TE/Prabhupada 0602 - తండ్రి కుటుంబం యొక్క నాయకుడు



Lecture on SB 1.16.21 -- Hawaii, January 17, 1974


ఈ ప్రశ్నను నేను ప్రొఫెసర్ కోటోవీక్సీ ని అడిగాను. నేను అతన్ని అడిగాను అది "తత్వములలో తేడా ఎక్కడ ఉన్నది? మీ కమ్యూనిస్ట్ తత్వము మా కృష్ణ చైతన్య తత్వము మధ్య? మీరు ఒక ముఖ్యమైన వ్యక్తిని అంగీకరించారు అది లెనిన్ లేదా స్టాలిన్, మేము కూడా ఒక ప్రధాన వ్యక్తి, లేదా భగవంతుడు, కృష్ణుడిని ఎంపిక చేసాము. కాబట్టి మీరు లెనిన్ లేదా స్టాలిన్ లేదా మోలోటోవ్ లేదా వీని లేదా వాని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తున్నారు. మేము తత్త్వమును లేదా కృష్ణుని ఉపదేశమును అనుసరిస్తున్నాము. కాబట్టి సూత్రం మీద, తేడా ఏమిటి? తేడా లేదు. " కాబట్టి ప్రొఫెసర్ దానికి సమాధానం చెప్పలేకపోయారు. మీరు ఎవరూ నిర్దేశించకుండా మీ రోజువారీ వ్యవహారాలను నిర్వహించలేరు.అది అంగీకరించాలి.

కాబట్టి అది ప్రకృతి యొక్క చట్టం. కాబట్టి nityo nityānāṁ cetanaś cetanānām (Kaṭha Upaniṣad 2.2.13). ఎందుకు మీరు మహోన్నతమైన ప్రామాణికం అంగీకరించరు? ఈ సేవకుడుగా ఉండుట... మనము మన నాయకుడిగా ఎవరినైనా అంగీకరించాలి. నాయకత్వం లేకుండా మనం జీవించగలిగే అవకాశం లేదు. అది సాధ్యం కాదు. ఏదైనా పక్షము (పార్టీ) ఉందా, ఏ పాఠశాల అయినా లేదా ఏ సంస్థ అయినా, అది వారు ఏ ముఖ్యమైన నాయకుడు లేదా దర్శకుడు లేకుండా నిర్వహిస్తున్నారా? మీరు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఏ సందర్భంలోనైనా నాకు చూపించగలరా? ఏదైనా సందర్భం ఉందా? లేదు. ఉదాహరణకు మా శిబిరాన్నించి కొంత మంది వెళ్లి పోయారు, కానీ ఆయన గౌరసుందర లేదా సిద్ధ-స్వరూప మహారాజాను గురువుగా అంగీకరించారు. సూత్రం ఉంది, మీరు ఒక నాయకుడిని అంగీకరించాలి. కానీ తెలివి ఏమిటంటే, ఏ రకమైన నాయకత్వం మనము అంగీకరించాలి. అది జ్ఞానం. మనము శిష్యరికాన్ని లేదా ఒకరి కింద ఉండుట అంగీకరించాలి, ఎవరో ఒక వ్యక్తికి సేవకుడు అవ్వటానికి. కాబట్టి బుద్ధి ఏంటంటే "మనము ఎవరిని అంగీకరించాలి?" అది, అక్కడ మేధస్సు ఉంది: "ఏ విధమైన నాయకుడ్ని మనము అంగీకరించాలి?"

కాబట్టి మన సూత్రం ఏమిటంటే, కృష్ణుడ్ని నాయకుడిగా అంగీకరించాలి, ఎందుకనగా కృష్ణుడు భగవద్గీతలో చెప్పెను mattaḥ parataraṁ nānyat kiñcid asti dhanañjaya ( BG 7.7) కృష్ణుడు మహోన్నతమైన నాయకుడు. Eko bahū... nityo nityānāṁ cetanaś cetanānām eko yo bahūnāṁ vidadhāti (Kaṭha Upaniṣad 2.2.13). నాయకుడు అంటే ఆయన తండ్రి వలె ఉండాలి... తండ్రి కుటుంబం యొక్క నాయకుడు. ఎందుకు తండ్రి నాయకుడు? ఎందుకంటే ఆయన సంపాదిస్తారు, ఆయన పిల్లలను, భార్యను, సేవకుడిని మరియు ఇంటికీ కావాల్సిన ఏర్పాట్లను చేస్తాడు; అందువలన సహజంగా, ఆయన కుటుంబం యొక్క నాయకుడుగా అంగీకరించారు. అదేవిధముగా, మీరు మీ దేశం యొక్క నాయకుడిగా అధ్యక్షుడు నిక్సన్ ను అంగీకరించారు ఎందుకంటే ప్రమాదకరమైన సమయంలో ఆయన మార్గదర్శకత్వం ఇస్తాడు, శాంతి సమయంలో ఆయన మార్గదర్శకత్వం ఇస్తాడు. అతడు ఎల్లప్పుడూ తీరిక లేకుండా ఉన్నాడు. మిమ్మల్ని ఎలా సంతోషంగా ఉంచాలో, మిమ్మల్ని ఆందోళన, చింత లేకుండా ఎలా ఉంచాలి, ఇది అధ్యక్షుడి బాధ్యత. లేకపోతే, ఎందుకు మీరు ఒక అధ్యక్షుడిని ఎంచుకుంటారు? ఏవ్యక్తి అయినా ఏ అధ్యక్షుడు లేకుండా జీవించగలడు, కానీ కుదరదు, అది అవసరం.

కాబట్టి అదేవిధముగా, వేదం చెప్తుంది, nityo nityānāṁ cetanaś cetanānām. అక్కడ రెండు రకముల జీవులు ఉన్నాయి. ఒకటి... వారిద్దరూ నిత్య. నిత్య అంటే శాశ్వతమైనది. చేతనా అంటే జీవి. కనుక nityo nityānāṁ cetanaś cetanānām. ఇది భగవంతుని వర్ణన, భగవంతుడు నీలాంటి మరియు నాలాంటి జీవి కూడా. ఆయన కూడా జీవి. మీరు కృష్ణుడిని చూస్తున్నట్లుగానే. కృష్ణుడికి మనకి మధ్య తేడా ఏమిటి? ఆయనకు రెండు చేతులున్నాయి; మీకు రెండు చేతులున్నాయి. ఆయన ఒక తల ఉంది; మీకు ఒక తల ఉంది. మీరు పొందారు... ఆయనకు రెండు కాళ్లు ఉన్నాయి; మీకు రెండు కాళ్ళు ఉన్నాయి. మీరు కొన్ని ఆవులు ఉంచుకొని వాటితో ఆడుకోవచ్చు; కృష్ణుడు కూడా. కానీ తేడా ఉంది. ఆ తేడా ఏమిటి? Eko yo bahūnāṁ vidadhāti kāmān. ఆ ఒక్క కృష్ణుడు, ఆయన మీతో చాలా విధాలుగా సారూప్యత కలిగి ఉన్నప్పటికీ, కాని ఒక వ్యత్యాసం ఉంది - ఆయన మనలో ప్రతి ఒక్కరినీ నిర్వహిస్తున్నాడు, మనము నిర్వహించబడుతున్నాము. ఆయన నాయకుడు. మీకు కృష్ణుడు ఆహారాన్ని సరఫరా చేయకపోతే, మీరు ఏ ఆహార పదార్థాన్ని కలిగి ఉండరు. కృష్ణుడు మీకు పెట్రోల్ను సరఫరా చేయకపోతే, మీరు మీ కారుని డ్రైవ్ చేయలేరు. కాబట్టి eko bahūnāṁ yo vidadhāti. మన జీవితంలో ఉన్న అవసరలూ అవి ఏమైనప్పటికీ - మనకు చాలా విషయాలు అవసరమవుతాయి - అది మనకు eka ఏక ద్వారా సరఫరా చేయబడతాయి. ఆ ఒక్క జీవి. ఇది తేడా. మనం చిన్న కుటుంబాన్ని కూడా చూసుకోలేము, మన సామర్థ్యం కొంత వరకే ఉంది. ప్రస్తుత సమయంలో, ఈ యుగంలో, ఒక వ్యక్తి వివాహం చేసుకోవడానికి ఇష్టపడడు ఎందుకంటే ఆయన ఒక కుటుంబం, భార్య పిల్లలను కూడా నిర్వహించ లేకపోతున్నాడు. ఆయన వారిని నిర్వహించలేడు, నలుగురు లేదా ఐదుగురు కలిగిన ఒక కుటుంబాన్ని కూడా