TE/Prabhupada 0562 - నా ప్రామాణికం వేదముల సాహిత్యం



Press Interview -- December 30, 1968, Los Angeles


ప్రభుపాద: నా ప్రామాణికం వేదముల సాహిత్యం, అవును. మీరు భగవద్గీతలో కనుగొంటారు... మీరు మన పుస్తకాన్ని భగవద్గీతను చూసారా?

విలేఖరి: అవును. మేము ఆఫీసులో కలిగి ఉన్నాము. నేను దానిని చూశాను.

ప్రభుపాద: ఈ వర్ణనలు ఉన్నాయి. ఈ విషయాలు వివరణలు ఉన్నాయి. ఆధ్యాత్మిక ప్రకృతి అంటారు మరొక ప్రకృతి యొక్క వివరణ ఉంది. ఇది భౌతికమైన ప్రకృతి. ఆకాశం, మీరు చూడగలిగినంత వరకు, ఇది ఒక విశ్వం. అదేవిధముగా, లక్షలాది విశ్వములు ఉన్నాయి. ఇవి అన్ని కలిపి, అది భౌతిక ఆకాశం. వీటిని దాటిన తారువాత, ఆధ్యాత్మిక ఆకాశం ఉంది, అది దీనికంటే చాలా చాలా గొప్పది ఎక్కువ. ఆధ్యాత్మిక లోకములు ఉన్నాయి. కాబట్టి ఈ సమాచారం మనకు భగవద్గీతలో ఉంది, ఇతర వేదముల సాహిత్యాల గురించి ఏమి మాట్లాడాలి? భగవద్గీత, ప్రపంచవ్యాప్తంగా ఆచరణాత్మకంగా రోజువారీ చదవబడుతుంది, కానీ వారికి అర్థం కాదు. కేవలం వారు భగవద్గీత విద్యార్థి అవుతారు లేదా కేవలం "నేను భగవంతుణ్ణి" అని తప్పుగా ఆలోచించడము కోసము. అంతే. కానీ వారు ఏ రకమైన నిర్దిష్ట సమాచారం తీసుకోరు. ఎనిమిదవ అధ్యాయంలో ఒక శ్లోకము ఉంది, paras tasmāt tu bhāvo 'nyo 'vyakto 'vyaktāt sanātanaḥ ( BG 8.20) శాశ్వతమైనది మరొక ప్రకృతి ఉంది, అది ఈ భౌతిక ప్రకృతి దాటిన తరువాత ఉంది . ఈ ప్రకృతి ఉనికిలోకి వస్తుంది, మళ్ళీ నాశనము అవుతుంది. కానీ ఆ ప్రకృతి శాశ్వతమైనది. ఈ విషయాలు ఉన్నాయి. అదేవిధముగా, అక్కడ, లోకములు కూడా శాశ్వతమైనవి. అక్కడ, జీవులు, వారు కూడా శాశ్వతమైనవారు. దీనిని సనాతన అని పిలుస్తారు. సనాతన అనగా శాశ్వతమైనది, ఏ ముగింపు లేకుండా, ఏ ప్రారంభము లేకుండా. కానీ ఈ ప్రకృతి, మనము ఉన్నది, ఈ శరీరమునకు ఒక ప్రారంభం ఉంది ఒక ముగింపు ఉంది, అదేవిధముగా ఏదైనా, ఈ విశ్వమునకు దానికి ప్రారంభం ఉంది. దానికి ముగింపు ఉంది. కావున మన ఈ కృష్ణ చైతన్య ఉద్యమము మన ఆత్మను, ఆ శాశ్వతమైన ప్రకృతికి ఎలా బదిలీ చేయాలి.

విలేఖరి: అది మనిషి యొక్క అన్వేషణ.

ప్రభుపాద: అవును. అది అన్వేషణ. ప్రతి జీవి ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే అది అన్ని జీవుల యొక్క ప్రత్యేక హక్కు . ఆయన స్వభావ పరముగా సంతోషంగా ఉండటానికి ఉన్నాడు, అయితే ఎలా సంతోషంగా మారాలో ఆయనకు తెలియదు. ఆయన నాలుగు విషయాలలో ఇక్కడ సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు, బాధాకరమైన పరిస్థితులు ఉన్నాయి, అవి జన్మించడము, మరణం, వ్యాధి, వృద్ధాప్యం. చాలామంది శాస్త్రవేత్తలు, సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు,ప్రజలను సంతోషంగా ఉంచటానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఏ శాస్త్రవేత్త మరణాన్ని ఆపడానికి, వృధాప్యాన్ని ఆపడానికి, వ్యాధిని ఆపడానికి ప్రయత్నించినాడు?ఏ శాస్త్రవేత్తైనా ప్రయత్నించారా?

విలేఖరి: నాకు తెలియదు. ప్రభుపాద: అప్పుడు ఇది ఏమిటి? వారు ఎందుకు పరిగణనలోకి తీసుకోరు? "మనము చాలా మెరుగుపరుస్తున్నాం, ఈ నాలుగు విషయాల గురించి మనము సాధించిన మెరుగుదల ఏమిటి? " వారి దగ్గర లేదు. ఇంకా వారు చాలా గర్వంగా ఉన్నారు, విద్య, విజ్ఞానశాస్త్రంలో పురోగమించారు. కానీ నాలుగు ప్రాధమిక దుర్భర పరిస్థితులు, అవి యధాతథముగానే ఉన్నాయి. మీరు చూడండి? వైద్య శాస్త్రంలో పురోగతి ఉండవచ్చు, కానీ ఏ ఔషధం చెప్పలేదు "ఇంక ఏ వ్యాధిరాదు , రండి తీసుకోండి." ఏదైనా ఔషధం ఉందా? కావున పురోగతి ఏమిటి? అయితే, వ్యాధులు వివిధ రూపాల్లో పెరుగుతున్నాయి. వారు అణు ఆయుధాన్ని కనుగొన్నారు. అది ఏమిటి? చంపడానికి. మీరు ఏమైనా కనుగొన్నారా, మరి ఇంక ఏ మనిషి చనిపోకుండా ఉండటానికి? ఇది కీర్తి. మనిషి ప్రతి క్షణం మరణిస్తున్నాడు, కాబట్టి మీరు ఆ మరణమును వేగవంతం చేయడానికి ఏదో కనుగొన్నారు. అంతే. అది చాలా చాలా మంచి కీర్తి అవునా? మరణమునకు పరిష్కారం లేదు, ఏదీ లేదు... వారు ఆపడానికి ప్రయత్నిస్తున్నారు, నేను చెప్పే దానికి అర్థం ఏమిటంటే, అధిక జనాభా. కానీ పరిష్కారం ఎక్కడ ఉంది? ప్రతి నిమిషం, ముగ్గురు వ్యక్తులు పెరుగుతున్నారు. అది గణాంకాలు. జన్మకు పరిష్కారం లేదు, మరణానికి పరిష్కారం లేదు, వ్యాధికి పరిష్కారం లేదు వృద్ధాప్యానికి పరిష్కారం లేదు. ఒక గొప్ప శాస్త్రవేత్త, ప్రొఫెసర్ ఐన్స్టీన్, ఆయన కూడా వృద్ధాప్యంలో మరణించాడు. వృద్ధాప్యాన్ని ఆయన ఎందుకు ఆపలేదు? అందరూ యవ్వనంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. ఆ పద్ధతి ఎక్కడ ఉంది? అందువల్ల వారు దీనిని ఎలా పరిష్కరించాలి అని పట్టించుకోరు ఎందుకంటే ఇది వారికి అతీతమైనది. వారు ఏదో మోసము చేసేది ఇస్తున్నారు, అంతే. వాస్తవమైన సమస్య ఏమిటి అది ఎలా పరిష్కరించాలో వారు పట్టించుకోరు. వారు దానిని పట్టించుకోరు. కానీ ఇక్కడ ఒక ఉద్యమం, కృష్ణ చైతన్యము. ప్రజలందరు తీవ్రంగా తీసుకుంటే అన్ని సమస్యలకు వాస్తవమైన పరిష్కారం ఉంది. అవును. మొత్తం విషయము భగవద్గీతలో వివరించబడింది. వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించనివ్వండి. కనీసం, ఒక ప్రయోగం చేయండి. ఎందుకు వారు చాలా మొండిగా వారి స్వంత విధానములో వెళుతున్నారు?