TE/Prabhupada 0608 - భక్తియుక్త సేవ, మనము సహనంతో మరియు ఉత్సాహంతో అమలు చేయాలిThe Nectar of Devotion -- Vrndavana, October 20, 1972


Narottama dāsa Ṭhākura, చాలా ఉన్నతమైన ఆచార్యులు, ఆయన మనకు బోధిస్తున్నారు, yugala-pīriti యుగళ ప్రీతి రాధా కృష్ణుల మధ్య ప్రేమ వ్యవహారాలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించకండి, , కల్పితంగా, మీ సొంత కల్పన ద్వారా. వద్దు మొదట మీరు ఆరుగురు గోస్వాములకు సేవ చేయడానికి ప్రయత్నించండి, rūpa-raghunātha-pade haibe ākuti, ఎలా వారు నిర్దేశము చేస్తున్నారు. ఈ భక్తి-రసామృత-సింధు లో వలె. శ్రీల రూప గోస్వామి రాధా-కృష్ణుల యొక్క ప్రేమ వ్యవహారాలు ప్రారంభంలో బోధించటము లేదు. కాదు ఆయన మొట్ట మొదట శిక్షణ ఇస్తున్నాడు, పాఠకులకి, భక్తుడికి, పవిత్ర భక్తులలో మొదటివాడు ఎలా కావాలి.

anyābhilāṣitā-śūnyaṁ
jñāna-karmādy-anāvṛtam
ānukūlyena kṛṣṇānu-
śīlanaṁ bhaktir uttamā
(Brs. 1.1.11)

మొట్ట మొదట, ఆయన భక్తుడిని ప్రామాణిక భక్తియుక్త సేవకు తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నాడు. విధి మార్గ. అప్పుడు క్రమంగా, ఆయన అలవాటు పడినప్పుడు, అప్పుడు రాగ మార్గ లో సాక్షాత్కారము వస్తుంది. రాగ మార్గ కృత్రిమమైనది కాదు. ఇది అవుతుంది, svayam eva sphuraty adhaḥ. Sevonmukhe hi jihvādau... (Brs. 1.2.234). అంతా, కృష్ణుడితో భక్తి సంబంధాలు, మీరు కృత్రిమంగా ఏర్పాటు చేయలేరు. ప్రతి ఒక్కరూ తన వాస్తవ స్వరూప స్థితిలో కృష్ణుడితో ఒక ప్రత్యేక సంబంధాన్ని కలిగి ఉన్నారు. మీరు భక్తియుక్త సేవలో ఉన్నత స్థానములోకి వచ్చినప్పుడు అది క్రమంగా వెల్లడి అవుతుంది ఇవ్వబడిన నియమాలు మరియు నిబంధనలతో అవి శాస్త్రములో మరియు ఆధ్యాత్మిక గురువు ద్వారా నిర్దేసించినట్లుగా. మీరు సరిగ్గా శిక్షణ పొందినప్పుడు, మీరు రాగ-మార్గా స్థితికి వస్తారు, అప్పుడు మీ సంబంధం ... అది స్వరూప-సిద్ధి అంటారు. స్వరూప-సిద్ధి. కాబట్టి స్వరూప-సిద్ధి ఒక నిర్దిష్ట దశలో సాధించవచ్చు. ఉదాహరణకు స్వరూప-సిద్ధి... లైంగిక జీవితపు కోరిక ప్రతి మానవునిలో ఉంది, కాని అబ్బాయి అమ్మాయి పరిపక్వ దశకు వచ్చినప్పుడు, అది వ్యక్తమవుతుంది. ఇది, కృత్రిమంగా నేర్చుకోలేదు. అదేవిధముగా , రాగ-మార్గా, స్వరూప-సిద్ధి, వెల్లడి అవుతుంది లేదా వ్యక్తమవుతుంది. Śravaṇādi-śuddha-citte karaye udaya. Udaya. ఈ పదం, ఉదయ, ఉపయోగించబడుతుంది. సూర్యుడు లాగానే. సూర్యుడు సహజముగా ఉదయించినప్పుడు సూర్యుడు కనిపిస్తాడు. అర్ధరాత్రి మీరు సూర్యుడిని బలవంతముగా ఉదయింపచేయలేరు. అది సాధ్యం కాదు. సూర్యుడు ఉదయిస్తాడు. మీరు వేచి ఉoడండి. సరిగ్గా సమయం అయినప్పుడు, ఉదయం, ఆరు గంటలకు, మీరు సూర్యుడిను చూస్తారు.

అదేవిధముగా, భక్తియుక్త సేవ, మనము సహనంతో అమలు చేయాలి, ఉత్సాహంతో. Utsāhāt dhairyāt niścayāt tat-tat-karma-pravartanāt. మనము ఎంతో ఉత్సాహంగా ఉండాలి... "నేను కృష్ణ చైతన్య ఉద్యమములో చాలా చక్కగా నిమగ్నము అవుతాను." అది మొదటి అర్హత, ఉత్సాహముగా ఉండాలి. నిరుత్సాహము మీకు సహాయం చేయదు. మీరు చాలా ఉత్సాహంగా ఉండాలి. నా గురు మహారాజ ప్రస్తావించేవారు, prāṇa ache yara sei hetu pracāra. ఒక బోధకుడు, ఒక వ్యక్తి బోధకుడు కావచ్చు ఆయనకు ప్రాణము ఉంటే. చనిపోయిన వ్యక్తి బోధకుడు కాలేడు. కాబట్టి మీరు చాలా ఉత్సాహముతో ఉండాలి "నేను సర్వోత్కృష్ట సామర్థ్యముతో భగవంతుని యొక్క మహిమలను ప్రచారము చేస్తాను" అని . బోధకుడు అవ్వాలంటే చాలా జ్ఞానము కలిగిన పండితుడు కావాలని కాదు. కేవలం దీనికి ఉత్సాహం అవసరం, "నా భగవంతుడు చాలా గొప్పవాడు, చాలా దయ కలిగిన వాడు, చాలా అందమైన వాడు, చాలా అద్భుతమైన వాడు. నా ప్రభువు గురించి నేను ఏమైనా మాట్లాడాలి. "ఇది అర్హత, ఉత్సాహం. మీకు కృష్ణుడు చాలా సంపూర్ణంగా తెలియకపోవచ్చు. కృష్ణుడిని చాలా పరిపూర్ణంగా తెలుసుకోవడం సాధ్యం కాదు. కృష్ణుడు అపరిమితమైవాడు. మనము కృష్ణుడిని వంద శాతం తెలుసుకోలేము. అది సాధ్యం కాదు. కాని కృష్ణుడు మీరు అర్థము చేసుకునేటంత వెల్లడిస్తాడు . మనము కృష్ణుడి యొక్క నిజాయితీ గల సేవకుడు అయితే, utsāhān, ఉత్సాహన్, మనము ఓపికగా సేవ చేస్తే, అప్పుడు కృష్ణుడు వెల్లడిస్తాడు.

ఈ సంబoధములో ఉదాహరణ ఇవ్వబడింది. ఉదాహరణకు ఒక అమ్మాయి పెళ్లి చేసుకుoటుంది. సాధారణంగా, అమ్మాయి ఒక బిడ్డను కోరుకుంటుంది. కానీ ఆమె పెళ్లి అయిన తర్వాత వెంటనే ఒక బిడ్డను కావాలని కోరుకుంటే, అది సాధ్యం కాదు. ఆమె వేచి ఉండాలి. ఆమె భర్తకు చక్కగా సేవ చేయాలి. Utsāhān dhairyāt tat-tat-karma-pravartanāt. విశ్వాసము గల భార్య లాగా. సమయం వస్తుంది ఆమె గర్భవతి అవుతుంది ఆమె బిడ్డను పొందుతుంది. కాబట్టి niścayāt నిశ్చయత్ అంటే ... అమ్మాయికి తెలిసిన విధముగా ఆమెకు వివాహము అయినది కనుక , ఆమెకు ఒక భర్త ఉన్నాడు కనుక, ఒక బిడ్డ ఉండాలి. ఇది సత్యము. ఇది కొద్ది సమయము తరువాత అవ్వవచ్చు. అదేవిధముగాా, మీరు భక్తియుక్త సేవలో ప్రవేశించినప్పుడు, భక్తి-యోగ, భక్తి-మార్గంలో, మీ విజయము హామీ ఇవ్వబడుతుంది, మీరు ఉత్సాహముగా మరియు సహనముతో ఉంటే. "వెంటనే నాకు ఒక బిడ్డ కావాలి," అంటే కుదరదు వెంటనే నేను పూర్తిగా కృష్ణ చైతన్యమును కలిగి ఉంటాను మరియు పరిపూర్ణుడను అవుతాను. వీలు కాదు చాలా లోపాలు ఉండవచ్చు. ఎందుకంటే మనము అపరిపూర్ణ వాతావరణంలో ఉన్నాము. శాస్త్రముల నిర్దేశము ప్రకారము మీరు భక్తియుక్త సేవలో మీ బాధ్యతలను నిర్వర్తించినట్లయితే, కానీ ఓర్పుతో ఆధ్యాత్మిక గురువు ధ్రువీకరిస్తే, అప్పుడు తప్పని సరిగా మీ విజయము హామీ ఇవ్వబడుతుంది ఇది మార్గం. Utsāhān dhairyāt tat-tat-karma-pravartanāt. మీరు విధులను నిర్వర్తించాలి.

మేము మా విద్యార్థులను కనీసము పదహారు మాలలు జపము పూర్తి చేయాలని కోరుతాము. పదహారు మాలలు పెద్ద కష్టమేమి కాదు. వృoదావనంలో అనేకమంది భక్తులు ఉన్నారు, వారు నూట ఇరవై మాలలు చేస్తారు. ఆ విధముగా. కావున పదహారు మాలలు కనీసము. పాశ్చాత్య దేశాల్లో నాకు తెలిసినందున అరవై నాలుగు మాలలు లేదా నూట ఇరవై మాలలు పూర్తి చేయటం కష్టం. కనీసము పదహారు మాలలు. అది పూర్తి చేయాలి.Tat-tat-karma-pravartanāt. ఇది నిర్దేశం. నియంత్రణ సూత్రాలను పాటించాలి. ఈ విధముగా, మనము ఆధ్యాత్మిక గురువు మరియు శాస్త్రం యొక్క నిర్దేశమునకు కట్టుబడి ఉoడాలి. అప్పుడు మిగతాది హామీ ఇవ్వబడింది. విజయము హామీ ఇవ్వబడుతుంది