TE/Prabhupada 0601 - చైత్య గురువు అంటే లోపల నుండి మనస్సాక్షిని మరియు జ్ఞానమును ఇస్తాడు
Sunday Feast Lecture -- Los Angeles, May 21, 1972
కాబట్టి ఇవి భగవంతుని శక్తులు. నేను కొంత మాయాజాలమును చూపిస్తాను కనుక వెంటనే నేను భగవంతుడిని అవుతాను అని కాదు. కేవలము ఇంద్రజాలము ను చూడండి, వాస్తవమైన ఇంద్రజాలము చూడండి. చౌకైన భగవంతుణ్ణి అంగీకరించకండి. భగవంతుడు భగవంతుని ఇంద్రజాలము ను చూపించాలి. ఉదాహరణకు మనము చిన్న ఇంద్రజాలము చూపిస్తున్నాము. ఆకాశములో ఏదైనా విమానము లేదా స్పుట్నిక్ ను లేదా జెట్ విమానమును గాలిలో తేలుతూ ఉండటము చూపిస్తాము. మనము చాలా కీర్తిని తీసుకుంటున్నాము, చాలా కీర్తిని శాస్త్రవేత్తలు ప్రకటించుచున్నారు, భగవంతుడు లేడు. నేనే భగవంతుణ్ణి, ఎందుకంటే నేను ఈ విమానమును తయారు చేసాను. ఈ గ్రహాలతో పోల్చితే మీ విమానం ఎంత? కాబట్టి తెలివైన వ్యక్తి, వారు ఈ శాస్త్రవేత్తలు లేదా తత్వవేత్తల కంటే భగవంతునికి ఎక్కువ కీర్తిని ఇస్తారు. ఎందుకంటే ఆయన శక్తిని చూడగలడు కాబట్టి, అక్కడ ఎంత శక్తి ఉంది. అందువలన ఆయన అనేక శక్తులను కలిగి ఉన్నాడు. వేదముల సాహిత్యంలో మనం అర్థం చేసుకోవచ్చు, parāsya śaktir vividhaiva śrūyate ( CC Madhya 13.65 purport.) వేదాలలో, Upaniṣad: na tasya kāryaṁ karna ca vidyate. భగవంతునికి వ్యక్తిగతంగా చేయడానికి ఏమీ లేదు. Na tasya kāryaṁ karaṇaṁ ca vidyate. Na tat-samas cābhyadhikaś ca dṛśyate. ఎవరూ ఆయనకు సమానముగా లేదా ఆయన కంటే ఎక్కువగా ఉన్నట్లుగా కనిపించరు. ఎవరూ కూడా. అది భగవంతుడు. ఎవరైనా పోటీదారుడిగా ఉంటే, ఒక భగవంతుని పోటీదారుడు, మరొక భగవంతునికి పోటీదారుడు... ఉదాహరణకు ఈ రోజుల్లో ఇలా భగవంతునిగా మారడము ఫ్యాషన్గా మారింది, ఒక "దేవునికి" మరొకరికి మధ్య పోటీలు జరుగుతున్నాయి. కానీ నిజానికి, ఎవరూ భగవంతునితో పోటీపడలేరు. అది భగవంతుడు. Na tasya sama. సమ అంటే సమానంగా ఉండేంది. అధీఖశ్య లేదా గొప్పవారు. అంటే ప్రతి ఒక్కరూ సేవకుడు అని అర్థము. అందరూ సేవకులు. అందరూ భగవంతుని కన్నా తక్కువ స్థాయిలో ఉన్నారు. ఒకరు చాలా శక్తివంతుడు కావచ్చు, కానీ ఎవరూ భగవంతుని కంటే సమానముగా లేదా ఎక్కువగా ఉండలేరు. ఇది వేదముల సమాచారం. Na tasya sama adikasya dṛśyate. మనము కనుగొనలేము... వారు కూడా, గొప్ప సాధువులు, వారు పరిశోధన చేస్తున్నారు, ఎవరు గొప్ప వ్యక్తి అని. అత్యంత గొప్ప వ్యక్తి అని కాబట్టి గొప్ప పవిత్ర వ్యక్తుల పరిశోధన ద్వారా, ప్రత్యేకంగా భగవంతుడు బ్రహ్మ... ఆయన ఈ విశ్వంలోని మొదటి జీవి. అందువలన ఆయన తన ఆధ్యాత్మిక పురోగతి మరియు పరిశోధన ద్వారా తెలుసుకోగలిగాడు, అది కృష్ణుడు అత్యంత గొప్పవాడు అని. Īśvaraḥ paramaḥ kṛṣṇaḥ (BS 5.1). ఆయన తన నిర్ణయాన్ని ఇచ్చాడు: "అత్యంత గొప్ప వ్యక్తి కృష్ణుడు అని." ఉదాహరణకు మనము ఇక్కడ కూర్చున్నట్లుగా, చాలామంది స్త్రీలు మరియు పురుషులు ఉన్నారు. మనము ఇక్కడ ఎవరు గొప్పవారు అన్నది విశ్లేషించవచ్చు. కాబట్టి, వాదన కొరకు, మీరు అంగీకరించవచ్చు "మీరు గొప్పవారు" అని. కానీ నేను గొప్ప వాడిని కాదు. నాకు నా ఆధ్యాత్మిక గురువు ఉన్నారు. ఆయన తన ఆధ్యాత్మిక గురువును కలిగి ఉన్నారు. ఆయన ఒక ఆధ్యాత్మిక గురువును కలిగి ఉన్నారు. ఈ విధముగా, మనము బ్రహ్మ వరకు వెళ్తాము. బ్రహ్మ ఈ విశ్వంలో ఉన్న మొదటి ఆధ్యాత్మిక గురువు, మనకు వేదముల జ్ఞానాన్ని ఇచ్చిన వాడు. అందువలన ఆయనను పూర్వికుడు, తాత, పితామహ అని పిలుస్తారు. కానీ ఆయన కూడా స్వతంత్రుడు కాదు. వేదాంత-సూత్రములో లేదా భాగవతములో ఇది చెప్పబడినది బ్రహ్మ ... ఆయన మొదటి జీవి. ఆయన మొదట సృష్టించబడినప్పుడు ఏ ఇతర జీవి, ఏ ఇతర జీవి లేడని చెప్పబడినది. నేను ఆయన కూడా ఇతరుల నుండి జ్ఞానం పొందాడని చెప్పినట్లయితే, అప్పుడు ఇది వాదన కావచ్చు, ఆయనకి జ్ఞానం ఇచ్చిన ముందు వ్యక్తి ఎవరు? కావున భాగవతము చెప్తుంది, "లేదు. ఆయన కృష్ణుడి నుండి జ్ఞానం పొందాడు." ఎలా? "హృదయములో నుంచి." తేనే బ్రహ్మ హృదా. హృదా. ఎందుకంటే భగవంతుడు, కృష్ణుడు, ప్రతి ఒక్కరి హృదయంలో కూర్చుని ఉన్నాడు - మీ హృదయములో, నా హృదయములో, ప్రతి ఒక్కరిలో. ఆయన నీకు ఉపదేశమును ఇస్తాడు. అందువలన ఆయన పేరు చైత్య గురువు. చైత్య గురువు అంటే లోపల నుండి మనస్సాక్షిని మరియు జ్ఞానమును ఇస్తాడు. భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, sarvasya cāhaṁ hṛdi sanniviṣṭo: ( BG 15.15) ప్రతి ఒక్కరి హృదయంలో నేను కూర్చుని ఉన్నాను. హృది, "హృదయము లోపల"; సన్నివిష్ఠో, "నేను అక్కడ కూర్చున్నాను." సర్వస్య. నీలో, నాలో మాత్రమే కాదు, జంతువుల, కీటకాలు, పక్షులు, మృగములలో, బ్రహ్మలో కూడా, ప్రతి ఒక్కరిలో. సర్వస్య. జీవులు అందరిలో కావున sarvasya cāhaṁ hṛdi sanniviṣṭo mattaḥ: "నా నుండి"; smṛtir jñānam apohanaṁ ca, "గుర్తుంచుకోవడము, జ్ఞానము మరియు మరచిపోవడము." మరిచిపోవడము కూడా. నీవు భగవంతుడిని మరచిపోవాలనుకుంటే, నీకు భగవంతుడు శాశ్వతముగా మర్చిపోవడానికి బుద్ధిని ఇస్తాడు. ఆయన చాలా దయతో ఉంటాడు. మీరు కోరుకున్నది ఏమైనను, ఆయన మీకు తెలివితేటలను ఇస్తాడు, "ఇలా చేయండి." అని