నిస్తున్నారు, కానీ వారు ఇంద్రియాలను నియంత్రించుకోవాలని అనుకోవడము లేదు. ఇది సాధ్యం కాదు. ఉదాహరణకు మీరు వ్యాధిని కలిగి ఉంటే. డాక్టర్ చెప్తే మీరు ఈ ఔషధాన్ని తీసుకోండి , మీరు ఈ ఆహారం తీసుకోండి , కానీ మీరు నియంత్రించుకోలేరు . వైద్యుని యొక్క ఆదేశాలకు వ్యతిరేకంగా మీకు నచ్చినది ఏదో మీరు తీసుకుంటున్నారు. అప్పుడు మీరు ఎలా నయమవుతారు? అదేవిధముగా, ఈ భౌతిక ప్రపంచం యొక్క అస్తవ్యస్తమైన పరిస్థితిని మనము నయము చేయాలనుకుంటున్నాము, మనము శాంతి మరియు శ్రేయస్సు కావలని అనుకుంటున్నాము, కానీ మనము ఇంద్రియాలను నియంత్రించడానికి సిద్ధంగా లేము. మనకు ఇంద్రియాలను ఎలా నియంత్రించాలో మనకు తెలియదు. మనకు ఇంద్రియాలను నియంత్రించే వాస్తవ యోగ సూత్రం తెలియదు. కాబట్టి శాంతిని పొందే అవకాశం లేదు. Kutaḥ śāntir ayuktasya. ఖచ్చితమైన పదం భగవద్గీతలో ఉంది. మీరు కృష్ణ చైతన్యములో నిమగ్నమై ఉండకపోతే, శాంతికి అవకాశం లేదు. కృత్రిమంగా, మీరు దాని కోసం ప్రయత్నించవచ్చు. ఇది సాధ్యం కాదు.