TE/Prabhupada 0624 - భగవంతుడు కూడా శాశ్వతమైనవాడు, మనము కూడా శాశ్వతమైనవారము
Lecture on BG 2.13 -- Pittsburgh, September 8, 1972
కాబట్టి మనము ఈ జ్ఞానాన్ని ప్రామాణికం నుండి తీసుకోవాలి. ఇక్కడ కృష్ణుడు మాట్లాడుతున్నారు. ఆయన ప్రామాణికం. మనము దేవాదిదేవుడిగా కృష్ణుడిని అంగీకరిస్తాము: ఆయన జ్ఞానం పరిపుర్ణమైనది. ఆయనకు గతం, ప్రస్తుతం భవిష్యత్తు గురించి తెలుసు. అందువలన, ఆయన అర్జునునికి బోధిస్తున్నాడు, నా ప్రియమైన అర్జునా, ఈ శరీరంలోని ఆత్మ శాశ్వతమైనది. అది సత్యము. ఉదాహరణకు నేను అర్థం చేసుకోగలను, నేను గతంలో ఉన్నాను, నేను ప్రస్తుతం ఉన్నాను, భవిష్యత్తులో నేను ఉంటాను. కాలమునకు మూడు దశలు ఉంటాయి, గతం, వర్తమానము భవిష్యత్తు. ఇంకొక చోట, మనము ఈ భగవద్గీతలో చదువుతాము, na jāyate na mriyate vā kadācit. జీవి ఎప్పుడూ జన్మించదు; అది మరణించదు. న జాయతే అనగా ఆయన ఎన్నడూ జన్మించడు. న జాయతే న మ్రియతే, అది ఎన్నడూ మరణించదు . Nityaṁ śāśvato 'yam, na hanyate hanyamāne śarīre ( BG 2.20) ఇది శాశ్వతమైనది, శాశ్వత, ఎప్పటికీ జీవించే ఉంటుంది. Na hanyate hanyamāne śarīre ( BG 2.20) ఈ శరీరం యొక్క వినాశనం ద్వారా, ఆత్మ చనిపోదు. ఇది కూడా ఉపనిషత్, వేదాలలో ధృవీకరించబడింది: nityo nityānāṁ cetanaś cetanānām eko bahūnāṁ vidadhāti kāmān. భగవంతుడు కూడా శాశ్వతమైనవాడు, మనము కూడా శాశ్వతమైనవారము. మనము భగవంతుని యొక్క భాగం మరియు అంశలము. ఉదాహరణకు బంగారం మరియు బంగారు కణములు లాగానే; అవి రెండు బంగారమే. నేను ఒక చిన్న కణము అయినప్పటికీ, బంగారపు కణము లేదా ఆత్మ, ఐనప్పటికీ, నేను ఆత్మను. అందువల్ల మనము ఈ సమాచారం పొందుతున్నాము, భగవంతుడు మరియు మనము, జీవులము, మనము శాశ్వతమైనవారము. నిత్యో నిత్యానం, నిత్య అంటే శాశ్వతమైనది.
కాబట్టి రెండు పదాలు ఉన్నాయి. ఒకటి ఏక సంఖ్య, నిత్య, శాశ్వతమైనది, మరొకటి బహువచనం, నిత్యానాం. మనం బహు సంఖ్య. బహు సంఖ్య జీవులు. ఎన్ని రకముల జీవుల వున్నాయో సంఖ్యా పరముగా మనకు తెలియదు. వారు అసంఖ్య అని వర్ణించారు. అసంఖ్య అంటే లెక్కించుటకు సాధ్యము కాని అని అర్థము. మిలియన్లు ట్రిలియన్లు. ఈ ఏక వచనము మరియు బహువచనం మధ్య తేడా ఏమిటి? బహువచనం సంఖ్య ఏక సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది. Eko bahūnāṁ vidadhāti kāmān. ఏక సంఖ్య జీవి ఇస్తున్నారు బహువచన సంఖ్య జీవితానికి అవసరమైన అన్ని అవసరాలను, మనకు జీవులకు. అది వాస్తవం, మన బుద్ధి ద్వారా పరిశీలించవచ్చు. 84,00,000 రకముల జీవులలో, మనము నాగరికత కలిగిన మానవులము చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ ఇతరులు, వారి సంఖ్య చాలా పెద్దది. ఉదాహరణకు నీటిలో. Jalajā nava-lakṣāṇi. జలజా నవ-లక్షాణి. నీటి లోపల 9,00,000 రకముల జీవ జాతులు ఉన్నాయి. స్థావర లక్ష -విశంతి; చెట్ల , మొక్కలలో 20,00,000 రకముల జీవులు ఉన్నాయి. జలజా నవ- లక్షాణి స్థావర లక్ష -విశంతి, క్రిమియో రుద్ర-సంఖ్యః. మరియు కీటకాలు, అవి 11,00,000 రకముల జాతులు ఉన్నాయి. క్రిమియో రుద్ర-సంఖ్యః పక్షినా దశ- లక్షాణాం. పక్షులు, అవి 10,00,000 రకముల రూపాలు. తర్వాత జంతువులు, పశావస్త్రిశ- లక్షాణి , 30,00,000 రకముల జంతువులు, నాలుగు కాళ్ళవి. చతుర్- లక్షాణి మనుష్యః, మనిషి రూపాలు 4,00,000 రకములు ఉన్నాయి. వారిలో చాలామంది అనాగరికులు