TE/Prabhupada 0607 - మన సమాజంలో, మీరు అందరు గాడ్ బ్రదర్స్ , గాడ్ సిస్టర్స్Lecture on SB 1.3.13 -- Los Angeles, September 18, 1972


ఈ ఋషభదేవుడు, ఆయన భోదించాడు "నా ప్రియమైన పుత్రులారా, ఈ జీవితం, మానవ జీవితం , పందులు కుక్కల వలె వృధా చేయకూడదు." పందులలో ఇంద్రియ తృప్తి ఉంది. మెరుగైన సౌకర్యము పరిమితి లేదు. పరిమితి లేదు. మానవ సమాజంలో కనీసం అధికారికముగా కొంత పరిమితి ఉంది. Mātrā svasrā duhitrā. అన్ని శాస్త్రాలు చెప్పుతున్నాయి, "ఏదీ లేదు ..." కాని ఈ సమాజాలు ఉన్నాయి - మాకు చర్చించడానికి ఇష్టం లేదు - తల్లి, సోదరి, కూతురుతో కూడా మైథున సంబంధాన్ని కలిగి ఉంటారు. ఇప్పటికీ. కానీ అది గతంలో కూడా ఉంది. అది అలా కాదు, సాధారణముగా కాదు. కాని శాస్త్రము చెప్పుతుంది , mātrā svasrā duhitrā vā nāviviktāsano bhavet ( SB 9.19.17) మీ కూతురుతో, మీ సహోదరితో, మీ తల్లితో కూడా ఏకాంత ప్రదేశంలో కూర్చోవద్దు. కాబట్టి ప్రజలు చెప్పవచ్చు, "ఒకరు తల్లి, సోదరి, కుమార్తె సాంగత్యములో కలవరపడితే , చాలామంది దుష్టులు వారు చాలా అధోగతి చెందినవారు" లేదు శాస్త్రము చెప్పుతుంది balavān indriya-grāmo vidvāṁsam api karṣati. ఇంద్రియాలు ఎంత బలంగా ఉన్నాయి అంటే, ఆయనకు చాలా జ్ఞానము ఉన్నా, ఆయన ఆందోళన చెందుతాడు. ఆయన తల్లి, సోదరి కుమార్తె సమక్షంలో కూడా ఆందోళన చెందుతాడు.

ఇంద్రియాలు చాలా బలంగా ఉన్నాయి. Balavān indriya-grāmaḥ. ఇది నిషేధించబడింది. ఇతరుల గురించి ఏమి మాట్లాడాలి? అందువలన, సాధారణ నైతిక ఉపదేశములు మరియు వేదముల నాగరికత ప్రకారము తన భార్యను తప్ప ఇతర స్త్రీని తల్లిగా అంగీకరించాలి. Mātṛvat para-dāreṣu. Para-dāreṣu. అందరూ పెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది. దారా అంటే భార్య. పర- దారేషు , ఇతరుల భార్య. ఆమె చిన్నదా లేదా పెద్దదా అనే విషయము పట్టింపు లేదు, కాని ఆమెను తల్లిగా పరిగణించాలి. అందువల్ల వేదముల సంస్కృతిలో ఇది ఒక పద్ధతి, ఒకరు మరొక స్త్రీని చూసిన వెంటనే, అతడు ఆమెను, "తల్లి," మాతాజీ అని పిలుస్తాడు. వెంటనే, "తల్లి." అది సంబంధం కలుపుతుంది. ఆ స్త్రీ తెలియని వ్యక్తిని కొడుకుగా పరిగణిస్తుంది, తెలియని వ్యక్తి తెలియని స్త్రీని తల్లిగా పరిగణిస్తాడు. ఇది వేదముల నాగరికత. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన సమాజంలో, మీరు అందరు మాతాజీ మరియు ప్రభుజి లేదా వివాహితులైన వారు, తల్లి వoటి వారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు మీరు వివేకముతో ఉంటారు. ధీర అది బ్రాహ్మణ అర్హత, బ్రాహ్మణ సంస్కృతి. కాదు "చక్కని అమ్మాయిలతో కలవడానికి సౌకర్యాలు ఉన్నాయి కనుక, కాబట్టి నేను ప్రయోజనమును తీసుకొని వారిని దోచుకుంటాను." లేదా అమ్మాయిలు తీసుకుంటారు ... కాదు. అందువలన మన పరిమితి: అక్రమ లైంగిక సంబoధము వద్దు.

ఒకరు ధీరా గా మారాలి. అప్పుడు భగవత్ చైతన్యము యొక్క ప్రశ్న. జంతువులు భగవత్ చైతన్యము కలిగి ఉండలేవు. . అందువలన ఇది ప్రత్యేకంగా ప్రస్తావించబడింది. Dhīrāṇām Vartma. ఆయన చూపించిన మార్గం, అది ధీరా కోసం ఉద్దేశించబడింది, అధీరా కోసము కాదు. Dhīrāṇām. అది చాలా బాగుంది sarvāśrama-namaskṛtam అన్ని ఆశ్రమాల వారు అభినందించి మరియు ప్రణామము చేస్తారు. అన్ని ఆశ్రమాలు అంటే అర్థం బ్రహ్మచారి, గృహస్త, వానప్రస్త, మరియు సన్యాస. కాబట్టి స్త్రీలతో వ్యవహరిస్తుoటే ... ముఖ్యంగా ఉపదేశము పురుషులకు ఇవ్వబడుతుంది. అన్ని సాహిత్యాలు, అన్ని వైదిక సాహిత్యాలు, ముఖ్యంగా పురుషుల ఉపదేశము కోసం ఉద్దేశించబడ్డాయి. స్త్రీ భర్తను అనుసరిస్తుంది. అంతే. భర్త భార్యకు ఉపదేశము చేస్తాడు. అమ్మాయి పాఠశాలకు వెళ్ళి బ్రహ్మచారి-ఆశ్రమమును తీసుకోవాలి అటువంటిది ఏదీ లేదు, లేదా ఉపదేశము తీసుకోవడానికి ఆధ్యాత్మిక గురువు దగ్గరకు వెళ్ళాలి. ఇది వేదముల పద్ధతి కాదు. వేదముల పద్ధతి ఏమిటంటే ఒక పురుషుడు పూర్తిగా ఆదేశించబడతాడు, స్త్రీ, అమ్మాయి, ఒక పురుషునితో తప్పక వివాహం చేసుకోవాలి . పురుషుడికి అనేక భార్యలు ఉన్నా కూడా , బహుభార్యాత్వం కలిగి ఉండవచ్చు, అయినప్పటికీ, ప్రతి స్త్రీ వివాహం చేసుకోవాలి. ఆమె భర్త నుండి ఉపదేశము పొందుతుంది. ఇది వేదముల పద్ధతి. స్త్రీకి పాఠశాల, కళాశాల లేదా ఆధ్యాత్మిక గురువు దగ్గరకు వెళ్ళడానికి అనుమతి లేదు. కాని భర్త భార్య, వారు ఇద్దరికి దీక్షను ఇవ్వవచ్చు. ఇది వేదముల పద్ధతి.

dhīrāṇāṁ vartma. ఎందుకంటే ప్రజలు మొదట శాంతముగా ఉండాలి. అప్పుడు కృష్ణ మరియు భగవత్ చైతన్యము గురించి మాట్లాడండి. ఆయన జంతువు అయితే, ఆయన ఏమి అర్థం చేసుకుంటాడు? ఇది వేదముల పద్ధతి. Dhīrāṇām. ధీరా అంటే శాంతముగా, సంపూర్ణముగా శాంతముగా ఉండాలి. స్త్రీలను అందరిని "తల్లి" గా చూడాలి. Mātṛvat para-dāreṣu para-dravyeṣu loṣṭravat. ఇది శిక్షణ, ఇతరుల భార్యను తల్లిగా పరిగణించాలి, ఇతరుల డబ్బును వీధిలో చెత్త వలె. ఎవరూ దానిని పట్టించుకోరు. అదేవిధముగా, ఇతరుల డబ్బును తాకకూడదు. అది ఎవరైనా తన పర్స్ ను మర్చిపోయినా కూడా, వీధిలో డబ్బు సంచి, ఎవరు దానిని తాకరు. అ మనిషి తిరిగి వచ్చి దానిని తీసుకోనివ్వండి. అది నాగరికత. Para-dravyeṣu loṣṭravat, ātmavat sarva-bhūteṣu. ఇతర జీవులను అన్నిటితోను తనకు లాగానే వ్యవహరించడం. ఎవరైనా నన్ను గిచ్చితే నేను బాధను అనుభవిస్తాను. ఎందుకు నేను ఇతరులను గిచ్చాలి? ఎవరైనా నా గొంతును కత్తిరించినట్లయితే, నేను చాలా బాధపడతాను. నేను ఇతర జంతువుల గొంతును ఎందుకు కత్తిరించాలి? ఇది నాగరికత. ఇది వేదముల నాగరికత. ఎప్పుడూ జంతువులను చంపుతూ, స్త్రీల వెంట పడుతూ, పై బట్టలు లేని ఆడవారి వెంట, వ్యాపారము చేయటము, ఇది కాదు. ఇది నాగరికత కాదు. ఇది మానవ నాగరికత కాదు