TE/Prabhupada 0594 - ఆత్మను మన భౌతిక సాధనాల ద్వారా కొలవలేము
Lecture on BG 2.23 -- Hyderabad, November 27, 1972
నిర్వచనం ద్వారా నిరాకరణ. ప్రత్యక్షంగా మనం ఈ ఆధ్యాత్మిక కణమును, ఈ శరీరంలో ఉన్నది ఏమిటో అభినందించలేము. ఎందుకంటే ఆ ఆత్మ యొక్క పొడవు మరియు వెడల్పును మన భౌతిక సాధనాల ద్వారా కొలవలేము, శాస్త్రవేత్తలు దీనిని కొలవ గలమని చెప్తారు. ఏమైనా, అది సాధ్యమయినా, మొదటగా, మీరు ఆత్మ ఎక్కడ ఉన్నదో చూడవలసి ఉంది. అప్పుడు మీరు దాన్ని కొలిచేందుకు ప్రయత్నించవచ్చు. మొదటగా, మీరు చూడలేరు కూడా. ఎందుకంటే ఇది చాలా చాలా చిన్నది, జుట్టు యొక్క కొనలోని పదివేల భాగములో భాగం. ఇప్పుడు, మనము చూడలేము ఎందుకంటే, మన ప్రయోగాత్మక జ్ఞానంతో మనము అభినందించలేము; అందువలన కృష్ణుడు ఆత్మ యొక్క ఉనికి వివరించడము వలన, ఆత్మను ప్రతికూల మార్గము ద్వారా : "అది ఇది కాదు." కొన్నిసార్లు మనము అర్థం చేసుకోలేనప్పుడు, వివరణ ఇవ్వబడుతుంది: "ఇది కాదు." నేను అది ఏమిటో వ్యక్తం చేయలేకపోతే, అప్పుడు మనము ప్రతికూల మార్గంలో వ్యక్తం చేయవచ్చు, "అది ఇది కాదు." కావున అది ఏమిటి " ఇది కాదు"? "ఇది కాదు" అని "ఇది భౌతిక విషయము కాదు." ఆత్మ భౌతికము కాదు. కానీ మనము భౌతిక వస్తువుల అనుభవాన్ని పొందాము. అది ప్రతికూలమని అర్థం చేసుకోవడం ఎలా? అది తరువాతి శ్లోకములో వివరించబడింది, అది nainaṁ chindanti śastrāṇi. ఏ ఆయుధం, కత్తి లేదా పిస్టల్ ద్వారా మీరు ఆత్మను కత్తిరించలేరు. ఇది సాధ్యం కాదు. Nainaṁ chindanti śastrāṇi. మాయావాద తత్వము చెప్తుంది, "నేను బ్రహ్మణ్ ని ". నా భ్రాంతి కారణంగా, నేను వేరు అయ్యానని భావిస్తున్నాను. లేకపోతే నేను ఒకటి. " కానీ కృష్ణుడు mamaivāṁśo jīva-bhūtaḥ ( BG 15.7) అని చెప్తాడు. కాబట్టి అది సంపూర్ణ ఆత్మ నుండి, ఈ భాగాన్ని ముక్కలుగా కత్తిరించడం ద్వారా వేరు చేయబడింది అని అర్థమా? కాదు Nainaṁ chindanti śastrāṇi. దానిని ముక్కలుగా కత్తిరించలేరు. అప్పుడు? అప్పుడు ఆత్మ కణము శాశ్వతమైనది. కాదు మాయ ద్వారా అది వేరు చేయబడింది. కాదు ఇది ఎలా అవుతుంది? ఎందుకంటే దానిని ముక్కలుగా కత్తిరించలేము.
నేను చెప్పేది ... ఉదాహరణకు వారు వాదనలు చేసినట్లుగానే: ghaṭākāśa-poṭākāśa, ఆ "కుండ లోపల ఉన్న ఆకాశము మరియు కుండ వెలుపల ఉన్న ఆకాశము కుండ యొక్క గోడ వలన, కుండ లోపల ఉన్న ఆకాశము వేరు చేయబడింది. " కానీ ఎలా వేరు చేయబడుతుంది? ఇది ముక్కలుగా కత్తిరించబడదు. వాదన కొరకు... వాస్తవమునకు, మనము చాలా, చాలా చిన్న కణము, ఆత్మ యొక్క పరమాణు భాగాలు....కావున వారు శాశ్వత భాగం. ఆ సందర్భానుసారంగా ఇది భాగం అయిపోయింది, మరలా ఒకటిగా చేరవచ్చు అని కాదు. ఇది ఒకటిగా చేరవచ్చు, కానీ ఒక సజాతీయ విధముగా కాదు, మిశ్రమ మార్గం ద్వారా. కాదు దానిని ఒకటి చేసినా, అది, ఆత్మ తన ప్రత్యేక ఉనికిని ఉంచుకుంటుంది. ఉదాహరణకు ఆకుపచ్చ పక్షిలా, అది చెట్టులోకి ప్రవేశించినప్పుడు, పక్షి ఇప్పుడు చెట్టులో విలీనం అయిందని కనిపిస్తుంది, కానీ అది కాదు. పక్షి చెట్టు లోపల దాని గుర్తింపును ఉంచుకుంటుంది. అది సారంశము. చెట్టు మరియు పక్షి రెండు ఆకుపచ్చగా ఉన్నప్పటికీ, పక్షి ఇప్పుడు చెట్టులో విలీనం అయినట్లుగా కనిపిస్తుంది, ఈ విలీనం అంటే అర్థం ఇది కాదు, పక్షి మరియు చెట్టు ఒకటిగా మారినట్లు. కాదు ఇది అలా కనిపిస్తుంది. ఎందుకంటే అవి రెండూ ఒకే రంగు కలిగి ఉండటము వలన, అది అనిపిస్తుంది పక్షి ..., పక్షి యొక్క ఉనికి ఇక లేదు అని. కానీ ఇది సత్యము కాదు. పక్షి... అదేవిధముగా, మనము వ్యక్తిగత ఆత్మలము. లక్షణము ఒకటే, చెప్పడానికి, ఆకుపచ్చ, బ్రహ్మణ్ తేజస్సులో ఒకరు విలీనం అయినప్పుడు, జీవి తన గుర్తింపును కోల్పోదు. ఆయన గుర్తింపు కోల్పోడు కనుక, జీవి స్వభావము వలన, ఆనందముగా ఉంటాడు కనుక, ఆయన అనేక రోజులు నిరాకర బ్రహ్మణ్ తేజస్సులో ఉండలేడు. ఎందుకంటే ఆయన ఆనందాన్ని కనుగొనాలి. ఆనందం అంటే రకాలు.