TE/Prabhupada 0630 - దుఃఖించడానికి కారణం లేదు, ఎందుకంటే ఆత్మ శాశ్వతముగా ఉంటుంది
Lecture on BG 2.28 -- London, August 30, 1973
భక్తుడు: అనువాదము: “అన్ని సృష్టించబడిన జీవులు వారి ప్రారంభంలో అవ్యక్తముగా వుంటాయి, వారి తాత్కాలిక స్థితిలో వ్యక్తమవుతాయి, అవి నాశనమైనపుడు మళ్ళీ అవ్యక్తమవుతాయి. కాబట్టి దుఃఖించటానికి అవసరం ఏమి ఉంది?"
ప్రభుపాద: కాబట్టి ఆత్మ శాశ్వతము. కాబట్టి ఏదీ లేదు, దుఃఖించడానికి కారణం లేదు, ఎందుకంటే ఆత్మ శాశ్వతముగా ఉంటుంది. శరీరం నాశనమైనప్పుడు కూడా, దుఃఖించడానికి కారణం లేదు. ఇంక అది నమ్మని వారికి "ఆత్మ లేదు; ప్రారంభంలో ప్రతిదీ శూన్యము,....." ప్రారంభంలో శూన్యము ఉన్నది మధ్యలో ఇది వ్యక్తమైనది. మరలా ఇది శూన్యమైనది. శూన్యము నుండి శూన్యము, బాధపడటము ఎక్కడ ఉంది? ఇది కృష్ణుడు ఇచ్చే వాదన. రెండు విధాలుగా మీరు విలపించలేరు. అప్పుడు?
ప్రద్యుమ్న: (భాష్యము) " అయితే, వాదన కొరకు, మనము నాస్తిక సిద్ధాంతాన్ని అంగీకరిస్తాము, ఇంక బాధపడుటకు ఎటువంటి కారణము లేదు. ఆత్మ యొక్క ప్రత్యేక ఉనికి కాకుండా, సృష్టికి ముందు భౌతిక అంశాలు అవ్యక్తముగా ఉంటాయి. అవ్యక్తము కాని ఈ సూక్ష్మ స్థితినుండి వ్యక్తీకరణము వస్తుంది. ఎలా అయితే ఆకాశం నుండి, గాలి తయారవుతుంది; గాలి నుండి, అగ్ని ఉత్పత్తి అవుతుంది; అగ్ని నుండి, నీరు ఉత్పత్తి అవుతుంది; నీటి నుండి, భూమి స్పష్టమవుతుంది. భూమి నుండి, అనేక రకములైన ఆవిర్భావములను....."
ప్రభుపాద: ఇది సృష్టి యొక్క పద్ధతి. ఆకాశం నుండి, అప్పుడు ఆకాశం, ఆ పై గాలి, ఆ పై నీరు, తరువాత భూమి. ఇది సృష్టి యొక్క పద్ధతి. అవును.
ప్రద్యుమ్న: "ఉదాహరణకు, ఒక గొప్ప ఆకాశ హార్మ్యం భూమి నుండి వ్యక్తీకరించబడింది. అది విచ్ఛిన్నమైనపుడు, వ్యక్తము అవ్యక్తము అవుతుంది అంతిమదశలో అణువులుగా మిగిలిపోతుంది. శక్తి యొక్క పరిరక్షణ చట్టం మిగిలిపోయింది, కానీ ఆ సమయ వ్యవధిలో వస్తువులు సృష్టించబడ్డాయి నశింపబడ్డాయి. ఇది తేడా. అప్పుడు ఆవిర్భావము లేదా వినాశనము దశలో బాధపడుటకు కారణం ఏమి? ఎలాగైనా కూడా, అవ్యక్త దశలో కూడా, విషయాలు కోల్పోయింది లేదు. ప్రారంభంలో అంతిమంగా రెండు అంశాలు స్పష్టంగా ఉండవు, మధ్యలో మాత్రమే అవి స్పష్టంగా కనిపిస్తాయి, ఇది నిజమైన భౌతిక వ్యత్యాసం చూపించదు. భగవద్గీతలో చెప్పినట్లుగా (antavanta im dehah) వేదముల నిర్ధారణ మనము అంగీకరిస్తే, ఈ భౌతిక శరీరాలు ఆ సమయంలో నశిస్తాయి(nityasyoktah saririnah) కానీ ఆ ఆత్మ శాశ్వతమైనది, అప్పుడు మనం గుర్తుంచుకోవాలి శరీరం దుస్తుల వంటిది. అందువల్ల దుస్తులు మార్చడం గురించి విచారం ఎందుకు? భౌతిక శరీరముకు శాశ్వత ఆత్మకు సంబంధించి ఎటువంటి నిజమైన మనుగడ లేదు. ఇది ఒక కల వంటిది. కలలో మనం ఆకాశంలో ఎగురుతున్నట్లు లేదా రాజుగా రథంపై కూర్చున్నట్లు ఆలోచించవచ్చు, కానీ మనము మేల్కొన్నప్పుడు మనం చూడవచ్చు మనం ఆకాశంలో కానీ రథంపై కానీ లేము. వేద జ్ఞానం ఆత్మ - సాక్షాత్కారమును ప్రోత్సహిస్తుంది. భౌతిక శరీర ఉనికి లేదు అనే దానికి ఆధారము . కాబట్టి ఏ సందర్భంలోనైనా, ఆత్మ యొక్క ఉనికిని నమ్మినా లేదా ఆత్మ యొక్క ఉనికిని నమ్మకపోయినా, శరీరం యొక్క నష్టానికి శోకించుటకు కారణం లేదు."