TE/Prabhupada 0631 - నేను శాశ్వతముగా ఉన్నాను, శరీరం శాశ్వతమైనది కాదు. ఇది సత్యము



Lecture on BG 2.28 -- London, August 30, 1973


ఒక విషయం ఈ సంబంధములో అది రాత్రి నేను కలలో ఉన్నప్పుడు నేను ఈ శరీరమును మర్చిపోతాను. ఈ శరీరం, కలలో, నేను వేరే ప్రదేశంలోకి వెళ్ళాను అని చూస్తున్నాను, వివిధ వ్యక్తులతో మాట్లాడటం, నా పరిస్థితి భిన్నంగా ఉంటుంది. కానీ ఆ సమయంలో నా శరీరం అపార్ట్మెంట్లో మంచము మీద పడుకొని ఉన్నదని గుర్తు ఉండదు కానీ మనకు ఈ శరీరము గుర్తు ఉండదు. ఇది అందరి అనుభవం. అదేవిధముగా, మీరు తిరిగి వచ్చినప్పుడు, మంచం నుండి లేచిన తరువాత ఉదయం మేల్కొనే దశలో, నేను నా కలలో సృష్టించిన అన్ని శరీరాలను మరచిపోతాను. కాబట్టి ఏది సరైనది? ఇది సరైనదా? ఈ శరీరం సరైనదా, లేదా ఆ శరీరం సరైనదా? ఎందుకంటే రాత్రి సమయంలో నేను ఈ శరీరాన్ని మరచిపోతాను, పగటిపూట నేను కలలోని ఇతర శరీరం మరచిపోతాను. కాబట్టి అవి రెండూ సరైనవి కాదు. ఇది కేవలం భ్రాంతి. కానీ నేను నిజం. ఎందుకంటే నేను రాత్రి సమయం చూస్తాను, పగటిపూట నేను చూస్తున్నాను. నేను శాశ్వతముగా ఉన్నాను, శరీరం శాశ్వతమైనది కాదు. ఇది సత్యము. Antavanta ime dehā nityasyoktāḥ śarīriṇaḥ ( BG 2.18) శరీరనః శరీరము యొక్క యజమాని, శాశ్వతమైనది, కాని శరీరము కాదు. చాలా రకాలుగా, కృష్ణుడు శరీరం యొక్క భౌతిక స్థితి గురించి వివరిస్తున్నాడు. కానీ జ్ఞానం లేని చాలా తక్కువ తెలివి గల వారు, ఇది వారు అర్థం చేసుకోవడం చాలా కష్టము. లేకపోతే, విషయాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ విషయం చాలా స్పష్టంగా ఉంది. రాత్రిపూట నేను ఈ శరీరాన్ని మరచిపోతున్నాను, పగటిపూట రాత్రి శరీరాన్ని నేను మరచిపోతాను. ఇది సత్యము. అదేవిధముగా, నేను నా చివరి జన్మ యొక్క శరీరమును మరిచిపోతాను, ఇంతకు ముందు జన్మ, లేదా భవిష్యత్తు శరీరం గురించి నాకు తెలియకపోవచ్చు కాని నేను జీవించి ఉన్నాను, శరీరం మారవచ్చు, కానీ నేను తాత్కాలికమైన మరో శరీరాన్ని అంగీకరించాలి. కానీ నేను, నేను జీవించి ఉన్నాను అంటే, నేను ఒక శరీరం కలిగి ఉన్నాను. అది ఆధ్యాత్మిక శరీరం.

కాబట్టి ఆధ్యాత్మిక శరీరము ఉంది, ఆధ్యాత్మిక పురోగతి అంటే మొదట నేను నా ఆధ్యాత్మిక గుర్తింపును తెలుసుకోవడం. ఉదాహరణకు సనాతన గోస్వామి తన మంత్రి పదవి నుండి విరమణ తీసుకొని, తరువాత శ్రీ చైతన్య మహాప్రభు దగ్గరకు వెళ్లారు. అందువల్ల ఆయన మొదట అన్నాడు, ke āmi, kene āmāya jāre tāpa-traya: వాస్తవమునకు, నేను ఏమిటో నాకు తెలియదు, నేను జీవితపు బాధాకరమైన పరిస్థితికి ఎందుకు గురవుతున్నానో తెలియదు. అందువల్ల జీవితపు బాధాకరమైన స్థితి ఈ శరీరం. ఎందుకంటే నేను కలలో కూడా. నాకు మరొక శరీరం వచ్చినప్పుడు, కొన్నిసార్లు మనము చాలా పొడవైన వెదురు లేదా ఎత్తయిన పర్వతం పైన ఉన్నామని కనుగొంటాము నేను ఇప్పుడు క్రింద పడిపోతున్నాను. నేను భయపడ్డాను, కొన్నిసార్లు నేను ఏడుస్తాను, "ఇప్పుడు, నేను ఇప్పుడు పడిపోతున్నాను." కాబట్టి ఈ శరీరం, ఈ భౌతికము శరీరం, నేను ఏ శరీరమునకు చెందిన వాడిని, నేను ఏది... వాస్తవమునకు, నేను ఈ ఏ శరీరాలకు చెందినవాన్ని కాదు. నాకు ప్రత్యేక ఆధ్యాత్మిక శరీరం ఉంది.

కాబట్టి ఈ మానవ జీవితం ఆ పరిపూర్ణముకు ఉద్దేశించబడింది, అది నేను ఈ భౌతిక శరీరం కాదు, నాకు ఒక ఆధ్యాత్మిక శరీరం ఉంది. అప్పుడు తదుపరి ప్రశ్న ఉంటుంది, "అప్పుడు నా పని ఏమిటి?" కొన్ని భౌతిక పరిస్థితుల్లో ప్రస్తుత శరీరంలో నేను ఆలోచిస్తున్నాను, ఇది నా శరీరం, ఈ శరీరం ఈ దేశం లేదా ఈ కుటుంబం యొక్క కొన్ని పరిస్థితుల కింద ఉత్పత్తి అయినది; అందువలన, "ఇది నా కుటుంబం, ఇది నా దేశం, ఇది నా దేశం." ప్రతిదీ దేహభావన లో నేను ఈ శరీరాన్ని కాదు, అప్పుడు ఈ శరీరానికి సంబంధించి, నా కుటుంబం లేదా నా దేశం లేదా నా సమాజం గాని, లేదా నా ఇతర సంబంధాలు, అవి కూడా మిథ్య ఎందుకంటే శరీరం మిథ్య