TE/Prabhupada 0634 - కృష్ణుడు మాయ శక్తి ద్వారా ఎన్నడూ ప్రభావితం కాడు



Lecture on BG 2.28 -- London, August 30, 1973


అందువల్ల, వ్యాసదేవుడు చూసారు, apasyat purusam purnam. ఆయన చూసాడు.... విమానంలో వలె, మీరు మేఘం పైన వెళ్తారు. సూర్యుడు మేఘం వల్ల అసలు ప్రభావితం కాడు. విమానం క్రింద మీరు మేఘాల విస్తారమైన సమూహాన్ని చూస్తారు. అదే విధముగా, మాయ కృష్ణున్ని ప్రభావితం చేయలేదు. అందువల్ల, భగవద్గీత చెప్తుంది daivi hy esa gunamayi mama maya. మమ మాయ ( BG 7.14) కృష్ణుడు చెప్తారు, "నా మాయ శక్తి". కృష్ణుడు మాయ శక్తి ద్వారా ఎన్నడూ ప్రభావితం కాడు. సరిగ్గా మేఘమువలె. కానీ మాయావాది తత్వవేత్తలు, వారు చెప్తారు నిరాకార పరమసత్యం వచ్చినప్పుడు, అవతరించినప్పుడు, వారు కూడా అవతారం అంగీకరించారు, కానీ వారి తత్వము అంతిమంగా పరమ సత్యము నిరాకారము. ఆయన ఒక వ్యక్తిగా కనిపించినప్పుడు, ఆయన మాయా శరీరాన్ని అంగీకరించారు. ఇది మాయావాదము. కృష్ణుని భగవంతునిగా అంగీకరించవచ్చు, కానీ ఆయన భౌతిక శరీరాన్ని అంగీకరించారు. అంటే వారు కృష్ణుడిని సాధారణ జీవితో పోల్చాలని అనుకుంటున్నారు, అది భగవద్గీతలో ఖండించబడినది. ఇలా చెప్పబడింది avajananti mam mudha manusim tanum asritam ఎందుకంటే కృష్ణుడు తన వాస్తవ రూపంలో వస్తాడు... వాస్తవరూపం రెండు చేతులు కలిగినది. ఇది బైబిల్లో కూడా అంగీకరించబడింది: "మనుషుడు దేవుని స్వరూపము నుండి చేయబడ్డాడు". భగవంతుడు కూడా రెండు చేతులు కలిగి ఉన్నాడు. నాలుగు-చేతులు ఉన్న విష్ణువు రూపం కూడా వాస్తవ రూపం కాదు. విష్ణువు రూపం సంకర్షణుడి యొక్క రెండవ సాక్షాత్కారం. కాబట్టి కృష్ణుడు ఎప్పుడూ మాయ చేత ప్రభావితం కాడు. ఇది విషయము