TE/Prabhupada 0623 - ఆత్మ ఒక శరీరం నుండి మరోదానికి బదిలీ చేయబడుతుంది
Lecture on BG 2.13 -- Pittsburgh, September 8, 1972
ప్రభుపాద:
- dehino 'smin yathā dehe
- kaumāraṁ yauvanaṁ jarā
- tathā dehāntara-prāptir
- dhīras tatra na muhyati
- (BG 2.13)
ప్రస్తుత క్షణము ఇది సమస్య. ఈ శరీరం యొక్క కీలక జీవశక్తి గురించి ప్రజలు భోదించబడలేదు. ఇక్కడ భగవద్గీతలో, అది వివరించబడింది, దేహి. దేహి అంటే ఈ శరీర యజమాని. మనం అంతా, మానవుడు మాత్రమే కాదు, కానీ మానవుని కంటే తక్కువ స్థాయిలో ఉన్నవారు, జీవులు అందరూ... 84,00,000 రకాల జీవులు ఉన్నాయి. వాటిని దేహి అని పిలుస్తారు. దేహి అంటే శరీర యజమాని. కుక్క, పిల్లి, మానవుడు, అధ్యక్షుడు, లేదా ఉన్నతమైన లేదా అధమమైన, వివిధ రకాలైన జాతులు ఉన్నాయి. అందరూ శరీరము యొక్క యజమాని. దానిని మనము అనుభవించవచ్చు. మీ శరీరం యొక్క బాధలు మరియు ఆనందాల గురించి నీకు తెలుసు. నా శరీరం యొక్క బాధలు మరియు ఆనందాల ఏమిటో నాకు తెలుసు. కాబట్టి మన కార్యక్రమాలు చేసుకొనుటకు క్షేత్రముగా భౌతిక ప్రకృతి మనకు ఈ శరీరమును ఇచ్చినది. వేర్వేరు శరీరములతో, మనము భిన్నంగా వ్యవహరిస్తున్నాము. మీ కార్యక్రమాలు మరియు నా కార్యక్రమాలు ఒకేలా లేవు. కుక్క యొక్క కార్యక్రమాలు మరియు మనిషి యొక్క కార్యక్రమాలు భిన్నంగా ఉంటాయి ఎందుకంటే కుక్క వేరొక రకమైన శరీరాన్ని కలిగి ఉంది నేను వేరొక రకమైన శరీరమును కలిగి ఉన్నాను. మనలో ప్రతి ఒక్కరు. కాబట్టి dehino 'smin yathā dehe ( BG 2.13) దేహి, జీవి లేదా జీవశక్తి ఈ శరీరంలో ఉంది.
కాబట్టి శరీరం మారుతుంది. Dehino 'smin yathā dehe kaumāraṁ yauvanaṁ jarā ( BG 2.13) కౌమారం అంటే బాల్యము. యవ్వనం అంటే యువకుడు, జరా అంటే ముసలితనము అని అర్థము నేను గుర్తు పెట్టుకోగలను, నేను ఒక వృద్ధుడను, నేను గుర్తు పెట్టుకో గలను నేను ఒక బాలుడి శరీరం కలిగి ఉన్నాను, నేను ఒక యువకుని శరీరమును కలిగి ఉన్నాను. ఇప్పుడు నేను ఈ వృద్ధుడి శరీరమును కలిగి ఉన్నాను. కాబట్టి బాల్య శరీరం, యువకుని శరీరము ఉనికిలో లేనప్పటికీ, కానీ నేను ఇప్పటికీ ఉన్నాను. అది సత్యము. అందరూ అర్థం చేసుకోగలరు. ఆయనకు గతము, వర్తమానము, మరియు భవిష్యత్తు ఉంది ఇక్కడ మీరు అందరూ యువకులు యువతులు ఉన్నారు. కాబట్టి మీరు మీ గత శరీరాన్ని బాల్యం శరీరమును కలిగి ఉన్నారు. అదేవిధముగా, మీకు భవిష్యత్తు శరీరం ఉంది. అది వేచి ఉంది. నేను ఇప్పటికే పొందాను, మీరు వేచి ఉన్నారు. కాబట్టి గతము, భవిష్యత్తు, గతము, వర్తమానము, భవిష్యత్తు, సాపేక్షంగా మనము ఏ పరిస్థితిలోనైనా అర్థం చేసుకోవచ్చు. అందువల్ల సారాంశము నేను ఇప్పుడు కలిగన వృధ్యాప్య శరీరము వలె... నాకు డెబ్భై ఏడు సంవత్సరాలు వయస్సు ఉంది. ఈ శరీరం పూర్తి అయినప్పుడు, నేను మరొక శరీరం పొందుతాను. నేను వరుసగా పొందినట్లు, శిశువు శరీరము నుండి నుండి బాల్య శరీరమునకు, బాల్య శరీరము నుండి యుక్త వయస్సు శరీరము, వృధాప్య శరీరానికి, నేను తరువాతి శరీరమునకు ఎందుకు వెళ్ళను? ఇది సరళమైన సత్యము, జీవి లేదా ఆత్మ, ఒక శరీరం నుండి మరోదానికి బదిలీ చేయబడుతుంది. ఇది ఆధ్యాత్మిక అవగాహన యొక్క ప్రాథమిక సూత్రం. శరీరం యొక్క జీవశక్తి ఆత్మ. ఇది పదార్థము యొక్క యాంత్రిక అమరిక కాదు. శాస్త్రజ్ఞులు అని పిలవబడే ఆధునిక వ్యక్తులు, వారు శరీరం పదార్థము యొక్క కలయిక అని అనుకుంటున్నారు ఒక నిర్దిష్ట దశలో, పదార్థము యొక్క కలయిక జీవ లక్షణాలు అభివృద్ధి చేస్తుంది. కానీ ఇది సత్యము కాదు. అది వాస్తవం అయితే, అప్పుడు శాస్త్రవేత్తలు రసాయనాలతో ఒక జీవి శరీరాన్ని తయారు చేయగలరు. కానీ ఇప్పటి వరకు కూడా ఒక శాస్త్రవేత్త ఒక చీమ శరీరాన్ని కూడా ఉత్పత్తి చేయలేదు, ఇతర, పెద్ద జంతువుల గురించి ఏమి మాట్లాడతాము