TE/Prabhupada 0567 - నేను ప్రపంచానికి ఈ సంస్కృతిని ఇవ్వాలనుకున్నాను



Press Interview -- December 30, 1968, Los Angeles


విలేఖరి: మీరు ఎంత కాలం నుండి ఇక్కడ ఉన్నారు, సర్? ప్రభుపాద: నేను సెప్టెంబర్ 1965 లో వచ్చాను, నేను మే 1967 లో కొద్దిగా అస్వస్థతకు గురయ్యాను, నేను అనుకుంటున్నాను. అప్పుడు నేను భారతదేశానికి తిరిగి వెళ్లాను. నేను మళ్లీ గత ఏడాది డిసెంబర్ 1967లో తిరిగి వచ్చాను,

విలేఖరి: అవును, అవునా. మీరు ఇక్కడకు ఎందుకు వచ్చారు?

ప్రభుపాద: నేను ప్రపంచానికి ఈ సంస్కృతిని ఇవ్వాలనుకున్నాను, నా అభిప్రాయం అమెరికా అధునాతన దేశంగా ఉంది. వారు దానిని ఆమోదించినట్లయితే, మొత్తం ప్రపంచం అంతటా ఇది ప్రచారం చేయడం సాధ్యమవుతుంది. అది నా ఆలోచన. కానీ నేను ఇప్పుడు ఆశాజనకంగా ఉన్నాను, ఎందుకంటే ఈ విద్యావంతులైన యువ అమెరికన్లు, వారు ఈ ఉద్యమంలో తీవ్ర ఆసక్తి చూపిస్తున్నారు. మేము పత్రాలు, పుస్తకాలు ప్రచురిస్తున్నాము, వారు చాలా చక్కగా వ్రాస్తున్నారు. నేను వృద్ధుడను, నేను చనిపోవచ్చు, కానీ నేను ఆలోచనను అమర్చాను. ఇది కొనసాగుతుంది. ఇది కొనసాగుతుంది, వారు అంగీకరింపబడతారు. ఆ ప్రయోగం జరిగింది. ఇది బాగా వ్యాప్తి చెందితే, అది ఏ విఫలం లేకుండా అంగీకరించబడుతుంది. ఈ అబ్బాయిలు ఎవరైతే నా వద్దకు వచ్చారో, వారు తీవ్రంగా తీసుకున్నారు. నేను ఆశాజనకంగా ఉన్నాను.

విలేఖరి: నేను మీ పత్రిక చూశాను. ఇది ఒక అందమైన పత్రిక.

ప్రభుపాద: Back to God head?

విలేఖరి: ఓ అవును. అందమైన పత్రిక.

ప్రభుపాద: చాలా కృతజ్ఞతలు. ధన్యవాదములు.

విలేఖరి: అందమైన వస్తువు. అది ఎక్కడ చేశారు?

ప్రభుపాద: ఇది న్యూయార్క్ లో ప్రచురించబడినది.

విలేఖరి: న్యూయార్క్ లో. నేను తాజా ప్రచురణ చూశాను.... అందమైన పత్రిక. ఆహ్, ఉద్యమంలో ఎంతమంది ఉన్నారు?

ప్రభుపాద: నా నియామక సూత్రాలు ఖచ్చితంగా అనుసరిస్తున్న వారు వంద కంటే కొద్దిగా ఎక్కువ మంది నా వద్ద ఉన్నారు.

విలేఖరి: ఒక వంద.

ప్రభుపాద: అవును. వివిధ శాఖలలో. నాకు సుమారు పదమూడు శాఖలు ఉన్నాయి. కొందరు శిష్యులు లండన్లో పనిచేస్తున్నారు.

విలేఖరి: లండన్లో?

ప్రభుపాద: అవును, వారు ఎంతో బాగా పని చేస్తున్నారు. వారు అందరు వివాహిత జంటలు. నేను వారికి వివాహము చేసాను. అవును... నేను వారికి వివాహము చేసాను. వారు యువకులు, ముప్పై లోపు వారు. నా పూరణ శిష్యుడు 28. లేకపోతే 25, 24. అత్యధికంగా 30. అదే విధముగా, అమ్మాయిలు, మీరు ఈ అమ్మాయిని చూసారా. మీరు చూడండి. కాబట్టి నేను, వారిని వివాహ జీవితంలో సంతోషంగా ఉంచుతాను. వారి మనస్తత్వం... వారికి పేరొందిన జీవితం కోసం తాపత్రయం లేదు. వారు కనీస శారీరక అవసరాలతో కూడా సులువుగా జీవించగలరు. కానీ కృష్ణ చైతన్యంలో గొప్పగా ఆలోచిస్తారు. నేను ఆశాజనకంగా ఉన్నాను. నేను చనిపోయినా కూడా.... ఎందుకంటే నేను వృద్ధుడను, 73 సంవత్సరాల వయసున్న నేను ఏ నిమిషంలో అయినా చనిపోవచ్చు. కానీ నా ఉద్యమం కొనసాగుతుందని నాకు హామీ ఉంది. ఈ బాలురు తీసుకువెళతారు. అది నా లక్ష్యం, ఆ విధముగా విజయవంతము అవుతుంది. నేను ఈ ఆలోచనతో ఇక్కడకు వచ్చాను, ఈ కృష్ణచైతన్య ఉద్యమం అమెరికా నుండి ప్రారంభించబడింది. ఎందుకంటే అమెరికా ఏదైనా అంగీకరిస్తే, ప్రజలు అనుసరిస్తారు ఎందుకంటే అమెరికాను భావిస్తారు..... వాస్తవమునకు అమెరికా పేదరికం వున్న దేశం కాదు. కాబట్టి వారు చాలా సులభంగా అర్థం చేసుకోగలరు, వారు దానిని తీసుకోగలరు. ఇంకా అనేక గందరగోళము అయిన యువకులు ఉన్నారు