TE/Prabhupada 0641 - కానీ భక్తుడికి కోరికలు ఉండవుLecture on BG 6.1 -- Los Angeles, February 13, 1969


భక్తుడు: ఆరవ అధ్యాయము. సాంఖ్య యోగము. శ్లోకము సంఖ్య ఒకటి. దివ్యమైన భగవంతుడు ఇలా చెప్పాడు, 'తాను చేసిన కర్మఫలముల యందు ఆసక్తి కలిగియుండక, చేయవలసిన కార్యములను చేయువాడే నిజమైన సన్యాసి కాగలడు. అతడే నిజమైన యోగి. అంతియేగాని కేవలము అగ్నిని రగలింపక, మరియు కర్మలను ఆచరింపక యుండెడివాడు యోగి కాజాలడు."( BG 6.1) భాష్యము. ఈ అధ్యాయంలో భగవంతుడు అష్టాంగ యోగ పద్ధతి అనేది మనస్సును మరియు ఇంద్రియాలను నియంత్రించడానికి ఒక సాధనంగా వివరించుచున్నాడు. ఏదేమైనా, సాధారణ ప్రజలకు, ప్రత్యేకంగా కలి యుగములో ఆచరించుట చాలా కష్టము. అష్టాంగ యోగ పద్ధతి ఈ అధ్యాయంలో సిఫారసు చేయబడినప్పటికీ, కర్మ-యోగ పద్ధతి లేదా కృష్ణ చైతన్యములో కర్మ చేయుటయే ఉత్తమమని భగవంతుడు నొక్కి చెప్పుచున్నాడు ప్రతి ఒక్కరూ తన కుటుంబం మరియు వారి సామగ్రిని నిర్వహించుకోవడానికి ఈ ప్రపంచంలో పనిచేస్తారు, కానీ ఎవరు తన కొరకు లేదా తన వారి కొరకు కొoత వ్యక్తిగత తృప్తి లేదా స్వార్ధము లేకుండా కర్మ చేయటము లేదు, పరిపూర్ణత యొక్క ప్రమాణం కృష్ణ చైతన్యములో కర్మలు చేయుట, కర్మ ఫలాలను ఆస్వాదించడానికి కాదు. కృష్ణ చైతన్యములో కర్మ చేయుట ప్రతి జీవి యొక్క బాధ్యత, ఎందుకంటే మనము దేవాదిదేవుని యొక్క అంశలము. మొత్తం శరీర సంతృప్తి కోసం శరీరం యొక్క భాగాలు పని చేస్తాయి. శరీరం యొక్క అవయవాలు తమ సంతృప్తి కోసం పనిచేయవు కానీ మొత్తం శరీరము సంతృప్తి కోసం పని చేస్తాయి. అదేవిధముగా జీవి, దేవాదిదేవుని సంతృప్తి కోసం కర్మ చేస్తుంటే, తన వ్యక్తిగత సంతృప్తి కోసం కాకుండా అతడు ఖచ్చితమైన సన్యాసి, సంపూర్ణ యోగి.

"కొన్నిసార్లు సన్యాసిలు కృత్రిమంగా వారు అన్ని భౌతిక విధుల నుండి విముక్తి పొందారని భావిస్తారు, అందువల్ల వారు అగ్ని-హోత్ర యజ్ఞములు, అగ్నితో చేయు యజ్ఞములనీ నిర్వర్తించడము మానేస్తారు. "

ప్రభుపాద: పవిత్రము అవడము కోసం అందరూ చేయవలసిన కొన్ని యజ్ఞాలు ఉన్నాయి. కాబట్టి ఒక సన్యాసికి యజ్ఞాలు చేయవలసిన అవసరం లేదు. కాబట్టి ఆచారపరమైన యజ్ఞము చేయడము ఆపటం ద్వారా, కొన్నిసార్లు వారు విముక్తి పొందారని భావిస్తారు. వాస్తవానికి, ఆయన ప్రామాణిక కృష్ణ చైతన్య స్థితికి రాకపోతే, విముక్తి యొక్క ప్రశ్నే లేదు. చదవడము కొనసాగించు.

భక్తుడు: "వాస్తవానికి, వారి ఆసక్తి వారి లక్ష్యము నిరాకర బ్రహ్మణ్ తో ఒకటిగా మారడము."

ప్రభుపాద: అవును. కోరిక ఉంది. నిరాకారవాదులు, వారికి ఒక కోరిక ఉంది, ఆ మహోన్నతమైన నిరాకర వ్యక్తితో ఒకటి కావడము. కానీ భక్తుడికి కోరికలు ఉండవు. కృష్ణుడి సంతృప్తి కోసం కృష్ణుడిని సేవలందించటానికి ఆయన తనను తాను నిమగ్నం చేసుకుంటాడు. వారికి తిరిగి ఏదీ అవసరం లేదు. ఇది పవిత్రమైన భక్తి. ఉదాహరణకు చైతన్య మహా ప్రభు చెప్పినట్టే, na dhanaṁ na janaṁ na sundarīṁ kavitāṁ vā jagadīśa kāmaye: ( CC Antya 20.29 Siksastaka 4) నేను ఏ సంపదను కోరుకోను,చాల మంది అనుచరులను నేను కోరుకోను, నేను ఏ చక్కని భార్యను కోరడము లేదు. కేవలము మీ సేవలో నన్ను నిమగ్నమవ్వనీయండి. " అంతే. అది భక్తి-యోగ పద్ధతి. ప్రహ్లాద మహారాజును భగవంతుడు నరసింహ స్వామి అడిగినప్పుడు, "నా ప్రియమైన పుత్రుడా, నీవు నా కొరకు చాలా బాధపడ్డావు, కాబట్టి నీకు కావలసినది ఏదైనా, నీవు దానిని అడుగు. "కానీ ఆయన నిరాకరించాడు. నా ప్రియమైన ప్రభు, నేను మీతో వ్యాపారము చేయటము లేదు, నా సేవ కోసం నేను మీ నుండి వేతనం తీసుకొను. "ఇది పవిత్రమైన భక్తి అంటే. కాబట్టి యోగులు లేదా జ్ఞానులు, వారు దేవాదిదేవునితో ఒకటి కావాలని కోరుకుంటున్నారు ఎందుకు దేవాదిదేవునితో ఒకటి అవడము? ఎందుకంటే వారికి చేదు అనుభవం ఉన్నది, భౌతిక దుఃఖములను వేరు చేయడం ద్వారా. కానీ భక్తుడికి అలాంటి బాధ లేదు. భక్తుడు, భగవంతుడు నుండి వేరుగా ఉనప్పటికీ, ఆయన భగవంతుడు యొక్క సేవలో పూర్తిగా ఆనందిస్తున్నాడు. చదవడము కొనసాగించండి.

భక్తుడు: "అలాంటి కోరిక, అన్ని భౌతిక కోరికల కంటే పెద్ద కోరిక, కానీ అది స్వార్థము లేకుండా లేదు. అదేవిధముగా సగము కళ్ళు తెరిచి యోగ పద్ధతిను అభ్యసించే మార్మిక యోగి, అన్ని భౌతిక కార్యక్రమాలను నిలిపివేసి, తన వ్యక్తిగత స్వార్థము కోసం కొంత సంతృప్తిని కోరుకుంటాడు. కానీ కర్మ చేస్తున్న వ్యకి ...

ప్రభుపాద: వాస్తవమునకు యోగులకు కొంత భౌతిక శక్తి కావాలి. అది యోగ యొక్క పరిపూర్ణము. పరిపూర్ణము కాదు, అది పద్ధతులలో ఒకటి. మీరు వాస్తవమునకు యోగా యొక్క నియమ నిబంధనలను అభ్యసిస్తే, అప్పుడు మీరు ఎనిమిది రకాల సిద్ధులను పొందవచ్చు. మీరు పత్తిమూట కంటే తేలిక అవ్వవచ్చు. మీరు రాయి కన్నా భారము అవ్వవచ్చు. మీరు ఏదైనా పొందవచ్చు తక్షణమే, మీకు నచ్చినది ఏదైనా పొందవచ్చు. కొన్నిసార్లు మీరు ఒక లోకమును కూడా సృష్టించవచ్చు. ఇటువంటి శక్తివంతమైన యోగులు ఉన్నారు. విశ్వామిత్ర యోగి, ఆయన వాస్తవానికి చేశాడు. ఆయన తాటిచెట్టు నుండి మనిషిని పొందాలని కోరుకున్నాడు. తల్లి గర్భం నుండి ఎందుకు మనిషిని పుట్టించాలి, పది నెలలు జీవించి, గర్భములో ఉన్న తరువాత? వారిని పండు లాగే ఉత్పత్తి చేయవచ్చు. "ఆయన దానిని అలా చేసాడు కొందరు యోగులు చాలా శక్తివంతమైవారు, వారు చేయగలరు. కాబట్టి ఇవి అన్ని భౌతిక శక్తులు. ఇటువంటి యోగులు కూడా, వారు కూడా పతనమయ్యారు. ఎంతకాలం ఈ భౌతిక శక్తిపై మీరు ఉండవచ్చు? కాబట్టి భక్తి-యోగులు, వారు అలాంటిదేమీ కోరుకోరు. చదవడము కొనసాగించు. అవును.

భక్తుడు: "కానీ కృష్ణ చైతన్యములో కర్మ చేసే వ్యక్తి దేవాదిదేవుని సంతృప్తి కోసం స్వార్థము లేకుండా పనిచేస్తాడు. ఒక కృష్ణ చైతన్యము కలిగిన వ్యక్తి తన స్వయం సంతృప్తిని కోరుకోడు. విజయము కొరకు ఆయన ప్రమాణం కృష్ణుడి సంతృప్తి. అందువల్ల ఆయన పరిపూర్ణ సన్యాసి లేదా పరిపూర్ణ యోగి. కృష్ణ చైతన్యము యొక్క అత్యంత పరిపూర్ణ ప్రతీక అయిన చైతన్య మహాప్రభు, ఈ విధముగా ప్రార్థిస్తాడు: సర్వశక్తిమంతుడైన ప్రభు, నాకు సంపదను కూడబెట్టడానికి, అందమైన స్త్రీలను ఆస్వాదించడానికి నాకు కోరిక లేదు. లేదా నేను అనేక అనుచరులను కోరుకోవడము లేదు? నేను నా జీవితంలో, అన్ని జన్మలలో మీ భక్తియుక్త సేవ అనే నిర్హేతుక కృపను కోరుచున్నాను"

ప్రభుపాద: కాబట్టి భక్తుడు మోక్షం కూడా కోరుకోడు. ఎందుకు భగవంతుడు చైతన్య చెప్తున్నారు "జన్మ, జన్మలకి? అని మోక్షం కోరుకొనే వారు, వారు ఆపడానికి కోరుకుంటున్నారు, శూన్యవాదులు, వారూ ఈ భౌతికము జీవన విధానమును ఆపడానికి కోరుకుంటున్నారు. కానీ చైతన్య మహా ప్రభు, "జన్మ జన్మలకి." అంటే, ఆయన జన్మ జన్మలకి అన్ని రకములైన భౌతిక కష్టాలను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆయన కోరుకుంటున్నారు? ఆయన కేవలం భగవంతుడు యొక్క సేవ లో నిమగ్నమవ్వాలని కోరుకుంటున్నాడు. అది పరిపూర్ణమైనది. మీరు ఇక్కడ ఆపవచ్చు అని అనుకుంటున్నాను. ఇక్కడ ఆపండి