TE/Prabhupada 0593 - మీరు కృష్ణ చైతన్యమునకు వచ్చిన వెంటనే, మీరు ఆనందముగా ఉంటారు



Lecture on BG 2.20 -- Hyderabad, November 25, 1972


ప్రభుపాద: మనము అందరము కృష్ణునిలో భాగం, mamaivāṁśo jīva-bhūtaḥ ( BG 15.7) కాబట్టి మన సంబంధం శాశ్వతమైనది. ఇప్పుడు మనము మర్చిపోయాము. మనము "నేను కృష్ణుడికి చెందిన వానిని కాదు, నేను అమెరికాకు చెందిన వాడిని."నేను భారతదేశమునకు చెందిన వాడిని" ఇది మన భ్రాంతి. కావున సరైన పద్ధతి ద్వారా... పద్ధతి శ్రవణము చేయడము. తన చెవి ద్వారా కీర్తన చేయడము: "మీరు అమెరికన్ కాదు, మీరు కృష్ణుడికి చెందిన వారు, మీరు అమెరికన్ కాదు." మీరు భారతీయులు కాదు. మీరు కృష్ణుడికి చెందిన వారు. ఈ విధముగా , శ్రవణము, శ్రవణము చేయగా , ఆయన: "ఓ, అవును, నేను కృష్ణుడికి చెందిన వాడిని." ఇది పద్ద్ధతి. మనము నిరంతరం భోదించ వలసి ఉంటుంది: "మీరు అమెరికన్ కాదు, మీరు భారతీయులు కాదు, మీరు రష్యన్ కాదు, మీరు కృష్ణుడికి చెందిన వారు, మీరు కృష్ణుడికి చెందిన వారు." అప్పుడు ప్రతి మంత్రమునకు విలువ ఉంది; అప్పుడు ఆయన వస్తారు, "ఓ, అవును, నేను కృష్ణునికి సంబంధించిన వానిని." బ్రహ్మ-భుతః ప్రసా... "నేను ఎందుకు ఆలోచిస్తున్నాను నేను రష్యన్ లేదా అమెరికన్ మరియు ఇది లేదా అది అని?" Brahma-bhūtaḥ prasannātmā na śocati na kāṅkṣati ( BG 18.54) ఆయన ఆ స్థితికి వచ్చిన వెంటనే, ఆయనకు ఇంకా ఆందోళన ఉండదు. ఇక్కడ, అమెరికన్ లేదా భారతీయుడు లేదా రష్యన్ వలె, మనకు రెండు విషయాలు ఉన్నాయి: ఆందోళన మరియు కోరిక ప్రతి ఒక్కరూ ఆయనకు ఏమి లేదో అనే దానిపై కోరిక కలిగి ఉన్నారు "నాకు ఇది తప్పకుండా ఉండాలి." ఆయన ఏదైతే కలిగి ఉన్నాడో, అది పోయినట్లయితే, ఆయన బాధ పడుతున్నాడు: "ఓ, నేను కోల్పోయాను." కాబట్టి ఈ రెండు పనులు జరుగుతున్నాయి. మీరు ఎంత వరకు అయితే, కృష్ణ చైతన్యమునకు రారో మీ, ఈ రెండిటిని కలిగి ఉంటారు, ఆందోళన మరియు కోరిక మీరు కృష్ణ చైతన్యమునకు వచ్చిన వెంటనే, మీరు ఆనందముగా ఉంటారు. బాధ పడడానికి ఏ కారణం లేదు. కోరికకు కారణం లేదు. అంతా పరిపూర్ణముగా ఉంది. కృష్ణుడు పరిపూర్ణుడు. అందువలన ఆయన స్వేచ్చగా ఉన్నాడు. ఇది బ్రహ్మ-భూతా స్థితి. కాబట్టి ఇది శ్రవణము వలన జాగృతం అవుతుంది. అందువలన వేదముల మంత్రమును śruti అని పిలుస్తారు. ఒకరు తన చెవి ద్వారా ఈ మేల్కొలుపు పొందాలి. Śravaṇaṁ kīrtanaṁ viṣṇoḥ ( SB 7.5.23) విష్ణువు గురించి ఎల్లప్పుడూ శ్రవణము మరియు కీర్తన చేయండి హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే / హరే రామ, హరే రామ, రామ రామ , హరే హరే. తరువాత ceto-darpaṇa-mārjanam ( CC Antya 20.12) ప్రతిదీ పవిత్రము అవుతుంది ఆయన "నేను కృష్ణుడి యొక్క శాశ్వత సేవకుడు అని అర్ధము చేసుకునే స్థాయికి వస్తాడు." (విరామం)

ప్రభుపాద: మీరు వైష్ణవుడు అయితే, బ్రాహ్మణ తత్వం ఇప్పటికే అందులో చేర్చబడి ఉంది. సాధారణ పద్ధతి ఏమిటంటే, సత్వా-గుణము స్థితికి ఎవరైనా రాకపోతే ఆయనకు కృష్ణ చైతన్యము అంటే ఏమిటో అర్థం కాదు. ఇది సాధారణ నియమం. కానీ ఈ కృష్ణ, భక్తియుక్త సేవ, కృష్ణ చైతన్య ఉద్యమం, చాలా బాగుంది కేవలం కృష్ణుడి గురించి శ్రవణము చేస్తున్నప్పుడు, వెంటనే మీరు బ్రాహ్మణ స్థితికి వస్తారు. Naṣṭa-prāyeṣu abhadreṣu nityaṁ bhāgavata-sevayā ( SB 1.2.18) Abhadra. అభద్ర అంటే ఈ మూడు భౌతిక ప్రకృతి లక్షణాలు అని అర్థం.బ్రాహ్మణ లక్షణాలు కూడా శుద్రుని లక్షణము,వైశ్యుని లక్షణము లేదా క్షత్రియుని లక్షణము లేదా బ్రాహ్మణుల లక్షణము కూడా. అవి అన్ని అభద్రాలు ఎందుకంటే బ్రాహ్మణ లక్షణములో, అదే గుర్తింపు వస్తుంది.ఓ, నేను బ్రాహ్మణుడిని. పుట్టుకతో ఎవరూ బ్రాహ్మణులు కాలేరు. నేను గొప్ప వాడిని. నేను బ్రాహ్మణుడను. " ఈ అహంకారము వస్తుంది. అందువలన ఆయన చిక్కుకుంటాడు. బ్రాహ్మణ లక్షణాలలో ఉన్నా కూడా. కానీ ఆయన ఆధ్యాత్మిక స్థితికు వచ్చినప్పుడు, వాస్తవానికి, చైతన్య మహాప్రభు చెప్తారు, నేను బ్రాహ్మణుడు కాదు, నేను సన్యాసిని కాదు, నేను గృహస్థుడను కాదు, నేను బ్రహ్మచారిని కాదు, కాదు, కాదు, కాదు... ఈ ఎనిమిది సూత్రాలు,వర్ణాశ్రమను, ఆయన తిరస్కరించాడు. అప్పుడు నీవు ఏమిటి? Gopī-bhartuḥ pada-kamalayor dāsa-dāsānudāsaḥ ( CC Madhya 13.80) నేను కృష్ణుని సేవకుని సేవకుని సేవకుడిని. ఇది ఆత్మ సాక్షాత్కారము