TE/Prabhupada 0642 - కృష్ణ చైతన్యము ఈ భౌతిక శరీరాన్ని ఆధ్యాత్మిక శరీరముగా మారుస్తుంది
Lecture on BG 6.1 -- Los Angeles, February 13, 1969
భక్తుడు: ప్రభుపాద? ఆత్మ వెంట్రుక కొనలో పదివేలవ వంతు అని మీరు చెప్పారు. ఆధ్యాత్మిక ఆకాశంలో, ఆత్మ ఇప్పటికీ అంత పెద్దదిగా ఉంటుందా?
ప్రభుపాద: హమ్? భక్తుడు: ఆత్మ, ఆయన తిరిగి వెళ్ళినప్పుడు ...
ప్రభుపాద: ఇది ఆయన స్వరూప స్థితి. ఆధ్యాత్మిక ఆకాశంలో లేదా భౌతిక ఆకాశంలో, అతడు అదే రకముగా ఉంటాడు. కాని భౌతిక ప్రపంచంలో భౌతిక రూపమును మీరు పొందినప్పుడు, అదేవిధముగా ఆధ్యాత్మిక ప్రపంచంలో మీరు ఒక ఆధ్యాత్మిక శరీరమును పొందవచ్చు. మీకు అర్థము అవుతుందా? మీ స్థితి ఏమిటంటే మీరు ఒక చిన్న కణము, కాని ఆత్మ విస్తరించవచ్చు. భౌతిక ప్రపంచంలో ఈ విస్తరణ పదార్థముతో సంబంధం కలిగి ఉన్నప్పుడు జరుగుతుంది. ఆధ్యాత్మిక ప్రపంచంలో, ఆ విస్తరణ ఆత్మతో చేయవచ్చు. ఇక్కడ భౌతిక ప్రపంచంలో నేను ఆత్మను. నేను ఈ శరీరానికి భిన్నంగా ఉన్నాను, ఎందుకంటే ఈ శరీరము పదార్థము మరియు నేను జీవిని. నేను జీవ శక్తిని, కానీ ఈ భౌతిక శరీరము జీవ శక్తి కాదు. ఆధ్యాత్మికం ప్రపంచంలో ప్రతిదీ జీవము కలిగి ఉన్నది. జీవము లేని పదార్థము లేదు. అందువలన శరీరము కూడా ఆధ్యాత్మికం. ఉదాహరణకు నీటితో నీళ్ళు కలిపితే, నీరు, అంతే కాని నీరు మరియు నూనె కు- వ్యత్యాసం ఉంటుంది. అదేవిధముగా, నేను ఆత్మను, నేను చమురు అనుకుందాము. నేను నీటిలో ఉన్నాను, కాబట్టి వ్యత్యాసం ఉంది. కాని నన్ను చమురులో పెట్టినట్లయితే, అప్పుడు ప్రతిదీ సరిగ్గా ఉంటుంది. కాబట్టి నిరాకార వాదులు, వారు శరీరాన్ని పొందలేరు వారు కేవలం ఆత్మ కణంగా ఉంటారు. అది వారి ఆలోచన. కాని మనము వైష్ణవులము, మనము కృష్ణుడిని సేవించాలని కోరుకుంటున్నాము, అందువలన మనకు చేతులు, కాళ్ళు, మరియు నోరు మరియు నాలుక అవసరం. కాబట్టి మనకు అలాంటి శరీరాన్ని ఇచ్చారు. మీరు తల్లి గర్భంలో నుండి ఈ శరీరాన్ని పొందుతున్నట్లుగానే, ఆధ్యాత్మిక ప్రపంచంలో మనము శరీరాన్ని పొందుతాము. తల్లి గర్భంలో నుండి కాదు , కాని పొందడానికి పద్ధతి ఉంది, మీరు పొందవచ్చు.
భక్తుడు: కృత్రిమంగా అది చేయలేము. ఎవరూ మోసము చేయలేరు.
ప్రభుపాద: కృత్రిమంగా?
భక్తుడు: అవును, ఎవరూ కేవలం తన సొంత యుక్తి ద్వారా ఒక ఆధ్యాత్మిక శరీరమును పొందలేరు, నేను ఆధ్యాత్మిక శరీరమును పొందుతాను. సాధన ద్వారా.
ప్రభుపాద: ఈ కృష్ణ చైతన్య సాధన ఈ భౌతిక శరీరాన్ని ఆధ్యాత్మిక శరీరముగా మారుస్తుంది. ఇది ఎలా జరుగుతుంది? ఉదాహరణను నేను అనేక సార్లు, ఇచ్చాను మీరు ఇనుమును అగ్నిలో ఉంచుతారు. ఎంత వేడిగా ఉంటే, అది అగ్ని అవుతుంది. ఇనుము రెడ్ హాట్గా ఉన్నప్పుడు అంటే - ఇనుము అగ్ని లక్షణాలు పొందినప్పుడు- మీరు ఎక్కడైనా ఇనుమును తాకితే, అది అగ్నిలా పని చేస్తుంది. అదేవిధముగా, ఈ శరీరము, అది భౌతికముగా ఉన్నప్పటికీ - చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒక లోహము, విద్యుతీకరించినప్పుడు, లోహము విద్యుత్ కాదు. కాని అది విద్యుతీకరించినప్పుడు, మీరు లోహమును తాకితే, వెంటనే మీకు విద్యుత్ షాక్ వస్తుంది. ఉదాహరణకు విద్యుత్ వైర్ వలె . రాగి, అది రాగి. కాని అది విద్యుద్దీకరణ జరిగిన వెంటనే, మీరు దానిని తాకితే, మీరు విద్యుత్ షాక్ ను పొందుతారు. చాలా ఉదాహరణలు ఉన్నాయి. అదేవిధముగా, మీ శరీరం ఆధ్యాత్మికం అయితే, అప్పుడు, భౌతిక చర్య ఇక ఉండదు. భౌతిక కర్మ అంటే ఇంద్రియ తృప్తి. కాబట్టి వ్యక్తులు ఆధ్యాత్మికం అవుతున్న కొద్ది, వారి భౌతిక కోరికలు శూన్యము అవుతాయి. ఇంక భౌతిక కార్యక్రమాలు ఉండవు. మీరు ఎలా చేయవచ్చు? అదే ఉదాహరణ: మీరు ఇనుమును నిప్పులలో నిరంతరం ఉంచండి. మీరు కృష్ణ చైతన్యములో నిరంతరం ఉండవలసి ఉంటుంది. అప్పుడు మీ ఈ శరీరం కూడా, భౌతిక శరీరం కూడా ఆధ్యాత్మికం అవుతుంది. ఒక సంస్కృత వ్యాకరణ చట్టం ఉంది దానిని mayat అని పిలుస్తారు, mayat-pratyaya. mayat అర్థం, svarṇamaya లాగా ఒక పదం ఉంది. స్వర్ణమయ అంటే బంగారము. గోల్డెన్ అని పిలువబడుతుంది, అది స్వచ్చమైన బంగారముతో తయారు చేయబడినప్పుడు, అది కూడా బంగారము. అది వేరే దేనితోనైనా తయారు చేస్తే, కాని పైన పూత బంగారము అయితే, పెద్ద పరిమాణములో బంగారం, అది కూడా బంగారమే. అదేవిధముగా, ఈ భౌతిక శరీరము పూర్తిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఉన్నప్పుడు, ఇది కూడా ఆధ్యాత్మికము. కాబట్టి సాధువులు. మీ దేశంలో ప్రతి ఒక్కరిని చనిపోయిన తరువాత సమాధి చేస్తారు, కాని భారతదేశంలో వేదముల పద్ధతి ప్రకారం, కేవలం చాలా ఉన్నతమైన వ్యక్తులను, భక్తులు, వారి శరీరమును కాల్చరు. అది ఆధ్యాత్మికంగా పరిగణించబడుతుంది. ఒక సన్యాసి యొక్క శరీరమును కాల్చరు ఎందుకంటే అది ఆధ్యాత్మికము ఎలా అది ఆధ్యాత్మికము అవుతుంది? ఇదే ఉదాహరణ: భౌతిక కార్యక్రమాలు ఏవి లేనప్పుడు, కేవలం కృష్ణ చైతన్యములో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటే, అ శరీరము ఆధ్యాత్మికం.
కాబట్టి ఈ ప్రపంచము కృష్ణ చైతన్యముతో పూర్తిగా నిండినట్లయితే, ఎవరూ తమ ఇంద్రియ తృప్తి కోసము పని చేయకపోతే కేవలము కృష్ణుడి సంతృప్తి కోసం, ఈ ప్రపంచం వెంటనే ఆధ్యాత్మిక ప్రపంచం అవుతుంది. దీని అర్థం చేసుకోవడానికి కొంచము సమయం అవసరం. కృష్ణుడికి ఉపయోగించేది ఏదైనా, కేవలం కృష్ణుడి సంతృప్తి కోసం, ఇది ఆధ్యాత్మికం. కృష్ణుడి గురించి మాట్లాడుకోవటానికి మనము ఈ మైక్రోఫోన్ను ఉపయోగిస్తున్నట్లుగానే, అప్పుడు ఇది కూడా ఆధ్యాత్మికము. లేకపోతే ఈ ప్రసాదము మరియు సాధారణ ఆహారం మధ్య వ్యత్యాసం ఏమిటి? మనము ప్రసాదం వితరణ చేస్తున్నాం, ప్రజలు చెప్తారు, "ఎందుకు ఇది ప్రసాదము? మనము అదే పండును తింటాము, మీరు కేవలం ముక్కలుగా కట్ చేస్తే అది ప్రసాదం అయింది? " వారు చెప్పగలరు. ఇది ఎలా ప్రసాదము అయింది? కాని అది ప్రసాదం. మీరు ఈ ప్రసాదము తింటూ ఉండండి, మీరు ఆధ్యాత్మికముగా మారుతారు. వాస్తవానికి ఇది ప్రసాదం. ఉదాహరణకు అదే ఉదాహరణ లాగానే, నేను ఇనుము తీసుకుంటే, వేడి ఇనుమును తీసుకుంటే, నేను "ఇది అగ్ని." అని అంటే ఎవరైనా చెప్పవచ్చు, "ఎందుకు అది అగ్ని ? ఇది ఇనుము.. నేను అడుగుతాను "తాకండి." మీరు చూడండి? ఇవి ముడి ఉదాహరణలు, కాని అది... మీ కార్యక్రమాలు - నిజానికి ఉన్నత చైతన్యములో పదార్థము లేదు. పదార్థము లేదు, ప్రతిదీ ఆధ్యాత్మికం ఎందుకంటే కృష్ణుడు ఆధ్యాత్మికం. కృష్ణుడు మొత్తం ఆత్మ, ఈ పదార్థము కృష్ణుడి శక్తులలో ఒకటి. అందువలన అది కూడా ఆత్మ. కాని ఇది తప్పుగా ఉపయోగించి నందువలన, కృష్ణుడి సేవ కోసము కాకుండా, అందువలన ఇది పదార్థము . కాబట్టి మన కృష్ణ చైతన్య ఉద్యమం ఆధ్యాత్మికం చేయటానికి, మొత్తం విషయమును తిరిగి ఆధ్యాత్మికం చేయటానికి . మొత్తము సాంఘిక స్థితిని, రాజకీయ స్థితిని, ఏదైనా. ఇది చాలా మంచి ఉద్యమం. ప్రజలు దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. వాస్తవానికి ఇది మొత్తం ప్రపంచాన్ని ఆధ్యాత్మికం చేస్తుంది - అయితే అది సాధ్యం కాదు, అయితే ధ్యేయం ఆ విధముగా ఉంది కాని కనీసము ప్రతి ఒక్కరూ తిరిగి ఈ ఆధ్యాత్మికం అయ్యే పద్ధతిని ప్రయత్నిస్తే, ఆయన జీవితం పరిపూర్ణమవుతుంది.