TE/Prabhupada 0648 - జీవుల స్వభావము పని చేయడము



Lecture on BG 6.2-5 -- Los Angeles, February 14, 1969


భక్తుడు: భాష్యము: "భగవంతుని యొక్క ఆధ్యాత్మిక ప్రేమపూర్వక సేవలో పూర్తిగా నిమగ్నమైతే, ఆయన తన మీద తాను సంతృప్తి చెందుతాడు. అందువలన ఆయన ఆపై ఇంద్రియ తృప్తి లేదా ఫలాపేక్ష కార్యక్రమాలలో నిమగ్నమవ్వడు లేకపోతే, ఒకరు ఇంద్రియ తృప్తిలో నిమగ్నమై ఉండాలి ఎందుకంటే నిమగ్నత లేకుండా ఎవరు జీవించ లేరు "

ప్రభుపాద: అవును, అది విషయము. మనకు నిమగ్నత ఉండాలి. మనము ఆపలేము అదే ఉదాహరణ. మీరు పిల్లవానిని అడుకోవడము నుండి ఆపలేరు. జీవుల స్వభావము పని చేయడము కార్యక్రమాలను ఆపడానికి సాధ్యం కాదు. కాబట్టి ఉదాహరణ చెప్పినట్లుగా, "ఖాళీగా ఉన్న మనస్సు ఒక రాక్షసుని యొక్క నివాసము." మనకు మంచి నిమగ్నత ఉండకపోతే, మీరు ఏదో ఒక అర్థం లేని దానిలో నిమగ్నమవ్వాలి. ఉదాహరణకు పిల్ల వాని వలె , వాడు విద్యలో నిమగ్నమవ్వక పోతే , వాడు చెడిపోతాడు. అదేవిధముగా,మనకు రెండు పనులు: భౌతిక ఇంద్రియ తృప్తి, లేదా కృష్ణ చైతన్యము, లేదా భక్తి-యోగ, లేదా యోగా. నేను యోగా పద్ధతిలో లేనట్లయితే, నేను తప్పనిసరిగా ఇంద్రియ తృప్తిలో ఉండాలి. నేను ఇంద్రియ తృప్తిలో ఉండినట్లయితే, యోగా అనే ప్రశ్న లేదు. చదవడము కొనసాగించు.

భక్తుడు: "కృష్ణ చైతన్యము లేకుండా, ఒకరు ఎల్లపుడు తన లేదా తన వారి యొక్క స్వార్థపూరితమైన కార్యక్రమాలను కోరుకుంటాడు. కానీ కృష్ణుడి యొక్క సంతృప్తి కోసం కృష్ణ చైతన్యము కలిగిన వ్యక్తి ప్రతిదీ చేయగలడు తద్వారా ఇంద్రియ తృప్తి నుండి సంపూర్ణంగా వేరు చేయబడతాడు. అలాంటి సాక్షాత్కారము లేని వ్యక్తి, భౌతిక కోరికలను తప్పించుకోవడానికి యాంత్రికంగా ప్రయత్నించాలి యోగా నిచ్చెన పైభాగంలోకి వెళ్ళే ముందు. "

ప్రభుపాద: "యోగ నిచ్చెన." యోగ నిచ్చెన, ఇది ఒక నిచ్చెనతో పోల్చబడింది. ఉదాహరణకు మెట్ల వలె - ఒక గొప్ప ఆకాశహర్మ్యం ఇంటిలో మెట్లు ఉన్నాయి. కాబట్టి ప్రతి అడుగులో కొంత పురోగతి ఉంది, అది వాస్తవం. కాబట్టి మొత్తం మెట్ల నిచ్చెనను యోగా పద్ధతిగా పిలుస్తారు. కానీ ఒకరు ఐదవ దశలో ఉండవచ్చు, మరొకరు యాభై వ మెట్టు లో ఉండవచ్చు, ఇంకొకరు అయిదు వందల మెట్టు మీద ఉండవచ్చు, ఇంకొకరు ఇంటి పైభాగాన ఉండవచ్చు. కాబట్టి మొత్తం నిచ్చెన యోగ పద్ధతి లేదా మెట్లు అని పిలువబడుతుంది, ఐదవమెట్టులో ఉన్న వ్యక్తి అయినా, యాబై వ మెట్టు మీద ఉన్న వ్యక్తితో సమానంగా ఉండలేడు. లేదా యాబై వ మెట్టు మీద ఉన్న వ్యక్తిని అయిదు వందల మెట్టు మీద ఉన్న వ్యక్తి తో పోల్చకూడదు. అదేవిధముగా, భగవద్గీతలో మీరు కర్మ-యోగ, జ్ఞాన-యోగ, ధ్యాన-యోగా, భక్తి-యోగాను కనుగొంటారు. ఇది యోగా పేరుతో చెప్పబడింది. ఎందుకంటే మొత్తం నిచ్చెన పై అంతస్తుతో కలపబడి ఉన్నది. అందువల్ల ప్రతి పద్ధతి భగవంతునితో సంబంధం కలిగి ఉంది, కృష్ణ. అయితే ప్రతి మనిషి పై అంతస్తులో ఉన్నట్లు కాదు. పై అంతస్తులో ఉన్నవాడు, ఆయన కృష్ణ చైతన్యము లో ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి. ఇతరులు, వారు ఉదాహరణకు ఐదవ లేదా యాభై లేదా ఐదు వందల మెట్టు మీద ఉన్నారు. మొత్తం విషయమును నిచ్చెన అని పిలుస్తారు.