TE/Prabhupada 0647 - యోగ అంటే దేవాది దేవునితో సంబంధము కలిగి ఉండుట
Lecture on BG 6.2-5 -- Los Angeles, February 14, 1969
భక్తుడు: శ్లోకం సంఖ్య నాలుగు. "ఒక వ్యక్తి యోగ సాధించినట్లు చెబుతారు అన్ని భౌతిక కోరికలను వదిలిపెట్టినప్పుడు, అతడు ఇంద్రియ తృప్తి అనుభూతి కోసం పనిచేయడం లేదా ఫలాపేక్ష కార్యక్రమాలలోను పాల్గొనడు ( BG 6.4) "
ప్రభుపాద: అవును. ఇది యోగ పద్ధతి, యోగ సాధన యొక్క పరిపూర్ణ దశ. ఒక వ్యక్తి యోగకు చేరుకున్నట్లు చెబుతారు. అంటే, యోగ అంటే సంబంధము. ఉదాహరణకు ఇదే ఉదాహరణ. ఈ వేలు నా శరీరం నుండి బయటపడిందని అనుకుందాం. లేదా ఈ వేలును తీసుకోకండి, ఏదైనా యంత్ర భాగం తీసుకోండి. ఇది పనిలేకుండా ఉంది, యంత్రం నుంచి విడిపోయింది. వెంటనే మీరు యంత్రంతో చేర్చినప్పుడు, ఇది వివిధ అవసరాలకు పనిచేస్తుంది. Cutacut, cutacut, cutacut, ఇది పనిచేస్తుంది. యోగా అంటే, ఇది కలపబడినది. అదేవిధముగా, ఇప్పుడు మనము వేరు అయ్యాము. ఈ భౌతిక కార్యక్రమాలు, ఫలాపేక్ష కార్యక్రమాలు, అవి కేవలం సమయం వృధా అని వివరించారు. Mūḍha. Mūḍha. వారిని భగవద్గీతలో ముర్ఖుడిగా వర్ణించారు. Mūḍha అంటే దుష్టుడు. ఎందుకు? అటువoటి గొప్ప వ్యాపారవేత్త? మీరు మూర్ఖుడు అంటారా, ఎందుకు? ఆయన రోజు వేల డాలర్లు సంపాదిస్తున్నాడు. కానీ వారు మూర్ఖులుగా వర్ణించబడ్డారు, మూర్ఖ ఎందుకంటే వారు చాలా కష్టపడి పనిచేస్తున్నారు, కాని ఆయన ఏమి ఆనందిస్తున్నారు? ఆయన అదే మొత్తం తినడం, నిద్రపోవడము, సంభోగము చేయడము ఆనందిస్తున్నాడు. అంతే. వలె... రోజువారీ మిలియన్ల డాలర్లు సంపాదించే వ్యక్తి, ఆయన మిలియన్ మహిళలతో ఆనందించగలడని కాదు. కాదు అది సాధ్యం కాదు. లైంగిక శక్తి పది డాలర్లు సంపాదించే వాడితో సమానముగా ఉంటుoది. పది డాలర్ల ఆదాయం సంపాదించే మనిషి తినే ఆహారముతో సమానముగా ఉంటుంది అతను తినగలిగే శక్తి. కాని ఆయన "నా జీవిత ఆనందం పది డాలర్లు సంపాదించే వ్యక్తితో సమానముగా ఉంది" అని ఆలోచించడు అప్పుడు రోజువారీ మిలియన్ డాలర్ల సంపాదించుటకు నేను ఎందుకు కష్టపడుతున్నాను? ఎందుకు నేను ఆ విధముగా నా శక్తిని వృధా చేసుకుంటున్నాను? " మీరు చూడండి? వారిని మూర్ఖుడు అని అంటారు.
Na māṁ duṣkṛtinaḥ - నిజానికి ఆయన నిమగ్నమై ఉండాలి, ఆయన రోజువారీ మిలియన్ల డాలర్లు సంపాదించినప్పుడు, ఆయన తనను తాను నిమగ్నమై ఉండాలి, తన సమయం మరియు శక్తి, దేవుణ్ణి అర్థంచేసుకోవటము ఎలా, జీవితం యొక్క ఉద్దేశ్యం ఏమిటి. ఎందుకంటే ఆయనకు ఎటువంటి ఆర్థిక సమస్య లేదు. అందువలన ఆయనకు తగినంత సమయం ఉంది, ఆయన కృష్ణ చైతన్యము లేదా దేవుడు చైతన్యములో ఉపయోగించుకోవచ్చు. కాని ఆయన ఆ విధముగా పాల్గొనడు. అందువలన ఆయన మూర్ఖుడు . Mūḍha అంటే వాస్తవానికి మూర్ఖుడు అంటే గాడిద. తన బుద్ధి చాలా చక్కగా లేదు. ఒక వ్యక్తి యోగా సాధించినట్లు చెబుతారు, అన్ని భౌతిక కోరికలను త్యజించినప్పుడు. ఒకరు యోగ పరిపూర్ణములో ఉంటే, అప్పుడు ఆయన సంతృప్తి చెందుతాడు. అతడు ఎటువoటి భౌతిక కోరికను కలిగి లేడు. అది పరిపూర్ణము. అతడు ఇంద్రియ తృప్తి లేదా ఫలాపేక్ష కార్యక్రమాలలో పాల్గొనడు. ఫలాపేక్ష కార్యక్రమాలు కూడా, ఫలాపేక్ష కార్యక్రమాలు అంటే మీరు ఇంద్రియ తృప్తి కోసం ఏదైనా సంపాదిస్తున్నారు అని అర్థం. ఒకరు ఆచరణాత్మకంగా ఏదో ఒక ఇంద్రియ తృప్తి చేస్తూ వుంటాడు, ఒకరు ఇంద్రియ తృప్తి కోసం డబ్బును సేకరిస్తూ ఉంటాడు.
కాబట్టి ఫలాపేక్ష కార్యక్రమాలు, ఉదాహరణకు పవిత్ర కార్యక్రమాలు అని అనుకుందాం. పవిత్ర కార్యక్రమాలు, వేదముల ప్రకారం, ప్రతిచోటా, మీరు ధర్మముగా ఉంటే, మీరు కొంత ధనాన్ని దానము చేస్తే, అవి ధర్మ కార్యక్రమాలు. మీరు ఆసుపత్రిని తెరవడానికి కొంత డబ్బు ఇస్తే, మీరు పాఠశాలలు తెరిచేoదుకు, ఉచిత విద్య కొరకు, కొంత డబ్బు ఇస్తే, ఇవి తప్పకుండా ధర్మ కార్యక్రమాలు కాని అవి కూడా ఇంద్రియ తృప్తి కోసం ఉద్దేశించబడింది. నేను విద్యను నేర్పటము కోసం దానము చేశాను అని అనుకుందాము. అప్పుడు నా తదుపరి జీవితంలో నా విద్య కోసం మంచి సౌకర్యాలను పొందుతాను, నేను బాగా విద్యావంతుడను అవుతాను, విద్యావంతుడను కనుక, నేను మంచి పదవులను పొందుతాను. కాని చివరికి, ఆలోచన ఏమిటి? నేను ఒక మంచి పదవిని పొందితే, నేను మంచి స్థానాన్ని పొందితే, దాన్ని ఎలా ఉపయోగించగలను? ఇంద్రియ తృప్తి కోసం. చక్కగా, అంతే. ఎందుకంటే నాకు ఇంక ఏమి తెలియదు. అవి ఫలాపేక్ష కార్యక్రమాలు.. నేను స్వర్గానికి వెళినా, మెరుగైన జీవన ప్రమాణం. ఉదాహరణకు మీ అమెరికాలో, భారత దేశములో కన్నా మెరుగైన జీవన ప్రమాణాలు ఉన్నాయి. కాని దీని అర్థం ఏమిటి, " మెరుగైన జీవన ప్రమాణము"? అదే తినడం, నిద్ర పోవడము, ఒక మెరుగైన విధముగా, అంతే. అంత కన్నా మీరు ఇంకా ఏమీ చేయడము లేదు. వారు కూడా తిoటున్నారు. వారు కొoత ముతక ధాన్యం తిoటున్నారు, మీరు చాలా మంచి వాటిని తిoటున్నారు. కాని తినడం. ఇది తినడం దాటి కాదు.
నా మెరుగైన జీవిత ప్రమాణాలు అంటే ఏ ఆధ్యాత్మిక సాక్షాత్కారము కాదు. మెరుగైన ప్రమాణాలు గల తినడం, నిద్రపోవటం, సంభోగము చేయడము, అంతే. కాబట్టి ఇది ఫలాపేక్ష కార్యక్రమాలు అని పిలుస్తారు. ఫలాపేక్ష కార్యక్రమాలు కూడా మరొకరకమైన ఇంద్రియ తృప్తి, కాని ఇవి ఇంద్రియ తృప్తి ఆధారంగా ఉన్నాయి. యోగ అంటే దేవాది దేవునితో సంబంధము కలిగి ఉండుట. ధ్రువ మహారాజులాగా దేవాదిదేవునితో అనుసంధానింపబడిన వెంటనే. దేవుణ్ణి చూసిన వెంటనే, నారాయణ... ఆ బాలుడు తీవ్రముగా తపస్సులను చేస్తున్నాడు, దేవుణ్ణి చూడడానికి. ఆయన చూసాడు. కాని ఆయన చూసినప్పుడు అప్పుడు ఆయన చెప్పాడు, svāmin kṛtārtho 'smi varaṁ na yāce ( CC Madhya 22.42) నా ప్రియమైన ప్రభు, నేను ఇప్పుడు పూర్తిగా సంతృప్తి చెందాను. నేను ఏదీ అడగాలనుకోవడము లేదు, మీ నుండి ఏవిధమైన వరమును " దీవెన అంటే ఏమిటి? దీవన అంటే మంచి రాజ్యం లేదా చాలా మంచి భార్యను పొందటము, లేదా మంచి ఆహారమును, చాలా బాగుంటుంది. ఈ విషయాలు మనం దీవెనలుగా భావిస్తాము. కాని దేవుడుతో అనుసంధానిoపబడితే, అలాంటి వరము ఆయనకు ఇష్టం లేదు. ఆయన సంతృప్తి చెందుతాడు. పూర్తిగా సంతృప్తి చెందుతాడు. Svāmin kṛtārtho 'smi varaṁ na yāce ( CC Madhya 22.42)
ఈ ధ్రువ మహారాజ చరిత్ర చాలా సార్లు మీకు చెప్పాను, ఆయన ఒక చిన్నపిల్లవాడిగా ఉన్నాడు, అయిదు సంవత్సరాల బాలుడు ఆయన సవతి తల్లి వలన అవమానింపబడ్డాడు. ఆయన తన తండ్రి ఒడిలో కూర్చొని ఉన్నాడు లేదా ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఆయన సవతి తల్లి అన్నది, "నీవు మీ తండ్రి ఒడిలో కూర్చో కూడదు ఎందుకంటే నీవు నా గర్భములో పుట్టలేదు" అతడు క్షత్రియ బాలుడు కనుక, ఆయనకు ఐదు సంవత్సరాల వయస్సు అయినప్పటికీ, ఆయన దీనిని ఒక గొప్ప అవమానముగా తీసుకున్నాడు. అందువలన ఆయన తన సొంత తల్లి దగ్గరకు వెళ్ళాడు. "అమ్మా , సవతి తల్లి నన్ను ఇలా అవమానించింది." ఆయన ఏడుస్తున్నాడు. అతడి తల్లి చెప్పింది, "నా ప్రియమైన పుత్రుడా నేను ఏమి చెయ్యగలను? మీ తండ్రి మీ సవతి తల్లిని ఎక్కువగా ప్రేమిస్తాడు. నేను ఏమి చెయ్యగలను?" లేదు, నా తండ్రి రాజ్యం కావాలి. నాకు ఎలా వస్తుందో చెప్పు? తల్లి చెప్పింది, "నా ప్రియమైన పుత్రుడా, కృష్ణుడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే, నీవు పొందవచ్చు." దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆమె అన్నది, ", దేవుడు అరణ్యంలో ఉన్నాడని మేము విన్నాము. గొప్ప సాధువులు అక్కడకు వెళ్లుతారు కనుగొనడానికి". అందువలన ఆయన అడవికి వెళ్లి, తీవ్ర తపస్సులు చేసాడు. మరియు ఆయన దేవుణ్ణి చూశాడు. కాని ఆయన దేవుణ్ణి చూసినపుడు, నారాయణ, ఆయన తన తండ్రి యొక్క రాజ్యం కోసం ఎక్కువ ఆందోళన చెందలేదు. ఎంత మాత్రము ఆత్రుత లేదు. ఆయన చెప్పాడు, "నా ప్రియమైన ప్రభు, నేను సంతృప్తి చెందాను, పూర్తిగా సంతృప్తి చెందాను. నా రాజ్యం, నా తండ్రి రాజ్యం ఇకపై నాకు అవసరము లేదు." నేను కొన్ని గులకరాళ్లను వెతుకుతున్నాను, కాని నేను విలువైన ఆభరణాలను సంపాదించాను అని పోలిక ఇచ్చాడు. కావున ఆయన మరింత సంతృప్తి చెందాడు.
మీరు వాస్తవముగా దేవుడితో సంబంధము ఏర్పాటు చేసుకున్నప్పుడు అప్పుడు మీరు ఈ భౌతిక ప్రపంచములో అనుభవిస్తున్న దాని కన్నా పది లక్షల సార్లు సంతృప్తి చెందినట్లు భావిస్తారు. అది దేవుడు సాక్షాత్కారము. ఇది యోగ యొక్క పరిపూర్ణత