TE/Prabhupada 0625 - జీవిత అవసరాలు సర్వోన్నత శాశ్వతమైన, భగవంతుని ద్వారా సరఫరా చేయబడుతున్నాయిLecture on BG 2.13 -- Pittsburgh, September 8, 1972


కాబట్టి మనం నాగరికత కలిగిన మానవులము - అమెరికన్ లేదా భారతీయుడా లేదా జర్మన్ లేదా అంగ్లేయుడా, పట్టించుకోవలసిన అవసరము లేదు, మనము చాలా తక్కువ మందిమి. కాబట్టి మనకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి. మనము మన ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చేయడము కోసం ప్రయత్నిస్తున్నాము. ఆ ఆర్థిక పరిస్థితి ఏమిటి? తినడం, నిద్ర పోవడము, సంభోగము చేయడము, రక్షించుకోవటము. మనము ఎల్లప్పుడూ తీరిక లేకుండా ఉన్నాము, కానీ జంతువులు కూడా తీరిక లేకుండా ఉన్నాయి తినడం, నిద్రపోవటం, సంభోగము చేయడము, రక్షించుకోవటము కోసం, కానీ వాటికి సమస్య లేదు. మనకు సమస్యలు ఉన్నాయి. కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి పెద్ద మొత్తములో ఉన్న జీవులకు సమస్య లేనట్లయితే ... వాటి జీవిత అవసరాలు సర్వోన్నత శాశ్వతమైన, భగవంతుని ద్వారా సరఫరా చేయబడుతున్నాయి. ఉదాహరణకు ఒక ఏనుగు. ఆఫ్రికా అడవిలో లక్షలాది ఏనుగులు ఉన్నాయి. అవి ఒకే సారి యాభై కిలోలు తింటాయి. కానీ అవి తమ ఆహారాన్ని పొందుతున్నాయి. అదేవిధముగా, ఒక చిన్న చీమ, దానికి కొంచము చక్కెర అవసరం. అయితే అది కూడా తన ఆహారము పొందుతుంది. కాబట్టి మహోన్నతమైన శాశ్వతమైన భగవంతుడు ఆహారం ఏర్పాటు చేసినారు, లేదా ఆర్థిక సమస్యలు ప్రకృతి ద్వారా పరిష్కరించబడతాయి. అవి ఏ పనులను చేయవు, అవి సాంకేతికతను తెలుసుకోవడానికి ఏ పాఠశాలకు లేదా కళాశాలలకు వెళ్ళవు, జీవనోపాధిని సంపాదించడానికి, కానీ అవి సరఫరా చేయబడుతున్నాయి. అవి ఆరోగ్యంగా ఉన్నాయి. ఏ వ్యాధి లేదు.

మన నాగరికత పురోగతి అంటే మనము సమస్యలను సృష్టించాము. అంతే. ఇది నాగరికత యొక్క పురోగతి, ఆత్మ యొక్క నిర్మాణం ఏమిటి అనేది మనకు తెలియదు, ఎలా ఒక శరీరం నుండి మరొక శరీరమునకు వెళ్ళుతుంది, తదుపరి జీవితం ఏమిటి, మనం తరువాతి జన్మలో మానవ జీవితమును లేదా మానవుని కన్నా మెరుగైన జీవితాన్ని లేదా మానవుని కన్నా అధమ జీవితమును పొందుతామా. అది అలా అయితే, మనం ఆ విధమైన రూపాన్ని ఎలా పొందుతున్నాం? ఎందుకంటే మనము శాశ్వతమైనందున, మనము ఈ శరీరాన్ని మారుస్తున్నాము. రెండు రకాలైన శరీరములు ఉన్నాయి అని మనకు తెలియదు: స్థూల శరీరం మరియు సూక్ష్మ శరీరం. ఈ స్థూల శరీరం భూమి, నీరు, అగ్ని, గాలి మరియు ఆకాశంతో చేయబడింది; సూక్ష్మ శరీరము మనస్సు, బుద్ధి, అహంకారంతో చేయబడింది. సూక్ష్మ శరీరం లోపల, ఆత్మ ఉంది. ఇప్పుడు, ఈ స్థూల శరీరం నిష్ఫలమైన లేదా పని చేయలేక పోయినప్పుడు, అప్పుడు సూక్ష్మ శరీరం మరొక స్థూల శరీరమునకు నన్ను చేరవేస్తుంది. దీనిని ఆత్మ యొక్క పరిణామ పద్ధతి అంటారు. కానీ మనం సూక్ష్మ శరీరమును చూడలేము. మనలో ప్రతి ఒక్కరికి, మనము మన మనస్సును కలిగి ఉన్నామని మనకు తెలుసు, కానీ మనం మనస్సును చూడలేము. మనం బుద్ధిని చూడలేము, నా అహంభావమేమిటో నేను చూడలేను. కానీ అవి ఉన్నాయి. అందువల్ల మీ మొద్దు కళ్ళతో మీరు ప్రతిదాన్ని చూడవలసిన అవసరం లేదు. కళ్ళు, అవి పరిపూర్ణమైనవి కావు. ఉదాహరణకు ఈ గదికి ఇతర వైపు చీకటిగా ఉంటే నేను మిమ్మల్ని చూడలేను. నేను కళ్ళు కలిగి వున్నాను. మనము కళ్ళు కలిగి ఉన్నా, అది చాలా అపరిపూర్ణము. ఇది అన్ని పరిస్థితులలోనూ చూడలేదు. కొన్ని పరిస్థితులలోనే, మనము చూడవచ్చు. అందుచేత మనము కేవలం చూడటం ద్వారా నమ్మరాదు. కానీ ఒక విషయము, నేను నిన్ను చూడలేనప్పటికీ, మీరు నన్ను వినగలరు, లేదా మీరు వింటున్నారు అని నేను అర్థం చేసుకోగలను. చెవులు కళ్ళు కంటే బలంగా ఉంటాయి. మన అనుభవములో లేని విషయాల గురించి మనము వినవచ్చు. మనము చూడలేకపోయినా, అవి అస్సలు ఉనికిలో లేవని అర్థం కాదు. అదే ఉదాహరణ: నేను ఏది చూడలేనప్పటికీ, మనస్సు అంటే ఏమిటి, తెలివి అంటే ఏమిటి, అహంకారం అంటే ఏమిటి, కానీ దాని గురించి నేను వినవచ్చు. కాబట్టి పరిపూర్ణ జ్ఞానం శ్రవణము ద్వారా పొందబడుతుంది. కాబట్టి మనము జ్ఞానాన్ని, సంపూర్ణ జ్ఞానాన్ని, శ్రవణము ద్వారా అంగీకరిస్తాము. మరొక ఉదాహరణ: ఒక వ్యక్తి నిద్రిస్తున్నారని అనుకుందాం. ఆ సమయంలో, ఎవరైనా ఆయనని చంపడానికి వస్తే, ఆయన నిద్రిస్తున్నాడు, ఆయనకు తెలియదు. కానీ ఆయన స్నేహితుడు ఎవరైనా ఆయనని హెచ్చరించినట్లయితే, "నా ప్రియమైన స్నేహితుడా ఫలానా పేరుతో, ఎవరో నిన్ను చంపడానికి వస్తున్నారు. మేల్కో! "ఆయన వినగలడు, ఆయన మేల్కొని జాగ్రత్త పడతాడు. అందువలన, మన ఇతర ఇంద్రియాలు పని చేయలేకపోయినా, మన చెవి చాలా బలంగా ఉంది. అందువలన మీరు ప్రామాణికమైన వ్యక్తి నుండి శ్రవణము చేయడానికి ప్రయత్నించాలని సిఫార్సు చేయబడింది. విద్యా పద్ధతి కూడా ఇలానే ఉంది . ఎందుకు మీరు విశ్వవిద్యాలయానికి, పాఠశాలకు, కళాశాలకు వస్తారు? అనుభవజ్ఞుడైన ప్రొఫెసర్ నుండి శ్రవణము చేయడానికి. ఆయనకు తెలుసు, మీరు శ్రవణము ద్వారా జ్ఞానం పొందుతారు