TE/Prabhupada 0649 - మనస్సు చోదకుడు. శరీరం రథము లేదా కారు
Lecture on BG 6.2-5 -- Los Angeles, February 14, 1969
భక్తుడు: శ్లోకము సంఖ్య ఐదు. "ఒక వ్యక్తి తన మనస్సుతో తనకు తాను ఉద్దరించుకోవాలి. అంతే కానీ అధోగతి చెందరాదు. మనస్సు బద్ధజీవాత్మకు శత్రువు మరియు మిత్రుడు కూడా. ( BG 6.5) "
భాష్యము: "సంస్కృత పదం ఆత్మ , ఆత్మ, వివిధ పరిస్థితుల ఆధారంగా, శరీరం, మనస్సు ఆత్మని సూచిస్తాయి. యోగా పద్ధతిలో, మనస్సు మరియు బద్ధజీవాత్మ ప్రత్యేకముగా ముఖ్యమైనవి. మనస్సు అనేది యోగా అభ్యాసానికి కేంద్ర స్థానము కాబట్టి, ఆత్మ ఇక్కడ మనస్సును సూచిస్తుంది. యోగా పద్ధతి యొక్క ఉద్దేశ్యం మనస్సును నియంత్రించడము మరియు ఇంద్రియార్థాల మీద ఆసక్తిని తీసివేయటము. ఇది నొక్కి చెప్పబడింది. మనస్సుకు శిక్షణ ఇవ్వాలి. అది బద్ధజీవాత్మను మాయ నుండి రక్షిస్తుంది
ప్రభుపాద: అష్టాంగ-యోగ పద్ధతిలో, ఈ ఎనిమిది రకముల యోగ పద్ధతి, ధ్యాన,ధారణ - అవి మనస్సును నియంత్రించటానికి ఉద్దేశించబడినవి. మనస్సు, మీరు మనస్సును నియంత్రించుకోకపోతే ... ప్రారంభంలో ఒక మనిషి తన సొంత మనసుతో తనను తాను ఉద్దరించుకోవాలి అని చెప్పబడింది. మనస్సు చోదకుడు. శరీరం రథము లేదా కారు. ఉదాహరణకు మీరు మీ కారును పిలుస్తే, మీ డ్రైవర్ను అడుగుతారు, దయచేసి నన్ను కృష్ణ చైతన్య దేవాలయమునకు తీసుకు వెళ్ళు. డ్రైవర్ ఇక్కడకు మిమ్మల్ని తెస్తాడు మీరు మీ డ్రైవర్ని అడిగితే, "దయచేసి మద్యం దుకణమునకు నన్ను తీసుకు వెళ్ళు." డ్రైవర్ అక్కడకు మిమ్మల్ని తీసుకు వెళ్ళుతాడు. డ్రైవర్ యొక్క పని మీకు నచ్చిన చోటుకు తీసుకు వెళ్ళడము. అదేవిధముగా మీ మనస్సు చోదకుడు. మీరు నియంత్రిoచగలిగితే - కాని డ్రైవర్ మీ స్థానమును తీసుకుంటే, ఆయనకు ఇష్టము వచ్చిన చోటుకు ఆయన మిమ్మల్ని తీసుకెళ్తాడు. అప్పుడు మీరు పతనమవుతారు. అప్పుడు మీ డ్రైవర్ మీ శత్రువు. కాని మీ డ్రైవర్ మీ ఆజ్ఞ ప్రకారము అనుసరిస్తే , అప్పుడు ఆయన మీ స్నేహితుడు. వాస్తవానికి యోగ పద్ధతి అంటే మనస్సును ఆ విధముగా నియంత్రించటం అంతే ఆయన మీ శత్రువుగా కాదు, మీ మిత్రునిగా పని చేస్తాడు.
వాస్తవమునకు మనస్సు నా ప్రకారము పనిచేస్తోంది, ఎందుకంటే నాకు కొంత స్వతంత్రం ఉన్నది, ఎందుకంటే నేను దేవాదిదేవుని యొక్క భాగము. ఆయన పూర్తి స్వాతంత్ర్యం కలిగి వున్నారు, అందువల్ల నాకు కొంత స్వాతంత్రo ఉన్నది. మనస్సు ఆ స్వాతంత్రాన్ని నియంత్రిస్తుంది. మనస్సు చెప్పినట్లయితే, "సరే, నన్ను కృష్ణ చైతన్య దేవాలయమునకు వెళ్ళనివ్వండి" మనస్సు చెప్పగలదు, "ఓ ఏమిటి ఆ అర్థము లేని కృష్ణుడు, ఏదైనా క్లబ్ కు వెళ్దాం." మనస్సు మిమ్మల్ని డ్రైవ్ చేస్తూ ఉంది. కావున మన కృష్ణ చైతన్య ఉద్యమము అంటే మనస్సును కృష్ణుడు పై ఉంచడము. అంతే. ఆయన స్నేహితుడు అవ్వకుండా ఉండలేడు మీరు చూడoడి? ఆయనకు ఎటువoటి అవకాశము లేదు ఏ ఒక్కరికీి చోటు ఇవ్వటానికి కృష్ణుడి మనస్సులో కూర్చున్న వెంటనే, ఉదాహరణకు సూర్యకాంతి ఉన్న వెంటనే, సూర్యుడు ఆకాశంలో ఉన్నాడు, చీకటికి అవకాశము లేదు. అవకాశం లేదు. సూర్యుడు ఉన్నప్పుడు చీకటి ఎన్నడూ రాదు. అదేవిధముగా కృష్ణుడు సూర్యుని వలె ఉంటాడు. మీరు కృష్ణుడిని మనస్సులో ఉంచుకోండి మాయ, చీకటి ఎప్పటికీ రాదు. ఇది మొదటి తరగతి యోగ పద్ధతి. ఇది యోగ పద్ధతి యొక్క పరిపూర్ణము. ఎవరి మనస్సు చాలా బలంగా ఉంటుoదో, ఆ మనస్సు ఎటువంటి చెత్తను లోపలికి రానివ్వదు. అప్పుడు మీ పతనం ఎక్కడ ఉంది? మనస్సు బలంగా ఉంది, డ్రైవర్ బలంగా ఉన్నాడు. ఆయన మిమ్మల్ని ఎక్కడికి తీసుకు వెళ్లలేడు, మీరు కోరుకోకపోతే .
కాబట్టి మొత్తం యోగ పద్ధతి అంటే మనస్సును బలముగా చేసుకొనుట. దేవాదిదేవుడి నుండి వైదొలగ కూడదు. ఇది యోగ పద్ధతి యొక్క పరిపూర్ణము. Sa vai manaḥ kṛṣṇa-padāravindayoḥ ( SB 9.4.18) వ్యక్తులు మనస్సును స్థిరముగా చేసుకొనవలెను ఉదాహరణకు అంబరీష మహారాజు కృష్ణుడిపై మాత్రమే తన మనస్సును స్థిరముగా చేసుకొన్నట్లు, అయనకు మరియు ఒక గొప్ప యోగి, అష్టాంగ-యోగి, దుర్వాస మునికి మధ్య పోరాటం జరిగింది. మహారాజు అంబరీష, ఆయన రాజు, ఆయన గృహస్థుడు, ఆయన పౌండ్ షిల్లింగ్ మనిషి. గృహస్థుడు అంటే ఆయన పౌండ్, షిల్లింగ్, పెన్స్ యొక్క లెక్క చూడవలసి ఉంటుంది. డాలర్లు, సెంట్లు. రాజు, ఆయన వాస్తవానికి రాజు. కాబట్టి దుర్వాస ముని ఒక గొప్ప యోగి. ఆయన ఈ రాజు మీద అసూయపడ్డాడు. అది, "ఇది ఎలా? నేను గొప్ప యోగిని, నేను ఆకాశములో ప్రయాణం చేయగలను, ఈ మనిషి సాధారణ రాజు, ఆయన యోగ పద్ధతి మాయలను చూపించలేడు, అయినప్పటికీ ప్రజలు అతన్ని గౌరవిస్తారు. ఎందుకు? నేను ఆయనకి కొంత పాఠం నేర్పుతాను. " అందువల్ల అతడు రాజుతో కొంత వివాదమును పెట్టుకున్నాడు, అది ఒక సుదీర్గమైన కథ, నేను ఇంకో రోజు చెప్తాను, ఏమైతేనేమి ఆయన ఓడిపోయాడు. ఆయన నారాయణుడి నిర్దేశము ప్రకారము, రాజు, మహారాజు అంబరీషుని యొక్క పాదముల దగ్గర ఆశ్రయం తీసుకున్నాడు . ప్రామాణిక శాస్త్రముల నుండి మనము ఈ సంఘటనలు చూస్తాము, ఆయన కేవలం కృష్ణుడిని తన మనసులో ఉంచుకున్నాడు. ఆయన గొప్ప యోగిని ఓడించాడు. దుర్వాశ ముని, ఆయన ఒక పరిపుర్ణమైన యోగి, ఒక సంవత్సరం లోపల ఆయన ఈ భౌతిక ఆకాశము, మరియు భౌతిక ఆకాశము అవతల ఆధ్యాత్మిక ఆకాశములో ప్రయాణించాడు - నేరుగా దేవుని రాజ్యమునకు, వైకుంఠమునకు, దేవాదిదేవుడిని స్వయముగా చూసాడు. అయినప్పటికీ ఆయన బలహినముగా ఉన్న, ఆయన తిరిగి వచ్చి మహారాజు అoబరీషుని పాదాలపై పడవలసి వచ్చినది. కాని మహారాజు అoబరీషుడు, ఆయన సాధారణ రాజు, ఆయన కేవలం కృష్ణుడి గురించి ఆలోచిస్తున్నాడు, అంతే. ఈ సంఘటనలను మనము చూస్తాము.
అందువల్ల అత్యధిక పరిపూర్ణ యోగ పద్ధతి మనసును నియంత్రిoచటము. మీరు మీలో కృష్ణుడి రెండు కమల పాదములను ఉంచుకున్నట్లయితే మీరు చాలా సులభంగా మనస్సుని నియంత్రించవచ్చు, అంతే. కేవలం కృష్ణుడి గురించి ఆలోచించండి మీరు విజేతగా ఉంటారు. మీరు విజయము సాధిస్తారు మీరు ఉన్నతమైన యోగి అవుతారు. ఎందుకంటే ఏమైనప్పటికీ, యోగ పద్ధతి, యోగ ఇంద్రియ సంయమ్య. యోగ అంటే ఇంద్రియాలను నియంత్రించడము అని అర్థం. ఇంద్రియాల పైన, మనస్సు ఉంది. మీరు మనస్సును నియంత్రిస్తే, ఇంద్రియాలు సహజముగా నియంత్రిoచబడతాయి. మీ నాలుక ఏదో చెత్తను తినాలని కోరుకుంటుంది, కాని మీ మనస్సు బలంగా ఉంటే, మనస్సు చెప్తుంది, "లేదు. మీరు కృష్ణ -ప్రసాదమును తప్ప ఏదీ తినకూడదు, ." నాలుక నియంత్రించబడింది. కాబట్టి మనస్సును ఇంద్రియాలు నియంత్రిస్తాయి. Indriyāṇi parāṇy āhur indriyebhyaḥ paraṁ manaḥ ( BG 3.42) నా శరీరం అంటే ఇంద్రియాలు, కాబట్టి, ఇంద్రియాలు, నా కార్యక్రమాలు అంటే ఇంద్రియ కార్యక్రమాలు, అంతే. కాని ఇంద్రియాలకు పైన మనస్సు ఉంది. మనస్సు పైన బుద్ధి ఉంది. బుద్ధికి పైన ఆత్మ ఉంది. ఒకరు ఆధ్యాత్మిక స్థితి మీద ఉంటే, ఆత్మ స్థితి మీద, తన బుద్ధి ఆధ్యాత్మికం అవుతుంది , ఆయన మనస్సు ఆధ్యాత్మికం అవుతుంది. ఆయన ఇంద్రియాలు ఆధ్యాత్మికం అవుతాయి, ఆయన ఆధ్యాత్మికం అవుతాడు. ఇది కృష్ణ చైతన్యము యొక్క పద్ధతి. వాస్తవమునకు ఆత్మ పని చేస్తుంది, కాని ఆయన ఈ చెత్త మనస్సుకు తన వ్యవహారాధికారమును ఇచ్చాడు. ఆయన నిద్ర పోతున్నాడు. కాని ఆయన నిద్ర లేచి ఉన్నప్పుడు, యజమాని నిద్ర లేచి ఉంటాడు, సేవకుడు ఎటువంటి చెత్త పనులు చేయటానికి లేదు. అదే విధముగా మీరు కృష్ణ చైతన్యములో జాగృతం అయి ఉంటే, మీ బుద్ధి, మీ మనస్సు, వారు ఆ ప్రకారం ఉండాలి. అది ఆధ్యాత్మికరించడము. అది పవిత్రము అవ్వుట అంటారు.
Hṛṣīkeṇa hṛṣīkeśa-sevanaṁ bhaktir ucyate ( CC Madhya 19.170) భక్తి అంటే ఆధ్యాత్మికంగా వ్యవహరించడము. మీరు ఎలా వ్యవహరిస్తారు? మీరు మీ ఇంద్రియాలతో వ్యవహరించాలి. అందువలన మీరు మీ ఇంద్రియాలను ఆధ్యాత్మికరించాలి. ధ్యానం, పని చేయడము ఆపటము అంటే చెత్త పనిని ఆపడము కాని కృష్ణ చైతన్యములో వ్యవహరించడము అనేది ఆధ్యాత్మికము. ఉదాహరణకు మీ ఇంద్రియాలను చెత్త పనులు చేయకుండా అపటము. కాని అది పరిపూర్ణము కాదు. మీరు చక్కగా పని చేయాలి. అప్పుడు అది పరిపూర్ణము. లేకపోతే మీరు మీ ఇంద్రియాలను చక్కగా వ్యవహరించుటకు శిక్షణ ఇవ్వకపోతే, అది మళ్ళీ అర్థంలేని పనులను చేయటానికి పతనము అవుతుంది. కాబట్టి మనము కృష్ణుడికి సేవ చేయడానికి మన ఇంద్రియాలను నిమగ్నము చేయాలి. అప్పుడు పతనం అయ్యే అవకాశం లేదు. అది కృష్ణ చైతన్యము